25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

సీఎస్ సోమేష్ కుమార్ విషయంలో జెడ్ స్పీడ్‌ లో స్పందించిన కేంద్రం .. హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే రిలీవ్ ఉత్తర్వులు

Share

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్ కుమార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జెడ్ స్పీడ్ లో స్పందించింది. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలంగాణ నుంచి రిలీవ్ కావాలని డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో వెంటనే డీవోపీటీ ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 12 లోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఉత్తర్వులో ఆదేశించింది. తెలంగాణలో సీఎస్ సోమేశ్‌కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమేష్ కుమార్ నియామకానికి సంబంధించి గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)  ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది.

Somesh Kumar

 

రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని కేంద్రం 2017లో హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులను కొట్టేవేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం తీర్పు చెప్పింది. అప్పీలుకు వెళ్లేందుకు తీర్పు అమలును మూడు వారాల పాటు నిలిపివేయాలని సోమేష్ కుమార్ తరపు న్యాయవాది చేసిన అభ్యర్ధనను ధర్మాసనం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కేంద్రం హైకోర్టు తీర్పు ప్రతి వెలువడిన రోజే సోమేష్ కుమార్ ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎస్ సోమేష్ కుమార్ ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసిఆర్ తో భేటీ అయ్యారు. ఏమి చేయాలన్నదానిపై కేసిఆర్ తో చర్చించారు. అయితే ఏపీలో జాయిన్ అయ్యేందుకు సోమేష్ కుమార్ సముఖంగా లేనట్లు తెలుస్తొంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఏపిలో జాయిన్ అయిన వెంటనే స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మరో సారి కీలక వ్యాఖ్యలు చేసిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి


Share

Related posts

Eatela Rajendar: ఈట‌ల‌కు దిమ్మ‌తిరిగి పోయే షాకులు ఇస్తున్న కేసీఆర్‌?

sridhar

ఆగస్టు 5…రామమందిరం భూమిపూజ..ఆ రోజే ఎందుకంటే..!

Special Bureau

కాజల్, సమంత కంటే నాకేం తక్కువ..నేను చేయకూడదా ..?

GRK