బిగ్ బాస్ 4 : గంగవ్వ విశ్వరూపం..! కోపంతో ఆ కంటెస్టెంట్ చెంప చెళ్ళుమనిపించింది…?

బిగ్బాస్ మూడోవారం ఆట మంచి జోరు మీద ఉంది. నామినేషన్ ప్రక్రియ లో బిగ్ బాస్ పెట్టిన మంటల్లో చిక్కుకున్న కంటెస్టెంట్స్ అందరూ ఉక్కు హృదయం టాస్క్ తో మరింత వేడెక్కిపోయారు. ఇక రోబోలు, మనుషుల మధ్య పోరు జరుగుతూనే ఉంది. రోజంతా జరిగిన ఈ టాస్క్ లో ఇప్పటికే దేవి నాగవల్లి (రోబో) చనిపోగా అభిజిత్ వేసిన మాస్టర్ ప్లాన్ తో రోబోలకు బాగా ఛార్జింగ్ లభించింది.

 

ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు లభిస్తోంది. రొబోలే ప్రతి చోట పైచేయి సాధించడం గమనార్హం. కిడ్నాప్ చేసిన దివిని వదిలిపెట్టడం ఆపై ఇంట్లోకి వచ్చిన మనుషులు రోబోల పై తీవ్ర ఆరోపణలు చేయడం తో నిన్నటి ఎపిసోడ్ బాగా రక్తి కట్టింది. ఇక నేటి ఎపిసోడ్ లో రోబో సభ్యుడైన అవినాష్ అమ్మరాజశేఖర్ కళ్ళల్లో మట్టి కొట్టేశాడు.

మెత్తగా మాట్లాడుతూ వచ్చి పక్కన కూర్చొని మాస్టర్ కు తెలియకుండానే ఛార్జింగ్ పెట్టుకున్నాడు. అప్పటి వరకూ తమకు అవినాష్ తో ఎలాంటి ప్రాబ్లం లేదు అన్న మెహబూబ్ ఒకసారి అవినాష్ చూపించిన తెలివికి ఉలిక్కిపడ్డాడు. ఇక మరోవైపు గంగవ్వ అయితే శివాలెత్తిపోయింది. మోనాల్ దుమ్ముదులిపేసింది. రోబో టీమ్ ఆధీనంలో ఉన్న గ్యాస్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ వైర్ లను మోనాల్ తెంపేయగా అడ్డొచ్చిన అరియానాతో వాగ్వాదానికి దిగింది.

ఇక అలాగే గంగవ్వ సూట్ తీసుకొని వారి టీమ్ కు చేసింది. దానితో కోపం తట్టుకోలేని గంగవ్వ మోనాల్ చెంప పై ఒకటి ఇచ్చినట్లు కనిపిస్తోంది. అంతటితో ఆగకుండా ఆమె తన కోపాన్ని నియంత్రించుకోలేక మోనాల్ పైకి కుర్చీ కూడా విసిరేసింది. మొత్తానికి గంగవ్వ ఫైర్ చూసి అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.