Guppedantha manasu: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ గుప్పెడంత మనసు. మంచి కథ, కథనంతో ముందుకు సాగుతూ 574 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 7న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో వసు రిషిని జగతి మేడం గురించి నిజం తెలుసుకోండి సార్’ అంటుంది.‘నిజం ఏంటో నాకు తెలుసు అంటాడు రిషి ఆవేశంగా.సార్ జగతీ మేడమ్ ఆ రోజు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో.. ఎప్పుడైనా తెలుసుకున్నారా?’ అంటుంది వసు. తను ఎందుకు వెళ్లిందో? నన్ను వదిలేసి వెళ్తే నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా? తెలుసుకోవడానికి ఏం లేదు వసుధారా అనేసి రిషి కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
వసుపై కోపంతో రిషి :
ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తిగా ముందుకు సాగిందనే చెప్పాలి.కారు లేకపోవడంతో రిషి నడుస్తూనే వెళ్తుంటాడు. రిషి నడిచి వెళ్లడం చూసి గౌతమ్ కారు ఆపి రిషిని ఎక్కించుకుని వెళ్తుంటే వసు గౌతమ్‌కి కాల్ చేస్తుంది. వసు కాల్ చేసిందని అర్థం చేసుకున్న రిషి ఫోన్ అందుకుని ఏంటీ అంటాడు. ‘సార్ మీరు కోపంగా నడిచి వెళ్లిపోయారు కదా మీ దగ్గర కారు లేదు కదా..’అంటూ ఏదో చెప్పబోతుంటే ఫోన్ కట్ చేస్తాడు. ఇక గౌతమ్ ఏమైంది రా అంటే ఏమి మాట్లాడకుండా కారు ముందుకుపోనీ అని విసుక్కుంటాడు రిషి.
తండ్రి ఒడిలో సేదతిరుతున్న రిషి :
ఇక రాత్రి అయ్యేసరికి రిషి వసు మాటల్ని తలుచుకుని బాధపడతాడు. ఎదురుగా మహేంద్ర ఆలోచిస్తూ పడుకోవడం చూసి బాధగా రిషి మహేంద్ర దగ్గరకు వెళ్తాడు. ‘డాడ్ నాకు వసుధారని దూరం చేసుకోవాలని లేదు కానీ తనే గురుదక్షణ అనే టాపిక్ తెచ్చి మా మధ్య దూరం. పెంచుతుంది అంటాడు.అసలు మన మధ్య జగతీ మేడమ్ వచ్చాకే..’ అంటూ ఏదో చెప్పబోతుంటే మహేంద్ర మరి మన మధ్య వసుధార కూడా వచ్చింది కదా రిషి అంటాడు.ఇక్కడ సమస్య మనుషులు రావడం కాదు అని తన ఒళ్ళో రిషిని ప్రేమగా పడుకోబెట్టుకుంటాడు మహేంద్ర.మనిషి కష్టాలకు కోరికలే మూలం రిషి.. ఏది కోరుకోకూడదు. ఏది వద్దు అనుకోకూడదు. వచ్చిన దాన్ని స్వీకరించాలి, రాని దాన్ని వదులుకోవాలి అంటాడు మహేంద్ర. ‘డాడ్ కాసేపు నన్ను ఇలా మీ ఒళ్ళో నన్ను పనుకోనివ్వండి అంటాడు.రిషి మాటలు విని జగతి కూడా పాపం ఏడుస్తుంది.
ఒకరి జ్ఞాపకాల్లో మరొకరు :
ఇక మరునాడు కాలేజ్ లో వసు ఒక చెట్టు దగ్గర రాజు, రాణీ బొమ్మలకు రంగులు వేస్తూ ఉంటుంది. ఆ చెట్టుకు మరోపక్క రిషి కూర్చుని వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలికిడి కావడంతో ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఆ బొమ్మలన్ని రిషికి చూపించి నవ్వుతుంది. అప్పుడే రిషి వసుతో నువ్వు నా వైపునుంచి ఎందుకు ఆలోచించట్లేదు.. ఒక చిన్న విషయాన్ని పట్టుకుని ఎందుకు ఇలా మొండిపట్టుదల అంటాడు రిషి.
అమ్మ అనే మాట ఇద్దరి మధ్య పెట్టిన చిచ్చు :
వసుధారా నేను బంధానికి విలువ ఇస్తున్నాను.. ప్రేమకు విలువ ఇస్తున్నాను’ అంటాడు కోపంగా రిషి. ‘మీరు ప్రేమకు విలువ ఇస్తున్నారు అలాగే నేను కూడా తల్లిప్రేమకు విలువ ఇస్తున్నాను’ అంటుంది వసు.అమ్మని అమ్మా అని పిలవడానికి మీకు ఎందుకింత?’ అంటూ వసు మాట పూర్తి కాకుండానే.. ‘వసుధారా అని అరిచి ఆ సైట్ విజిటింగ్ రిపోర్ట్ జగతీ మేడమ్‌కి ఇచ్చేసి వెళ్లు’ అంటూ కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోతాడు.వసు మాత్రం మనసులో నేను ఎప్పటికైనా జగతీ మేడమ్‌ని అమ్మా అని మీతో పిలిచేలా చేస్తాను’ అనుకుంటుంది.
వసు, రిషిల మధ్య మొదలైన జగడం :
ఇక రిషి కోపంగా లోపలికి వెళ్లి వసు వీడియో చూస్తూ ఉంటాడు. వసు వచ్చి అది విని నాకు తెలియకుండా వీడియో ఎలా తీస్తారు అని చిలిపిగా గొడవ పడుతుంది.మరి నా పర్మీషన్ లేకుండా నువ్వు నా క్యాబిన్లో కూర్చుంటే తప్పులేదా?’ అంటూ రిషి కూడా వసుపై ఎదురుదాడి చేస్తాడు.మరిన్ని వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!