తులసి తో మాట్లాడుతున్న లక్కీ ఎవరు అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అడుగుతాడు.. తులసి ఎవరో అని చెప్పేలోపు రేయ్ లక్కీ నిన్ను ఆ గడ్డం తీసేయవద్దని ఎన్నిసార్లు చెప్పాను.. పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పాను కదా అని లాస్య అంటుంది.. ఈ అబ్బాయి మీ అబ్బయా అని లాస్య ను అడుగుతాడు సామ్రాట్.. అవును సార్ అని అంటుంది.. నందు లక్కితో ఈయన మా బాస్ నమస్తే చెప్పుడు అంటాడు.. నమస్తే సార్ అని అంటాడు.. లక్కీ వాళ్ళ పాప కూడా కాంపిటీషన్లో పాల్గొంటుంది.. ఓ అవునా సార్.. తనకి నేను ఆల్ ది బెస్ట్ చెప్పానని చెప్పండి సార్. ఈ కాంపిటీషన్లో నాకే ఫస్ట్ ప్రైస్ నాకు.. తర్వాత మీ పాపకు అని లక్కీ అంటాడు అని నందు లక్కిని వారిస్తాడు ఎలా అనకూడదు అని.. లాస్య మాత్రం లోలోపల హ్యాపీ గా ఫీల్ అవుతుంది.. కాంపిటీషన్ అంటే పాజిటివ్ గా తీసుకోవాలి అని సామ్రాట్ అంటాడు..
లక్కీని పక్కకు తీసుకువెళ్లి లాస్య చడమడ వయిస్తుంది. అసలు అయినా తులసి ఆంటీ దగ్గరికి ఎందుకు వెళ్ళవు.. తను ఇక్కడికి వచ్చిందని మీకు ఎవరు చెప్పారు అని అంటుంది.. మీరిద్దరూ ఏ విషయాన్ని చిన్నగా మాట్లాడుకోరు కదా.. మీరు మాట్లాడుకుంటే నాకు వినిపించింది అని లక్కీ అంటాడు.. సరే కాంపిటీషన్లో గెలిస్తే నా గురించి చాలా గొప్పగా చెప్పు.. మా మమ్మీ నాకు ఇదంతా చేసింది అని చెప్పమని లాస్య చెబుతుంది.. అసలు నువ్వు నాకు ఏం చేశావు అని లక్కీ అడుగుతాడు.. నాకు ఇదంతా హెల్ప్ చేసింది నందు అంకుల్ అని అంటాడు లక్కీ.. కానీ అందుకు కావలసిన డబ్బులు ఇచ్చింది మాత్రం మీ మమ్మీ అని అంటుంది.. లాస్య మాటలు విన్న నందు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..
హనీ వాళ్ళ మిస్ కి ఈ స్కూల్ జాబ్ కంటే బెస్ట్ ఆపర్చునిటీ వచ్చిందని అక్కడికి ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న తులసి, సామ్రాట్ ఇద్దరు ఆమెను వెతికే పనిలో ఉంటారు. ఈలోపు కాంపిటీషన్ కూడా స్టార్ట్ అయ్యి రెండు పర్ఫామెన్స్ లో అయిపోతాయి. లక్కీ కాంపిటీషన్లో అల్లూరి సీతారామరాజుగా సూపర్ గా పెర్ఫార్మన్స్ చేస్తాడు.. అందరూ తన పర్ఫామెన్స్ కి నుంచొని క్లాప్స్ కొడతారు..
హనీ వాళ్ళ మిస్ రాదని అర్థం చేసుకున్న తులసి ఇకతనే గోపిక వేషం వేసుకొని స్టేజ్ పైకి ఎక్కి హనీ తో పాటు డాన్స్ చేస్తుంది.. తులసి హనీ ఇద్దరు కలిసి పర్ఫామెన్స్ ఇస్తారు.. దాంతో వాళ్ళకి కూడా మంచి మార్కులే పడతాయి.. ఈ కాంపిటీషన్లో ఇద్దరూ ఫైనలైజ్ అయ్యారు. ఒకటి లక్కీ మరొకరు హనీ వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరంటే.. అంటూ రేపటి ఎపిసోడ్ కి సస్పెన్స్ క్రియేట్ చేస్తారు.. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!