Krishna Mukunda Murari: మురారి ఈ దెబ్బ నీకు అసలు ఎలా జరిగింది అని భవాని మురారిని అడుగుతుంది. అక్కడ క్యాంపులో చిన్నపిల్లల్ని అలా చూశాక నా మనసు ఊరుకోలేదు పెద్దమ్మ. ఎలాగైనా వాళ్ళని కాపాడాలని అనుకున్నాను. ఆ పిల్లల్ని కాపాడగలిగాను కానీ నన్ను నేను రక్షించుకోలేకపోయాను పెద్దమ్మ అని మురారి అంటాడు. యు అరె గ్రేట్ మ్యాన్, సొసైటీ గురించి నువ్వు ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తూ ఉండాలి మురారి ప్రౌడ్ అఫ్ యు అని భవాని అంటుంది.

నిన్ను నువ్వు కాపాడుకో లేకపోతే ఏమైంది నిన్ను కృష్ణ కాపాడింది కదా అని చూస్తూ ఉంటాడు. కృష్ణ మెట్ల మీద నిలబడి మురారినే వచ్చి తనని తన గదిలోకి తీసుకువెళ్లాలని స్వీకరించి ఇదే మన గది అని చెప్పాలని అనుకుంటుంది. అందుకోసం అందుకోసం మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటుంది. పెద్దమ్మ వెళ్తాను అని మురారి అంటే.. లేదు మురారి కాసేపు కూర్చోవా అని భవాని అంటుంది. ఏంట్రా ఈమధ్య చాలా గ్లామరస్ గా ఉన్నావు ఏమైనా డైట్ ఫాలో అవుతున్నావా అని భవాని అడుగుతుంది అక్కడి నుంచి ఎస్కే పోతాడు మురారి.

మరోవైపు ముకుందా వచ్చి కృష్ణతో మాట్లాడుతూ ఉంటుంది. నీకు ఒక ఫోటో చూపిస్తాను అంటూ కృష్ణ కి ఒక ఫోటో చూస్తుంది . ఆ ఫోటో చూసిన కృష్ణ షాక్ అయిపోయింది. అది చూసిన మురారి ముకుంద మా ఫోటో చూపించింది అని మురారి మనసులో అనుకుంటాడు.
కృష్ణ గదిలోకి వెళ్దాం అంటుంటే.. ఇప్పుడు వద్దు ఇక్కడే ఉందాం కిందకి వెళ్దాం అందరితో కబుర్లు చెబుదామని మురారి అంటాడు. అదేంటి మనం మన గదిలోకి వెళ్దాం పదండి అని కృష్ణ అంటుంది లేదు ఇప్పుడు వద్దు అని మురారి గదిలోకి వెళ్ళకుండా తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడే సీన్లోకి ముకుందా వస్తుంది.

కృష్ణ నేను నీకు ఇందాక ఫోటోస్ చూపించ కదా, ఇప్పుడు ఇంకో సర్ప్రైజ్ చూపిస్తాను అని కృష్ణ కళ్ళు మూసి మురారి పక్కన ఉండగానే ముకుందా కృష్ణ మురారిల గదిలో చేసిన డెకరేషన్ ని ముకుందా చూపించాలని అనుకుంటుంది.

ముకుంద సర్ప్రైజ్ చూపిస్తాను. అనగానే కృష్ణ సర్ప్రైజ్ ఎలా కాదు కళ్ళు మూసి చూపించాలి అని చెబుతుంది. ఇక కృష్ణ కళ్ళు మూసి ముకుంద మురారి వాళ్ళ గదిలోకి తీసుకువెళ్తుంది. మురారి కంగారుపడుతూ ఉంటాడు. ముకుందను తీసుకువెళ్లద్దని రిక్వెస్ట్ చేశాడు. కానీ ముకుందా తన పంతం నెగ్గించుకోవడానికి కృష్ణుని తన గదిలోకి తీసుకువెళ్తుంది. కానీ అక్కడికి వెళ్లిన తరువాత కృష్ణ బదులు ముకుందా షాక్ అవుతుంది . ఎందుకంటే తను చేసిన డెకరేషన్ ప్లేస్ లో వెల్కమ్ కృష్ణ అని రాసి ఉంటుంది . కళ్ళు ఓపెన్ చేయనా ముకుందా అని అంటే మురారి అక్కడ వెల్కమ్ కృష్ణ అని రాసినడం చూసి సంతోషంగా ఐస్ ఓపెన్ చెయ్ కృష్ణ అని చెబుతాడు. అది చూడగానే కృష్ణ సర్ప్రైజ్ అవుతుంది ముకుంద షాక్ అవుతుంది. మురారి మనసులోనే థాంక్యూ గాడ్ అని అనుకుంటాడు ఇదంతా మా అమ్మే చేసింది అని మనసులోనే వాళ్ళ అమ్మకి థాంక్యూ చెబుతాడు.

ఇక కృష్ణ ఇంజక్షన్ రెడీ చేస్తూ ఉంటుంది .అయితే ఇంజక్షన్ నాకేమో అని మురారి కంగారు పడతాడు మీరు రండి మీకు ఇంజక్షన్ చేయాలి కృష్ణ అంటుంది నేను బాగున్నాను కదా.. నాకెందుకు ఇంజక్షన్ అని మురారి అంటాడు. నాకు ఇంజక్షన్ అంటే భయం నేను చేయించుకోను అని మురారి చిన్నపిల్లల లాగా మారం చేస్తూ ఉంటాడు. ఇక కృష్ణ ఎలాగైనా మురారి కి ఇంజక్షన్ చేయాలని తన వెంట పడుతూ ఉంటుంది. కృష్ణ మురారి ఇద్దరూ సంతోషంగా ఉండడం చూసి ముకుందా బాధపడుతుంది.