Water Fasting:ఎన్నో ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉపవాసం చాలామందికి తెలిసి ఆచరిస్తూ ఉన్నారు. ఈ ఉపవాసాలు వివిధ రూపాల్లో ఆచరిస్తుంటారు వివిధ ప్రాంతాల్లో, నీటి ఉపవాసం ప్రత్యేకంగా కొన్ని రోజులపాటు నీరు తప్ప ఇంకేమీ తీసుకోకుండా ఉండడమే, ఇదేంటి నీరు తీసుకొని ఇంకేమీ తీసుకోకుండా ఉంటే ఎలా ఉంటాము అని ఆలోచిస్తున్నారా, ఇది ఇప్పటికిప్పుడు కనిపెట్టిన ఉపవాసం కాదు దీన్ని చరిత్ర ఆధ్యాత్మిక, వైద్య పద్ధతులు ద్వారా పాటించేవారు. ఇలాంటి నీటి కొంతమంది వారి మతం ఆధారంగా చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అంటే బరువు తగ్గడానికి, మనం చాలా ఉపవాసాలే చేస్తూ ఉంటాం కానీ ఈ నీటి ఫాస్టింగ్ ఉపవాసం మాత్రం క్రైస్తవం ఇస్లామిక్ జుడాయిజం బౌద్ధమతం ఇలా అనేక ప్రధాన మతాలు ఈ ఉపవాసాన్ని పూర్వకాలంలోనే ఆచరించేవారు. పూర్వకాలంలో జైన మతంలో ఈ ఉపవాసం ఒక భాగంగా ఉండేది. జైన మతస్తులు పుట్టినరోజు వారి ఇంట్లో ఏదైనా విశేషమైన రోజు రెండు వారాలపాటు ఈ నీటి ఉపవాసాన్ని తప్పక పాటించేవారు, నీటిని బాగా మరిగించి పక్కనపెట్టి చల్లారిన తర్వాత వాటిని తీసుకునేవారు ఇక ఆహారం అనేది తీసుకునేవారు కాదు. నీటి ఉపవాసం అంటే కొన్ని రోజులపాటు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా కేవలం నీటిని మాత్రమే తాగుతూ ఉండాలి. ఈ ఉపవాసాన్ని ఒక నిర్దిష్ట సమయం అంటే ఒక 24 గంటలనో,48 గంటలనో, మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం ఎంతవరకు ఉండగలమో మనకి మన నిర్ణయించుకొని ఒక నిర్దిష్ట సమయం వారికి ఈ ఉపవాసం చేస్తే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Benefits for water fasting : నీటి ఉపవాసం అంటే ఏంటో తెలుసుకున్నాం కానీ ఆ నీటి ఉపవాసం చేయడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం..
బరువు తగ్గే విషయంలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కటి రెండు ఫాలో అవుతూ ఉంటారు. కొంతకాలం ఒకటి రెండు నడుస్తూ ఉంటుంది. కీటో డైట్, ప్యాడ్ డైట్, ఆయిల్ డైట్, ఇలాంటివన్నీ కొంతకాలం నడుస్తాయి ఇప్పుడు కొత్తగా మరొక ట్రెండ్ వైరల్ గా మారింది అదే వాటర్ ఫాస్టింగ్..
ఈ వాటర్ ఫాస్టింగ్ వల్ల రక్తపోటు నియంత్రణ, కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోవడం,మెరుగైన జీవక్రియ,ఇలా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ వాటర్ ఫాస్టింగ్ కి ఒక యూనివర్సిటీ వాళ్ళు అధ్యయనం చేసి, మేము దీనికి సమర్థిస్తున్నాము అని చెప్పారు. వేగంగా బరువు తగ్గాలి అని అనుకున్న వాళ్ళు ఈ వాటర్ ఫాస్టింగ్ ని ఎంచుకోవచ్చు. సాధారణంగాఈ వాటర్ ఫాస్టింగ్ చేయడం వల్ల మన శరీర బరువు నాలుగు నుండి ఆరు శాతం వరకు తగ్గించుకోవచ్చు అది ఐదు రోజులు ఈ వాటర్ ఫాస్టింగ్ చేస్తే, ఇక పది రోజులపాటు ఈ వాటర్ ఫాస్టింగ్ చేస్తే రెండు శాతం నుంచి పది శాతం వరకు బరువుని మనం తగ్గించుకోవచ్చు, 15 నుండి 20 రోజులపాటు వాటర్ ఫాస్టింగ్ చేస్తే శరీరంలో బరువు 7 నుంచి 10 శాతం వరకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు, కొంతమంది నిపుణులు వారి పర్యవేక్షణలో తెలుసుకొని, మనకి అందించడం జరిగింది. యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యాయంలో 8 రోజులపాటు 12 మంది కొంత వయస్సు ఉన్న వారి చేత ఈ నీటి ఉపవాసం చేయించారు 8 రోజుల తర్వాత వారిలో బరువు తగ్గడం గమనించారట, అలాగే ఒత్తిడి తగ్గడం, హైపో నాట్రేమియా వంటి స్థాయి గణనీయంగా తగ్గడం