Nuvvu nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి ని విక్కీ, నువ్వు ఎప్పటికీ నా భార్యవి కాలేవు అని, మన మధ్య అలాంటి బంధం ఉంటుందని అనుకోవద్దు ఈ ఆరు నెలలు మాత్రమే మనం అందరి ముందు నటించాలి అని చెప్తాడు. అను ఆర్య ఇద్దరు చాలా సంతోషంగా గడుపుతారు. పద్మావతి చిలకమ్మ ముందు నటిస్తుంది. విక్కీ తనని బాగా చూసుకుంటున్నట్టు ఇంట్లో అందరినీ నమ్మిస్తుంది.

ఈరోజు402 వ ఎపిసోడ్ లో, భక్త అల్లుళ్లకి టిఫిన్ పెట్టమని చెప్తాడు. పార్వతి టిఫిన్ ఏర్పాటు చేసి పిలుస్తుంది. అప్పుడే అను ఆర్య ఇద్దరు వచ్చేస్తారు విక్కీ పద్మావతి కోసం ఎదురు చూస్తూ ఉండగా వాళ్ళిద్దరు కూడా వచ్చేస్తారు. పద్మావతి అప్పటికే విక్కీ తో గొడవ జరగడం వల్ల డల్ గా కనిపిస్తుంది చిలకమ్మ వెంటనే పద్మావతి తో ఏంటి పెద్దమ్మ గారు ఎలా ఉన్నారు? ఏమన్నా అయిందా అని అడుగుతుంది. వెంటనే పద్మావతి వికీ ఇద్దరు నటించడం స్టార్ట్ చేస్తారు.
Nuvvu Nenu Prema: అను ఆర్యాల ప్రేమ..అందరి ముందు నటిస్తున్న పద్మావతి, విక్కీ…

విక్కీ పద్మావతి నటన..
పద్మావతి కావాలనే అందరి ముందు విక్కీని, మీరు ఇంకా చిన్నపిల్లాడిలానే రెడీ అవుతారు అండి ఆ క్రాఫ్ చూడు ఎలా ఉందో నేను సరి చేస్తాను ఉండండి. మీరు క్రాఫ్ట్ నీట్ గా దువ్వుకుంటేనే హీరోలా ఉంటారు లేదంటే విలన్ లా ఉంటారు అని అంటుంది. విక్కీ కూడా నవ్వుతూ నటిస్తూ ఉంటాడు. ఇక చాల్లే పద్మావతిఅని అంటాడు.ఇద్దరూ కూర్చోండి అమ్మ టిఫిన్ తిందురు గాని అని అంటుంది పార్వతి. కావాలని పద్మావతి ఏం టిఫిన్ చేశారు మా ఆయనకి ఇష్టమైనవి చేశారు కదా అని అంటుంది. అన్ని టిఫిన్లు చూసి ఇక పెట్టండి ఒక పట్టు పెడతాను అంటుంది ముందు విక్కీ బాబుకు పెట్టాలి అంటుంది ఆండాలు. అదే అత్త నా కోసం కాదు మా ఆయన కోసమే పెట్టమని అడుగుతున్నాను అని అంటుంది.కావాలని ఉన్న టిఫిన్ మొత్తం ఒక్కొక్కటి ప్లేట్లో పెడుతూ ఉంటుంది విక్కీ చాలు చాలు అన్న వినకుండా పెడుతుంటుంది ఏంటి కావాలని చేస్తున్నావు కదా అని ఎవరికి వినపడకుండా అంటాడు విక్కి అవును ఆకలిగా ఉంది అన్నారు కదా తినండి అని అంటుంది పద్మావతి. భక్త ఆయన కావాలంటే అడుగుతారు లేమ్మా నువ్వు తిను అని అంటాడు.
Bramhamudi: కావ్య ని పుట్టింటికి వెళ్లకుండా చేసేందుకు రాజ్ ప్రయత్నాలు..చివరికి ఏమైందంటే!

