Balakrishna: బాలయ్య బాబు గత కొన్ని రోజుల నుండి వరుస పరాజయాల బాటలో కొనసాగుతున్నారు. లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ఏది కూడా విజయం సాధించలేదు. ముఖ్యంగా తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా చిత్రీకరించి.. పరాజయం పాలయ్యారు. ఇటువంటి తరుణంలో కెరియర్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో.. బాలయ్య బాబు బోయపాటి తో సినిమా చేస్తూ ఉండటం పై తాజా సినిమా “అఖండ” పై అభిమానులకు అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
గతంలో బోయపాటి బాలయ్య కెరీర్ చాలా డేంజర్ జోన్ లో పడిన టైంలో.. సింహా, లెజెండ్ లాంటి రెండు మర్చిపోలేని హిట్లు ఇవ్వటంతో ఈ సినిమాతో మళ్లీ బాలయ్య బాబు ని బోయపాటి పైకి లేపుతారు అని అందరూ ఆశిస్తున్నారు. అంతేకాకుండా “అఖండ” తో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హాట్రిక్ విజయం సాధిస్తారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత.. బాలయ్య బాబు లైన్ అప్ చూసుకుంటే.. మొత్తం ఎంటర్టైనర్ రఫ్ యాంగిల్ లో.. హీరో లను చూపించే డైరెక్టర్లను బాలయ్య లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
Read More: Balakrishna: బాలయ్య కొడుకు ఎంట్రీ సినిమా గురించి సెన్సేషనల్ న్యూస్..??
ప్రస్తుతం బోయపాటి అంటే ఊరమాస్ హై వోల్టేజ్.. యాక్షన్ సన్నివేశాలు సినిమాలో పుష్కలంగా చూపించే డైరెక్టర్. ఈ డైరెక్టర్ తర్వాత బాలయ్య బాబు.. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ వంటి స్టార్ డైరెక్టర్ లను లైన్ లో పెట్టడం జరిగింది అని ఇండస్ట్రీ టాక్. ఈ దెబ్బతో బాలయ్య బాబు గ్యారెంటీగా… ఊహించని రీతిలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర.. భారీ సెన్సేషనల్ ప్రాజెక్టులు.. అదరగొట్టే డైరెక్టర్ల ద్వారా రికార్డులు సృష్టించడానికి రెడీగా ఉన్నారని.. ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.