జరిగిందిట, అలాగని ఎక్కువ కాలం ఈ ఉపవాసం చేయడం అస్సలు మంచిది కాదని, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నీటి ఉపవాసం చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, రక్తపోటు, శ్వాసకోశకు సంబంధించిన కొన్ని రకాల వ్యాధులు ఎలర్జీస్, ఆస్తమా, సైనిటిస్, చర్మవ్యాధులు కూడా మొటిమలు, సోరియాసిస్, ఇలా కొన్ని రకాల వ్యాధులకు ఈ నీటి ఉపవాసం చేయడం ద్వారా కొంత ఉపశమనం అయితే ఉంటుంది. ఈ నీటి ఉపవాసం చేయాలి అనుకున్న వారు ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్లి వారి శరీరానికి తగినట్టుగా అన్ని రకాల సూచనలు తీసుకొని ఇది ప్రారంభించడం మంచిది. ఉపవాసం చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఉపవాసానికి అనుకూలంగా మీ శరీరాన్ని మీరు మలుచుకొని ఈ వాటర్ ఫాస్టింగ్ మొదలు పెట్టాలి. ఎప్పుడు మొదలు పెడుతున్నాం ఎప్పుడు ముగిస్తామో కూడా ముందే నిర్ణయించుకొని వాటర్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు.

నీటి ఉపవాసం, చేయడం ద్వారా కొంతమందికి అనుకూలించవచ్చు ఈ క్రింది సూచించిన వారు చేయకపోవడమే మంచిదని నిపుణులు నిర్ణయం..
నీటి ఉపవాసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి అని అనుకుంటారు కానీ కొంతమందికి మినహాయింపులు ఉన్నాయి. రూమ్ లోని డాక్టర్ క్లాడియ, లెగ్గేరి చేసిన అధ్యాయం ప్రకారం ఈ క్రింది సూచించిన వారు ఉపవాసం చేయకపోవడం మంచిది.
చిన్నపిల్లలు మరియు 18 సంవత్సరాలు వయస్సు దిగువన ఉన్నవారు ఈ ఉపవాసం చేయకపోవడం మంచిది. చిన్నపిల్లల్లో పెరుగుదల అభివృద్ధికి సంబంధించిన పోషకాలాన్ని వారు ఈ ఉపవాసం చేయడం వల్ల అవి క్షీణిస్తాయి కాబట్టి చిన్నపిల్లలు యుద్ధ వయస్సు ఉన్నవారు చేయకపోవడం మంచిది అని వైద్యులు సూచించారు.
వృద్ధులు అంటే 75 సంవత్సరముల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు, వీరు కూడా వారి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుందేమోనని ఈ ఉపవాసానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు.
గర్భిణీ స్త్రీలు, ఈ ఉపవాసం పాటించకపోవడం మంచిది ఎందుకంటే వారి శరీరానికి కావాల్సిన వారు పౌష్టిక ఆహారం తీసుకోవాలి మరియు బిడ్డని జన్మించేటప్పుడు వారికి శక్తి అవసరం కాబట్టి వారి పౌష్టిక ఆహార అవసరాలు కొన్ని ఉంటాయి అవి గమనించి ఈ ఉపవాసం చేయకపోవడం మంచిది. అలాగే పాలిచ్చే తల్లులు కూడా వారు ఈ ఉపవాసం నుంచి దూరంగా ఉండొచ్చు.

పైన తెలిపిన వారే కాకుండా ప్రతిరోజు ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకునేవారు మరియు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ ఉపవాసం నుంచి దూరంగా ఉండాలి డయాబెటిస్ ద్వారా బాధపడుతున్న వారు శరీరంలో గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉన్నవారు ఈ ఉపవాసంలో చేయకుండా ఉండడం మంచిది. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు కలిగిన వారు కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కలిగిన వారు ఈ ఉపవాసం చేయకుండా ఉండడం మంచిది. ఈ ఉపవాసం చేయడం వల్ల కొంతమందికి కడుపులో ఒక రకమైన ఇన్ఫెక్షన్స్, ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆక్సిజన్ రేట్ తగ్గడం రక్తపోటు, ఇలా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
ఎవరైనా ఈ వాటర్ ఫాస్టింగ్ ఖచ్చితంగా వైద్యుని సంప్రదించిన తరువాతే చేయవలెను. పైన తెలిపిన ప్రక్రియ ద్వారా, సొంతంగా వాటర్ ఫాస్టింగ్ చేయకపోవడం మంచిది.