Sri Lakshmi: ప్రస్తుతం ఉన్న సినీ జనరేషన్ మొత్తం అందంతో నిండి ఉంది. అందం మరియు డబ్బు ఉంటేనే ఇండస్ట్రీలోకి వెళ్లి ఎదగ గలరు. లేదంటే ఎవరు మొహం కూడా చూడాలనే చెప్పొచ్చు. అలా తయారయింది మరి నేటితరం సినీ ఇండస్ట్రీ.
ఇక ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ అంటే ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదగడం. కానీ ప్రస్తుత కాలంలో కొందరు ఎన్నో ఆస్తిపాస్తులతో ఇండస్ట్రీకి అడుగు పెడుతుంటే మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తరువాత ఉన్నది కోల్పోతున్నారు. అలా ఇటీవలే అనేకమంది మీడియా ముందుకి వచ్చి తమ బాధను పంచుకుంటున్నారు కూడా. ఇక ఈ కోవా కి చెందినదే శ్రీలక్ష్మి కూడా.
ఎన్నో సినిమాలలో మరియు సీరియల్స్ లో అత్త, అమ్మ, అక్క వంటి పాత్రలలో నటించిన ఈ ముద్దుగుమ్మ కి ప్రస్తుత కాలంలో దీనస్థితి పట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ..” మా నాన్నగారు సినిమా ఇండస్ట్రీకి చెందినవారే. ఆయనకి ఇండస్ట్రీ గురించి అన్ని బాగా తెలుసు. నేను ముందులో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతా అంటే వద్దు అని ఆపారు. కానీ నేను వినకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న.
అనంతరం కూడా నన్ను సినిమాల నుంచి తప్పుకోమని చెప్పారు. కానీ నేను తప్పుకోను అనడంతో.. నా చేతగాని తనమే కదా నిన్ను ఇలా మాట్లాడిస్తుంది.. అంటూ ఫైర్ అయ్యారు. అనంతరం నాన్నకి జాండీస్ వచ్చి అనారోగ్య బారిన పడ్డారు. అప్పుడు నాకు యాక్టింగే అన్నం పెట్టింది. అలా నేను సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి స్థిరపడ్డ. అందరూ ఉండి కూడా అనాధ బ్రతుకు బ్రతికాను ” అంటూ చెప్పుకొచ్చింది శ్రీలక్ష్మి. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.