NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అప్రెంటిస్ షిప్ ఉద్యోగాలకు.. SBI భారీ నోటిఫికేషన్

 

యువతకు దేశంలోనే అతి పెద్ద బ్యాంకు లో అప్రెంటిస్ శిక్షణ పొందే అవకాశం లభించింది. మొత్తం 8500 ఖాళీలతో ఎస్ బీఐ (SBI) నోటిఫికేషన్ ను ప్రకటించింది. ఇది శాశ్వత ఉద్యోగం కాదు. పరిమిత కాల శిక్షణ మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1080 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 620, తెలంగాణలో 460 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో అత్యుత్తమ ఉద్యోగ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు.

దరఖాస్తు ఇలా :
వయసు 20-28 ఏళ్లు ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబిసి, ఈ డబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి వారికి అలాంటి రుసుము చెల్లించనవసరం లేదు. చివరి తేదీ 10/12/2020. ఆన్లైన్ పరీక్షను జనవరి 2021లో నిర్వహిస్తారు.

ఎంపిక విధానం :
ఈ అప్రెంటిస్ షిప్ అభ్యర్థుల ఎంపికను 2 దశల్లో నిర్వహిస్తారు. మొదటిది ఆన్లైన్ రాత పరీక్ష, రెండోది ప్రాంతీయ భాషలో రాతపరీక్ష. ఇందులో వంద మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్ & ఫైనాన్షియల్ అవేర్నెస్. ఈ నాలుగు విభాగాల నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 మార్కులు ప్రశ్నాపత్రాన్ని ఇస్తారు. ప్రతి విభాగానికి 15 నిమిషాల చొప్పున సమయాన్ని కేటాయిస్తారు. పరీక్షా సమయం ఒక గంట వ్యవధి. మొదటి దశలో ఎంపికైన వారిని రెండో దశ స్థానిక భాష సామర్ధ్య పరీక్షను నిర్వహిస్తుంది. ఒకవేళ అభ్యర్థులు స్థానిక భాషలో ఒక సబ్జెక్టుగా చదివి ఉంటే లోకల్ లాంగ్వేజి టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ రెండు దశల్లో ఎంపిక అయితే వైద్య పరీక్షలు నిర్వహించి అప్రెంటిస్ షిప్ నకు ఎంపిక చేస్తారు.

మూడేళ్లపాటు శిక్షణ :
డిగ్రీ పూర్తి కాగానే నిజమైన వృత్తి నైపుణ్యాన్ని సాధించాలంటే అప్రెంటిస్ షిప్ చేయాలి. దీనివల్ల అభ్యర్థులు సంస్థలోని వాస్తవ పని వాతావరణానికి అలవాటు పడటంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలరు. అప్రెంటిస్ షిఫ్ చేసిన వారికి ఉద్యోగాల ఎంపిక లోను ప్రాధాన్యం లభిస్తుంది. అయితే ఇది శాశ్వత ఉద్యోగం కాదు. ఎంపికైతే మూడేళ్ల పాటు మాత్రమే అభ్యర్థులు అప్రెంటిస్ శిక్షణ పొందుతారు. వీరికి మొదటి సంవత్సరం రూ.15000, రెండో సంవత్సరం రూ. 16500, మూడవ సంవత్సరం రూ.19000 వేతనంగా ఇస్తారు. ఇతర అలవెన్సులు ఏమీ ఉండవు. దీనికి గతంలో అప్రెంటీస్ శిక్షణ తీసుకున్న, ఉద్యోగ అనుభవం ఉన్నవారు అనర్హులు.

author avatar
bharani jella

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N