NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Election: కామారెడ్డి బరి నుండీ రేవంత్ రెడ్డి .. కాంగ్రెస్ పార్టీ హింట్ ఇచ్చినట్లే(గా)..!

Share

Telangana Election: సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ముఖ్యమంత్రి అభ్యర్ధులే రెండు స్థానాల్లో పోటీ చేస్తుంటారు. ముఖ్యమంత్రి అభ్యర్ధులు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఒక్కో స్థానంలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు, పీఆర్పీ వ్యవస్థాపకుడు చిరంజీవి కూడా గతంలో ఒకొక్క స్థానాల్లో ఓటమి పాలైయ్యారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల క్రమంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ప్రస్తుతం తను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఈ సారి కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండీ కూడా పోటీ చేస్తున్నారు.

కామారెడ్డి నుండి వరుసగా మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో గజ్వేల్ తో పాటు కామారెడ్డిని ఎంచుకున్నారు కేసిఆర్. అయితే గజ్వేల్ లో కేసిఆర్ గెలుపును అడ్డుకోవాలని ఆయన పూర్వ సహచరుడు, ప్రస్తుత బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రత్యర్ధిగా బరిలో నిలుస్తున్నారు. ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గం హూజూరాబాద్ తో పాటు గజ్వెల్ లోనూ పోటీ చేస్తున్నారు.

ఇప్పటికే తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది బీజేపీ. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు ఈటల రాజేందర్. ఏడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. ప్రస్తుతం బీజేపీలో రాజేందర్ అంతటి సీనియర్ ఎమ్మెల్యే ఎవరూ లేదు. దీనికి తోడు బీసీ నేత కావడం, రెండు స్థానాల నుండి పోటీ చేసే అవకాశం బీజేపీ అధిష్టానం ఇవ్వడంతో ఆ పార్టీ సీఎం అభ్యర్ధిగా భావిస్తున్నారు.  

గజ్వెల్ లో కేసిఆర్ పై బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ ప్రత్యర్ధిగా నిలుస్తుండగా, కేసిఆర్ పోటీ చేస్తున్న రెండో స్థానం కామారెడ్డి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బరిలో నిలిచేందుకు పార్టీ అధిష్టానం అంగీకరించినట్లుగా తెలుస్తొంది. ఆ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా పోటీ చేసి ఓటమి పాలవుతున్న సీనియర్ నేత షబ్బీర్ ఆలీకి ప్రత్యామ్నాయంగా నిజామాబాద్ అర్బన్ టికెట్ కేటాయించే అవకాశం ఉందని సమాచారం.

రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లు తో పాటు కామారెడ్డి నుండి పోటీ చేసేందుకు సన్నద్దం అవుతున్నారు. కామారెడ్డి నేతలతో శనివారం గాంధీ భవన్ లో రేవంత్ భేటీ నిర్వహించారు. దీంతో రెండో స్థానంగా కేసిఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిని రేవంత్ రెడ్డి ఎంచుకున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి అక్కడ నుండి బరిలో నిలవడంతో బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆ నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితిత ఏర్పడుతుందని దాని వల్ల ఇతర నియోజకవర్గాలపై దృష్టి సారించలేని పరిస్థితి తీసుకురావడం కోసమే కాంగ్రెస్ ఈ రాజకీయ ఎత్తుగడ అని భావిస్తున్నారు.

ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ అయినప్పటికీ రెండు స్థానాల్లో రేవంత్ రెడ్డికి పోటీ చేసే అవకాశాన్ని పార్టీ అధిష్టానం ఇస్తుంది అంటే కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా పరోక్షంగా వెల్లడించినట్లు అవుతోందని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు కొండా సురేఖ కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి రేసులో అరడజను మంది కంటే పైగా ఉన్నారనే టాక్ నడుస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తాము పని చేస్తామని అన్నారు సురేఖ. గతంలో రాజశేఖరరెడ్డి కి ఏ విధంగా అయితే ప్రజాదరణ ఉందో అదే విధంగా రేవంత్ రెడ్డికి ప్రజాదరణ ఉందనీ. రేవంత్ నే ముఖ్యమంత్రి పదవికి అర్హుడని తెలిపారు.

పీసీసీ చీఫ్ గా ఉన్న నేతలకే గతంలో సీఎం గా కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. అయితే రీసెంట్ గా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా అక్కడి పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ కు సీఎం గా అవకాశం ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రి సిద్దా రామయ్యకు అవకాశం ఇవ్వడంతో తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్ధి కాదని, పార్టీ హైకమాండ్ ఎన్నికల అనంతరం ప్రకటిస్తుందని కాంగ్రెస్ లో రేవంత్ వ్యతిరేక వర్గం నేతలు అంటుంటారు. ఏది ఎలా ఉన్నా రెండేసి స్థానాల్లో పోటీ చేస్తుండటంతో కేసిఆర్, ఈటల, రేవంత్ ఆయా పార్టీల సీఎం అభ్యర్ధులే అన్న టాక్ నడుస్తొంది.

Telangana Elections:  పవన్ కళ్యాణ్ తో మరో సారి భేటీ అయిన బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్


Share

Related posts

పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిష..??

sekhar

ఏంటయ్యా నీ ప్రాబ్లం… ఢిల్లీ బీజేపీ రాజుగారిని కడిగేసిందా?

CMR

జనసేనాని ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ రంగులపై పేర్ని వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇలా..

somaraju sharma