అందరి ముందు దొరికిపోయిన పద్మావతి, విక్కీ..
ఇంతలో చిలకమ్మ మీ ఆయన మీకేం గిఫ్ట్ ఇచ్చాడు అమ్మ అని అంటుంది అనుతో, స్మార్ట్ ఫోన్ ఇచ్చారు అని చెప్తుంది అను అబ్బో మీ ఆయన గారికి మీరంటే చాలా ప్రేమ అమ్మ అని అంటుంది అప్పుడే పద్మావతిని కూడా అడుగుతుంది. పద్మావతి పొలమారుతుంది. విక్కీ కావాలని గట్టిగా కొడుతూ ఉంటాడు తలమీద మంచినీళ్లు తాగమని ఇస్తాడు మంచినీళ్లు తాగాక ఏంటమ్మా నేను అడిగితే చెప్పరేంటి అంటుంది పద్మావతి తో చిలకమ్మా, పోనీ బాబు గారు పద్మావతమ్మ చెప్పట్లేదు మీరేనా చెప్పండి ఏం గిఫ్ట్ ఇచ్చారు మా పద్మావత్ అమ్మకి అని అంటుంది విక్కి తో, ఇద్దరూ బాగా ఆలోచిస్తూ ఉంటారు ఏంటి ఆలోచిస్తున్నారు గిఫ్ట్ ఏమి ఇచ్చారు అంటే ఇద్దరు మాట్లాడరేంటి అని అంటుంది చిలకమ్మా. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పకపోతే వీళ్ళకి డౌట్ వస్తుంది అనుకొని ఒక లేమో వాచి అని ఇంకొకరు గోల్డ్ చైన్ అని అంటారు. అందరూ ఒకసారిగా షాక్ అవుతారు. ఇదేంటి ఇద్దరు వేరువేరుగా చెప్పారు అదేంటి నాతో ఏమి గిఫ్ట్ కొనలేదని చెప్పావు అని అంటాడుఆర్యా. వెంటనే మళ్ళీ కవర్ చేసుకోవడానికి గిఫ్ట్ కొన్నాను ఆన్లైన్లో పెట్టాను అది మనం ఇంటికి వెళ్ళేటప్పటికి వస్తుంది అని అంటాడు విక్కీ. పద్మావతి కూడా మా ఆయనే గోల్డ్ కదా అందుకే గోల్డ్ చైన్ ఎందుకండీ అని చెప్పాను అని అంటుంది. ఎవరికి అనుమానం రాకుండా బాగా కవర్ చేసాం అనుకుంటారు ఇద్దరు. ఇక మేము టిఫిన్ చేసి బయలుదేరుతాం మావయ్య అని అంటాడు విక్కీ. బట్టలు పెట్టించుకొని వెళ్లండి బాబు అని అంటాడు భక్త.
Bramhamudi: కావ్య ని పుట్టింటికి వెళ్లకుండా చేసేందుకు రాజ్ ప్రయత్నాలు..చివరికి ఏమైందంటే!

నిజం కనిపెట్టిన చిలకమ్మా..
చిలకమ్మ పద్మావతి వికీల రూమ్ లోకి వెళుతుంది. రూమ్ లో అన్ని అనుమానంగా కనిపిస్తాయి చిలకమ్మకు, మంచాన్ని చూసి ఏంటి, పూలన్నీ అట్లానే ఉన్నాయి. వీళ్ళ మధ్య ఏమి జరగలేదు అన్నమాట అని అనుకుంటుంది. కొంచెం ముందుకు రాగానే, చాప చూస్తుంది చిలకమ్మ. ఇక్కడ షాప్ ఉన్నది ఏంటి అని అనుకుంటుంది. అక్కడే పాలు కూడా కింద పడిపోవడానికి చూస్తుంది. ఇదేంటి పాలు కూడా ఇక్కడికి కిందపడి అంటే వీళ్ళ మధ్య రాత్రి ఏదో గొడవ జరిగింది అని మంచం మీద ఉన్న దుప్పటి తీయగా దాని కింద అప్పడాలు ఉంటాయి. నేను పెద్దమ్మ గారిని ఏడిపించడానికి దీంట్లో అప్పడాలు పెట్టాను మంచం కింద అవి అట్లానే ఉన్నాయి అంటే మంచం మీద ఎవరు పడుకోలేదన్నమాట, అంటే వీళ్ళ మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఇప్పుడే తెల్చేస్తాను అని వెళ్తుంది చిలకమ్మా.

