NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

CM Revanth Reddy: ప్రజా భవన్ గా మారిన ప్రగతి భవన్ .. ఇక సీఎం రేవంత్ అధికారిక నివాసం ఎక్కడ..?

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి బేగంపేటలో ఉన్న ప్రగతి భవన్ సీఎం అధికార నివాసంగా ఉంది. రెండు టర్మ్ లుగా కేసిఆర్ ప్రగతి భవన్ కేంద్రంగానే పరిపాలన సాగించారు. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రగతి భవన్ ను జ్యోతిరావుపూలే ప్రజా భవనంగా మార్చేశారు. ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తొలగించేశారు. రాష్ట్రంలోని ప్రజలు ఎవరైనా ఎప్పుడైనా ఈ ప్రజా భవన్ కు రావచ్చని..ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ ప్రజా భవన్ లో ప్రతి శుక్రవారం ప్రజా దర్భార్ నిర్వహిస్తామని, ప్రజల నుండి సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ సీఎం అధికారిక నివాసంగా ఉన్న ఈ భవనాన్ని ప్రజా భవన్ గా మార్చడంతో సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం కోసం అధికార యంత్రాంగం పరిశీలన ప్రారంభించింది. ఈ క్రమంలో జూబ్లిహిల్స్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్ఆర్డీ) ప్రాంగణంలో గట్టు మీద ఉన్న బ్లాక్ అనువుగా ఉంటుందని భావించారు.

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నివాసం జూబ్లిహిల్స్ పెద్దమ్మగుడి పరిసరాల్లో ఉండటంతో క్యాంపు కార్యాలయానికి అక్కడికి దగ్గరలోనే ఉన్న హెచ్ఆర్డీ ప్రాంగణం అనువుగా ఉంటుందని అనుకుంటున్నారు. దాదాపు 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హెచ్ఆర్డీ ప్రాంగణంలో ఒకే సారి 150 మంది చొప్పున కూర్చునే నాలుగు కాన్ఫరెన్స్ హాళ్లు, పరిపాలక మండలి సమావేశం కావడానికి వీలుగా బోర్డు రూమ్, 250 మంది కూర్చునే ఆడిటోరియం, అతిధులకు ఆశ్రయం ఇవ్వడానికి మంజీర, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో విడివిడి బ్లాకులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం హెచ్ఆర్డీకి స్వయంగా వెళ్లి పరిశీలించారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

KCR – CM Revanth: కేసీఅర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి .. రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్..ఎందుకంటే..?

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?