Telangana Elections 2023 | Palakurthy Assembly Constituency: ఓటమి ఎరుగని నాయకునిగా ఎర్రబిల్లి దయాకర్ రావు కు పేరుంది. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచాడు. శాసన సభకు ఎన్నికల నగారా మోగిన వేళ ఎర్రబిల్లి దయాకర్ కూడా ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ప్రతి పల్లె ను వదల కుండా తిరుగుతున్నారు. అలుపెరగకుండా ఎన్నికల ప్రచారం లో విస్తృతం గా పర్యటిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన తొలి తెలంగాణ శాసనసభ, 2018లో ఆరవసారి ఎమ్మెల్యే గెలిచిన తరువాత భారత్ రాష్ట్ర సమితి పార్టీలో మొదటి పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా పనిచేస్తున్నాడు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 4, 5, 6,వసారి శాసనసభలో ప్రవేశించారు . డబుల్ హాట్రిక్ ఆరు సార్లు విజయం సాధించిన బహుకొద్ది మంది శాసన సభ్యుల్లో ఒక్కడు. ఈయన మొదట తెలుగు దేశం లో ఉండేవారు. తెలంగాణ ఏర్పాటు లో విశేష కృషి చేశారు.
ఈయన ఇప్పటి వరకు పోటీ చేసిన ప్రతీ ఎలక్షన్ లోనూ గెలిచారు. నియోజకవర్గ అభివృద్ధి కి నిర్విరామం గా కృషి చేసే వ్యక్తి గా ఈయనకు పేరుంది. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కొద్ది గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ తో మంచినీరు ప్లాంట్లు పెట్టాడు. వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువను తెచ్చాడు, గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ తో మంచినీరు ప్లాంట్లు పెట్టాడు. చేసిన పనుల వలన డబుల్ హాట్రిక్ ఆరు సార్లు విజయం సాదించిన బహుకొద్ది మంది శాసన సభ్యుల్లో ఒక్కరుగా రికార్డు ఉంది.
పాలకుర్తి నియోజకవర్గం లో బుధవారం ఆయన వెళ్తు గుర్తూరులో తన కార్యక్రమాన్ని ముగించుకొని హరిపిరాలకు బయల్దేరారు. అక్కడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గోడలు పైకి ఎక్కి మంత్రిని చూస్తున్నారు. ఆది చూసిన ఎర్రబెల్లి తన బండిని దిగి అక్కడ వున్న విద్యార్థులతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పారు. మంచిగా చదువుతున్నారా.?, ఏం చేస్తున్నారు..? మధ్యాహ్న భోజనం అందుతుందా….? అంటూ పిల్లలను అడిగారు. అన్నం తింటున్నాం అని పిల్లలు చెప్పారు. 5వ తరగతి చదువుతున్న తేజ్ కుమార్అనే పిల్లడు తింటుండగా.బువ్వ మంచిగున్నదా..!నాకు పెడతావా?! అని మంత్రి అడిగారు దీంతో ఆ విద్యార్ధి ఏంటో సంతోషంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి తన చేతితో గోరుముద్దలు తినిపించారు. చాలా బాగుంది బిడ్డ.. అంటూ ఆ చిన్నారిని దీవించి దయాకర్ రావు తన యాత్ర ను కొనసాగించారు. ఈ సంఘటన సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతోంది.

దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఎన్నడూ ఓటమి చవిచూడని ఆయనకూడా ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి తండాను, గ్రామాన్ని సందర్శించి స్థానిక ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారు. విజయం కోసం మాంచి ఉత్సాహంగా తిరుగుతున్నారు.
ఇప్పటికే మూడుసార్లు విజయం సాధించిన దయాకర్ రావు తో తలపడగల బలమైన అభ్యర్థిని కోసం కాంగ్రెస్, బీజేపీ సహా విపక్షాలు కిందా మీద పడుతున్నాయి. తొలుత అమెరికా నుంచి ఎన్నారై అభ్యర్థి హనుమండ్ల ఝాన్సీరెడ్డిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావించినా రేవూరి ప్రకాశ్ రెడ్డి ని కూడా ఎర్రబిల్లికి పోటీగా పరిశీలిస్తోంది. ఝాన్సీరెడ్డికి వచ్చే పౌరసత్వ సమస్యలపై ఆ పార్టీ జాగ్రత్తగా నే ఉంది.
ఎర్రబిల్లికి ఈ ప్రాంతంలో మంచి పేరు ఉండడానికి ఆయన బాబ్లీ ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్ళి నిరసన చేయడం కూడా ఒక కారణం. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు కట్టే ప్రాంతానికి వెళ్లగా మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి విమానంలో హైదరాబాదుకు పంపారు. పాలకుర్తి నియోజకవర్గంలోని గుర్తూరులో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటిదాకా ఓటమి లేదు అనే ధోరణి లేకుండా మళ్ళీ గెలవాలని కసిగా ప్రత్నిస్తున్నారు.