అత్తారింటికి బయలుదేరిన అక్కాచెల్లెళ్ళు..
చిలకమ్మా నిజం చెబుదామని హాల్లోకి వచ్చేటప్పటికి అప్పుడే పద్మావతి విక్కీ అను ఆర్యాలకు పార్వతి బట్టలు పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా చెప్పాలి నిజాన్ని అని చిలకమ్మా ఆలోచిస్తూ ఉంటుంది. ఆశీర్వాదం తీసుకోండి నాన్న దగ్గర అని అంటుంది. పద్మావతి అను ఇద్దరూ, భక్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి కాళ్లకు దండం పెడతారు. కానీ అనుని మాత్రమే దీవించి వెనక్కి వెళ్తాడు భక్త. పద్మావతి చాలా బాధపడుతుంది. వెళ్ళొస్తామని అను తన తండ్రితో చెప్తుంది. పద్మావతి కూడా వెళ్ళొస్తానని ఆయన అనగానే ముఖం తిప్పుకుంటాడు భక్త. చిలకమ్మ ఇవన్నీ చూస్తూ ఉంటుంది. ఒక అవకాశం దొరికితే చెబుదామని అనుకుంటూ ఉంటుంది. విక్కీ ఆర్య ఇద్దరు కారు దగ్గరికి వెళ్తారు.పద్మావతి వాళ్ళ నాన్నతో ఇలా ఉంటే ఎలా నాన్న నేను ఏ తప్పు చేయలేదు.ఒకసారి పద్మావతి అని ప్రేమగా పిలువు నాన్న అని ప్రాధేయపడుతుంది. పార్వతిపిల్లలు తప్పు చేస్తే క్షమించాలి పెద్దవాళ్లే కదండీ.తన దగ్గరికి తీసుకోండి అని భక్తాతో చెబుతుంది.ఆండాలు కూడా ఎంత కాదనుకున్నా పెంచిన మమకారం ఎక్కడికి పోతుంది చెప్పు అది ఎవరి బిడ్డ మన బిడ్డ ఏ కదా,మనం సంతోషంగా దాన్ని సాగదంపైతేనే అత్తారింట్లో ఆనందంగా ఉంటుంది లేదంటే బాధపడుతూ ఉంటుంది ఈసారి కి దానికి క్షమించేసారా అని అంటుంది అండల్.

అందరూ భక్త కి నచ్చచెపేటప్పటికీ, భక్త నేను ఎవరిని బాధ పెట్టట్లేదమ్మా తను ఈ పెళ్లి చేసుకునేటప్పుడు నాకు ఒక మాట చెప్పు ఉన్నట్లయితే నేను సంతోషంగా పెళ్లి చేసి పంపించే వాడిని కదా నాకు చెప్పకుండా చేసుకున్న వాళ్ళతో నాకేంటి మాటలు అని అంటాడు. పార్వతి చెప్పబోగా ఎవరి మాట వినని పార్వతి నేను అక్కడివాళ్ళు అక్కడ ఉంటే చాలా బాగుంటుంది వెళ్ళమని చెప్పు అని అంటాడు. పద్మావతి అప్పటికే ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో మీ ఎడమకు నువ్వేం బాధపడకు అమ్మి త్వరలోనే అన్ని సర్దుకుంటాయి మీ నాయన మారతాడు అని పార్వతి చెప్తుంది పద్మావతికి.ఇవన్నీ నువ్వే మనసులో పెట్టుకోమాక మీ ఆయనతో సంతోషంగా ఉండు అని అంటుంది.ఒక్కటి గుర్తుపెట్టుకో నాయనా నేను నీకు తుర్ని ఎప్పటికీ తప్పు చేయను అని అంటుంది పద్మావతి భక్తాతో,ఇంతలో ఆర్య పిలుస్తాడు అందరూ వెళ్తారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత చిలకమ్మపార్వతి తో నిజం చెప్తుంది.ఏంటి చిలకమ్మా నువ్వు చెప్పేది అని అంటుంది పార్వతి. అవునమ్మ గారు వాళ్లు మధ్య ఏదో గొడవ జరిగింది. వాళ్ల గదిలోకి వెళ్లి చూస్తే వేసిన మంచం వేసినట్టుగానే ఉంది పాలు కింద పోసి ఉన్నాయి. వాళ్లు పైకి నటిస్తున్నారు అమ్మ గదిలో విడివిడిగా పడుకుంటున్నారు అని నిజం పార్వతికి చెప్తుంది చిలకమ్మ.
రేపటి ఎపిసోడ్ లో,కృష్ణ అరవింద తో నేను ఊరికి వెళ్లాల్సిందే అని గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి విక్కీ వచ్చి నువ్వు మా అక్క కన్నా, ఇంపార్టెంట్ పనిఏమి పెట్టుకోవడానికి వీల్లేదు అని అంటాడు.కృష్ణ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక బిజినెస్ ఐడియా కోసం వెళ్తున్నాము అని అంటాడు. ఏదైనా సరే అది నాకు అనవసరం మా అక్క సంతోషమే నాకు ముఖ్యం అని అంటాడు విక్కి.