NewsOrbit
ట్రెండింగ్

తలనీలాలతో ఇలా జరుగుతుందా?…ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు..

తలనీలాలతో ఇలా జరుగుతుందా?...ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఆలయాలలో తలనీలాలు సమర్పించుకునే ఆచారం మనకి ఎప్పటినుండో ఉంది . ఇంచుమించుగా అన్నిపుణ్య క్షేత్రాలలో ఈ  సంప్రదాయం ఉంది. ‘తలనీలాలు సమర్పించడం అంటే తనలోని అహాన్ని తొలగించుకోవడం. తలపై భాగం శని స్థానం. నీలం శనివర్ణం. తల వెంట్రుకలు అహానికి ప్రతీకలు.

తలనీలాలతో ఇలా జరుగుతుందా?...ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు..

నేను, నాది అనే రజోగుణానికి సంకేతాలు. అలాంటి శిరోజాలను స్వామి వారికి సమర్పించడం వల్ల శని దోష నివారణ జరుగుతుంది.అంతే కాకుండా  మన పాపాలు జుట్టుని ఆశ్రయించి ఉంటాయి అని పెద్దలు  చెప్పే మాట .అవి భగవంతుడి కి సమర్పించి మనపాపాలను తొలగించమని కోరుకుంటాము .శిశువు జన్మించినప్పుడు ముందుతల బయటకు వస్తుంది.ఆతలకు ఉండే వెంట్రుకల్లోపూర్వజన్మ పాపాలు ఉంటాయి.అందుకే  పుట్టిన పిల్లలకు తలవెంట్రుకలు తీయడం అనే సంప్రాదయాన్నిఅందరు అనుసరిస్తూ ఉంటారు.

మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తీరాలంటే ఏ దేవుడికో మొక్కు కోవడం అనుకున్నది నెరవేరిన తర్వాత దేవుడికి తలనీలాలు సమర్పించడం అనేది భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న ఆనవాయితీ.తిరుపతిలో అయితే ఎప్పటినుండో తలనీలాలు సమర్పించడం ఆనవాయితీ గా వస్తుంది . ఈ విషయం అందరికీ తెలుసు. కానీ తలనీలాలు సమర్పించిన తర్వాత ఆ జుట్టు ని ఏం చేస్తారో ఎప్పుడైనా  ఆలోచిన్చారా … అసలు తలనీలాలని  ఏంచేస్తారో  తెలుసుకుందాం . ముందుగా జుట్టుని ఫ్యాక్టరీలకు తరలిస్తారు. జుట్టు చిక్కులు పడిపోయి ఉంటుంది కాబట్టి సూదుల సహాయంతో చిక్కు తీస్తారు. తర్వాత జుట్టుని శుభ్రం చేస్తారు.

శుభ్రం చేసిన జుట్టుని దువ్వెనల సహాయంతో దువ్వుతారు. జుట్టు మొత్తాన్ని ఒక లెవెల్ వచ్చేలాగా కట్ చేస్తారు. ఆ జుట్టు ని భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాలకి కూడా ఎగుమతి చేస్తారుఏ ఒక్కరి జుట్టు ఒకే లాగ ఉండదు. కొంతమంది జుట్టు రింగులు తిరిగి ఉంటే, మరికొంతమంది జుట్టు  సాదాగా ఉంటుంది. అలాగే రంగులు కూడా వేరు వేరు ఉంటాయి. అంతేకాకుండా సహజమైన వెంట్రుకలు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జుట్టుకి డిమాండ్ ఉంటుంది.

ఈ  విధం గా తలనీలాలు సమర్పించిన వెంట్రుకలను టీటీడీ ఇలా ఉపయోగిస్తారు. టీటీడీకి ఏడాదికి వంద కోట్ల ఆదాయం తలనీలాల నుంచి వస్తోంది. ఇందులో 90% మహిళల తలనీలాల నుంచి లభిస్తున్నదే. తిరుమలలో ఏటా 2.25 లక్షల మంది మహిళలు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తున్నారు. తలనీలాలను టీటీడీ ఐదు గ్రేడ్లుగా విభజిస్తుంది. మొదటి రకం 32 అంగుళాలకుపైగా పొడవున్నవి. రెండో రకం 16 నుంచి 30 అంగుళాలు, మూడోరకం 10 నుంచి 15, నాలుగో రకం 5 నుంచి 9 అంగుళాలు. ఈ ఐదు గ్రేడ్ల తలనీలాలు ఏటా 135 టన్నులు పోగవుతున్నాయి.

మొదటి గ్రేడు వెంట్రుకలు కిలో రూ.22,494. రెండో రకం రూ.17,223. మూడోరకం రూ.2,833 ధర పలుకుతోంది. నాలుగో రకం రూ.1195. పొట్టిగా ఉండే ఐదోరకం ఈ తలవెంట్రుకలు ఏటా 200 టన్నులు వస్తున్నాయి. ఇవి పురుషులవి. వీటి ధర కిలో రూ.24 మాత్రమే! చూసారా…మనం ఇచ్చే కేశాల వెనుక ఇన్ని లెక్కలు ఉన్నాయి.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri