కారు టైర్ల‌లో కొండచిలువ.. చివరికి ఏమైందంటే?

వర్షాకాలం రావడంతో ఎక్కడెక్కడ ఉన్న పాములు, కొండచిలువలు అన్ని బయటకు వచ్చేస్తున్నాయ్. కొన్ని ఘటనలకు సంబంధించిన వీడియోలు అయితే నెట్టింట వైరల్ అవుతున్నాయ్. ఇక అలానే ఇప్పుడు కూడా ఓ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూస్తే మీరు కూడా షాక్ అవుతారు.. అయితే ఇటీవల లాక్ డౌన్ కారణంగా అడవిలో ఉండాల్సిన జంతువు అన్ని కూడా రోడ్లపైకి వచ్చి షాక్ కి గురిచేసాయ్.

 

ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ కొన్ని పాములు ఇంట్లోనూ, ఆటోలోను, కార్ లోను కనిపిస్తూ హాల్ చల్ చేస్తున్నాయ్. ఇక ఇప్పుడు మ‌హారాష్ట్ర‌ రాజ‌ధాని అయినా ముంబైలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈస్ట్ర‌న్ ఎక్స్‌ప్రెస్ హైవే వ‌ద్ద ఓ కొండచిలువ కారు చక్రానికి చుట్టుకుంది. దీంతో కారు హైవేకు పక్కన ఆపడంతో పోలీసులు వెంటనే స్పందించి స‌హాయ‌క బృందాన్ని పిలిచారు. సంఘటన ప్రదేశానికి చేరిన సహాయక బృందం కారునుపైకి ఎత్తి చక్రం నుంచి కొండచిలువను విడిపించారు. అయితే కొండచిలువను విడిపించే సమయంలో దాన్ని ఎంత బయటకు తీసిన కాళ్ళకు చుట్టుకుంటూ అక్కడ ఉన్నవారిని బెదరగొట్టింది.

అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది . ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను చుసిన నెటిజన్లు కొండా చిలువను చూస్తే భయం వేస్తుంది అంటూ కామెంట్లుచేస్తున్నారు. కాగా ఇటీవల ఓ ఆటోలోను 5 అడుగుల కొండచిలువ ప్రత్యేక్షయ్యి షాక్ కి గురి చేసింది. ఇప్పుడు కారు టైరులో కొండచిలువ కనిపించి షాక్ కి గురి చేసింది.