NewsOrbit
ట్రెండింగ్

ఆడవాళ్లు ఇంటికే పరిమితం అనే ఆ రోజులలో భారత వాతావరణ శాఖలో అద్భుతాలు సృష్టించిన అన్నా మణి..!!

భారత వాతావరణ సూచన తల్లిగా పేరుందిన అన్నా మణి జయంతి నేడు. 1918 వ సంవత్సరంలో కేరళలోని చాలా చిన్న గ్రామంలో ఆగస్టు 23వ తారీకు అన్నా మణి పుట్టడం జరిగింది. పురుషాధిక్య ఆనాటి సమాజంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని చిన్ననాటి నుండే చదువులో అద్భుతంగా రాణించి భౌతిక శాస్త్రవేత్తగా, ఉపన్యాసకురాలిగా, వాతావరణ నిపుణురాలిగా.. రాణించడం జరిగింది. దీంతో ఆమె 104వ జయంతి సందర్భంగా భారత వాతావరణ సూచన తల్లికి గౌరవార్థం గూగుల్‌ డూడుల్‌ రిలీజ్‌ చేసింది గూగుల్‌.

Anna Mani who created miracles in Indian Meteorological Department
1) అన్నా మణి 12 సంవత్సరాల వయసులోనే పబ్లిక్ గ్రంథాలయంలో అన్ని పుస్తకాలను తిరగసేసింది. తండ్రి ఇంజనీర్ కావటం ఏమో గాని చిన్ననాటి నుండి చదువుపై మంచి ఆసక్తి కనబరిచింది.

2)జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఖాదీ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఆనాటి రోజులలోనే స్త్రీ శక్తికి ఉదాహరణగా నిలిచి దేశభక్తిని ప్రదర్శించడం జరిగింది.

3) ఆడపిల్లలు కేవలం వివాహానికి పరిమితమై ఇంటిలోనే ఉండాలనే కట్టుబాటులు కలిగిన రోజులలో తండ్రిని ఒప్పించి ఉన్నత చదువులు అభ్యసించింది.

4) తన తోటి వాళ్లకి వివాహాలు జరుగుతున్నా గాని అన్నా మణి మాత్రం చదువుకే ప్రాధాన్యత ఇచ్చి తనకి ఇష్టమైన భౌతికశాస్త్రంలో బీఎస్సీ ఆనర్స్ డిగ్రీ సంపాదించడం జరిగింది.

Anna Mani who created miracles in Indian Meteorological Department

5) చదువు పూర్తయిన తర్వాత డాక్టరేట్ పట్టా కోసం సార్ సి.వి.రామన్ లేబరేటరీలో అన్నా మణి జాయిన్ కావడం జరిగింది. అక్కడ కాంతి గురించి ఏకంగా ఐదు రీసెర్చ్ పేపర్లు అందించడం జరిగింది.

6) మద్రాస్ రెసిడెన్సి కాలేజ్ లో స్త్రీ అనే కారణంగా అన్నా మణి అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. ఈ క్రమంలో పీహెచ్.డి పట్టా కూడా అందుకోలేకపోయింది. అయినా గాని అన్నా మణిలో పట్టుదల ఏమాత్రం తగ్గలేదు.

7) ఈ క్రమంలో ఉన్నత విద్య కోసం ఏకంగా అమెరికాకి ఆ రోజుల్లోనే అన్నా మణి పయనం కావడం జరిగింది. అక్కడ వాతావరణ శాస్త్రంలో ఉన్నత విద్యను పూర్తి చేసి..1948లో దేశానికి తిరిగి రావడం జరిగింది.

8) శాస్త్ర పరిశోధనకు తగిన మౌలిక సదుపాయాలు, స్థిరమైన సంస్థలు లేని ఆ రోజుల్లోనే పూణేలోని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ లో అన్నా మణి జాయిన్ అయ్యారు.

Anna Mani who created miracles in Indian Meteorological Department

9) దేశంలో విజ్ఞాన రంగం ఇంకా ప్రారంభ దశలో ఉండగానే భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 వాతావరణ పరికరాలను ప్రామాణికం చేసింది. పలు ప్రాంతాలలో సోలార్ రేడియేషన్ స్థాయిని కొలిచే పరికరాల వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓజోన్ పొర తీరు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, పవన విద్యుత్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి వాతావరణ శాఖలో అనేక అద్భుతాలు సృష్టించారు.

10) 1987లో ఐఎన్‌ఎస్‌ఏ కేఆర్‌ రామనాథన్‌ మెడల్‌తో ఆమెను సత్కరించింది ప్రభుత్వం. ఇన్ని అద్భుతాలు వాతావరణ శాఖలో సృష్టించటంతో అన్నా మణి భారత వాతావరణ శాఖకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్థాయికి చేరుకోవడం జరిగింది. మహాత్మా గాంధీని పూర్తిగా తీసుకున్న ఆమె తన జీవితకాలం పాటు ఖాది వస్త్రాలను ధరించడం జరిగింది. ఎంతసేపు విజ్ఞాన రంగానికి ఏదైనా అందించాలన్న దిశగా అన్నా మణి ఆలోచనలు చేసేవారు. దీంతో జీవితకాలం చివరివరకు ఆమె వివాహం చేసుకోలేదు. 2001వ సంవత్సరం ఆగస్టు 16వ తారీకు గుండె సంబంధిత వ్యాధితో ఆమె మరణించడం జరిగింది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri