బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో. మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో సౌర్యకు నచ్చజెప్పాలని హిమ అనుకుంటే సౌర్య మాత్రం ససేమిరా వినను అని హిమను ఇంట్లో నుండి బయటకు గేంటెస్తుంది.హిమ మాత్రం సౌర్య ఇంటి ముందే వర్షంలో అలానే తడుస్తూ ఉండిపోతుంది బయటకి వచ్చిన జ్వాల అది చూసి.. హిమని ఇంటికి తీసుకుని వెళ్లి వదిలేసి వెళ్ళిపోతుంది.
శోభ మాస్టర్ ప్లాన్:
ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రోమో కూడా చాలా ఎమోషనల్‌గా సాగిందనే చెప్పాలి. ఎలా అయినా నిరూపమ్ ను దక్కించుకోవాలి అని శోభ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది.ఈ క్రమంలోనే రోడ్డు మీద నడిచి వెళ్తున్న జ్వాలను చూసి శోభ అడ్డుపడుతుంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న శోభ మరింత రెచ్చిపోయి హిమపై ఉన్నవి లేనివి చెప్పి జ్వాలకు తనపై మరింత కోపం వచ్చేలా చేయాలనుకుంటుంది.జ్వాలను రోడ్డుపై ఆపిన శోభ నీకు చాలా నిజాలు చెప్పాలని,నువ్వే అసలు సౌర్యవని హిమకి ఎప్పుడు తెలుసో తెలుసా నీకు అంటుంది.
హిమ గురించి తప్పుగా సౌర్యకు చెప్పిన శోభ :
నువ్వు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు వెళ్ళినపుడు నీ శత్రువు గురించి నిరుపమ్ వాళ్లకి చెబుతున్నప్పుడే హిమకు అసలు విషయం తెలుసు..’ అంటుంది శోభ సౌర్యతో. సౌర్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నీకు ఇంకో.‘అసలు రహస్యం చెప్పాలి. నువ్వు మీ డాక్టర్ సాబ్‌ని ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత ఒక అద్భుతమైన ప్లాన్ వేసింది. తనకి క్యాన్సర్ ఉందని అబద్దం చెప్పింది అంటుంది శోభ. సౌర్యకు ఏం అర్థం కాదు. ‘హేయ్ ఏం మాట్లాడుతున్నావ్’ అంటూ గట్టిగా అరుస్తుంది సౌర్య.
శోభ చెంప పగలకొట్టిన జ్వాల:
నేను చెప్పేది నిజం జ్వాల.. హిమ రెండు నెలల కంటే ఎక్కువ బతకనని చెప్పి అందరినీ నమ్మించి,మీ డాక్టర్ సాబ్‌ని ఒప్పించి మరి తన పెళ్లిని సెట్ చేసుకుంది. అంటూ ఒక కథను చక్కగా అల్లి మరి హిమపై మరింత కోపం వచ్చేలా సౌర్యకు చెబుతుంది శోభ. అంతా విన్న సౌర్య ఉన్నటుండి ఒక్కసారిగా శోభ చెంపపగలగొడుతుంది.
జ్వరంతో బాధపడుతున్న జ్వాల:
సీన్ కట్ చేస్తే జ్వాలకు బాగా జ్వరం వచ్చి ఇంట్లో మంచం మీద పడుకుని ఉంటుంది. చంద్రమ్మ, ఇంద్రుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే హిమ కంగారుగా వచ్చి ఏం జరిగింది పిన్నీ?’సౌర్యకు ఏమి.అయింది అంటుంది.ఏమో అమ్మా‘ఒళ్లు అంతా కాలిపోతుందమ్మా.. నాకు చాలా కంగారుగా ఉంది’ అంటుంది కంగారుగా చంద్రమ్మ. అప్పుడు జ్వాల సృహలో ఉండదు కానీ నిద్రలో కలవరిస్తూ ఉంటుంది.‘పిన్నీ నేను మోసపోయాను పిన్నీ’అంటూ పాపం కలవరిస్తూ ఉంటుంది. హిమ. వచ్చిన సంగతి. కూడా సౌర్యకు తెలియదు.అది విన్న హిమ ఒక పక్క బాధపడుతూ, మరో పక్క ఎమోషనల్ అవుతూ ప్రేమగా సౌర్యని చూస్తూ, సౌర్య చెయ్యి మీద ఉన్న. హెచ్ అనే లెటర్ చూస్తూ బాధ పడుతూ ఉంటుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!