NewsOrbit
ట్రెండింగ్

Miss Universe 2023: మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న నికరాగ్వా షెన్నిస్..!!

Share

Miss Universe 2023: 2023 మిస్ యూనివర్స్ కిరీటాన్ని నికరాగ్వాకి చెందిన షెన్నిస్ పలాసియోస్ సొంతం చేసుకోవడం జరిగింది. ఈ ఏడాది మిస్ యూనివర్స్ టైటిల్ కోసం దాదాపు 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు. ఇండియా నుండి ఈ పోటీలో పాల్గొన్న శ్వేత శారదకు నిరాశే ఎదురయ్యింది. ఆమె టాప్ 20కే పరిమితమయ్యారు. శ్వేత శారద మోడలింగ్ రంగంలో మాత్రమే కాదు ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా రాణించింది. ముఖ్యంగా టీవీ షోలలో బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలకు హీరోయిన్స్ కి అద్భుతమైన స్టెప్పులు నేర్పించి మంచి కొరియోగ్రాఫర్ గా కూడా గుర్తింపు ఉంది.

Sheynnis Palacios of Nicaragua who won the Miss Universe crown

ఈ క్రమంలో మోడలింగ్ రంగంలో అద్భుతంగా రాణించి ఈ ఏడాది మిస్ యూనివర్స్ టైటిల్ కోసం పోటీ పడగా.. శ్వేతా సరదా టాప్ 20కే పరిమితం కావలసి వచ్చింది. శాన్ సాల్వడార్ వేదికగా శనివారం రాత్రి జరిగిన 72వ మిస్ యూనివర్స్ పోటీలలో ప్రపంచంలో నుంచి చాలామంది అందగత్తెలు పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఇండియా నుండి శ్వేత శారద పోటీ పడగా అందరు గెలుస్తారని భావించారు కానీ..నికరాగ్వాకి చెందిన షెన్నిస్… గౌనుతో చురుకైన సమాధానాలతో టైటిల్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చరిత్రలో తనకంటూ పేజీలో లెక్కించుకుంది. షెన్నిస్ కు కిరీటాన్ని మాజీ విశ్వసుందరి మాజీ విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌ అలకరించి  విశేష్ తెలియజేయడం జరిగింది.

Sheynnis Palacios of Nicaragua who won the Miss Universe crown

దీంతో సోషల్ మీడియాలో మిస్ యూనివర్స్ షెన్నిస్ నీ నెటిజన్ లు,  సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక ఇదే పోటీలో ఇద్దరు వివాహిత తల్లులు కూడా పాల్గొనడం జరిగింది. గ్వాటెమాలా నుంచి మిచెల్ కోన్, కొలంబియా నుండి మరియా కామిలా అవెల్లా మోంటానేజ్ పోటీలో పాల్గొనడం జరిగింది. పాకిస్తాన్ క్రీడాకారిణి ఎరికా రాబిన్ కూడా ఈ గ్లోబల్ పోటీలో అరంగేట్రం చేశారు. దాదాపు 84 దేశాలకు చెందిన అమ్మాయిలు పోటీ పడగా నికరాగ్వాకి చెందిన 23 ఏళ్ల షెన్నిస్ పలాసియోస్ విజేతగా నిలవడం జరిగింది. ఇక రెండో స్థానంలో థాయిలాండ్ కి చెందిన ఆంటోనియా పోర్సిల్డ్, మూడో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మోరయ్య విల్సన్ నిలిచారు.


Share

Related posts

PPF Account: పీపీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోండిలా..!!

bharani jella

Devisri Prasad: ఒకే ఒక గంటలో ఆ సినిమాకి ట్యూన్స్ ఇచ్చేసిన… దేవి శ్రీ ప్రసాద్..!!

sekhar

Mango Leaves: ఓరిని.. ఎండిన మావిడాకులుకు ఎంత గిరాకీనా.!? షేర్లు కూడా ఇస్తారా..!?

bharani jella