Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం పూజా విధానం.. ఈ విధంగా పూజ చేస్తే మీ కోరిక కచ్చితంగా నెరవేరుతుంది..!!

varalakshmi-vratham
Share

Varalakshmi Vratam: చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో ఐదో నెల శ్రావణం.. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగే..!! శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం..!! వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు..!! శ్రీ మహావిష్ణువు దేవేరి వరలక్ష్మి అష్టవిధ రూపాలతో సర్వమానవాళి కోరికలను తీరుస్తూ, వారిని ఎల్లవేళలా రక్షిస్తుంది..!! అష్టలక్ష్మి లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది.. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం.. శ్రీహరికి ఇష్టమైన పైగా, విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి..!! సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు..!! వరలక్ష్మీ వ్రతం పూజా విధానం, వ్రత కథ తెలుసుకుందాము..!! ఈ వ్రతం ఆచరించి సకల శుభాలను పొందుదాం..!!

Varalakshmi Vratam: Pooja Vidhanam
Varalakshmi Vratam: Pooja Vidhanam

వరలక్ష్మీ వ్రతం రోజున అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు తెల్లవారుజామునే కుటుంబ సభ్యులందరూ నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడతో చక్కగా అలికి రంగురంగుల ముగ్గులు పెట్టి మండపాన్ని అందంగా అలంకరించాలి. ఆ మండపంలో కొత్త బియ్యం పోసి అందంగా అలంకరించాలి తరువాత కలశాన్ని పెట్టి అందులో మామిడి, మేడి, మర్రి, జువ్వి, రావి చిగుళ్ళను వేయాలి. కలశంపై ఎరుపు రంగు జాకెట్ ముక్క అలంకరించాలి. అందంగా అలంకరించిన మండపంలో ముందు భాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని గానీ చిత్రపటాన్ని గానీ ఉంచాలి. ముందుగా పసుపుతో గణపతి కి పూజ చేసి కలశంలోని వరలక్ష్మీ దేవిని ఆవాహన చేయాలి. షోడశోపచార పూజ, అధాంగ పూజ చేయాలి. తరువాత లక్ష్మీ దేవి అష్టోత్తర శతనామావళి తో వరలక్ష్మీ దేవిని పూజించాలి. నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి. చివరిగా కర్పూర నీరాజనం మంత్రపుష్పం సమర్పించి. మంగళ హారతి ఇవ్వాలి. ఇప్పుడు తోరగ్రంథి పూజ చేసి మంత్రం పఠిస్తూ తోర బంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలు, పండ్లు, ప్రసాదాలు సమర్పించాలి. చివరిగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనం ఇవ్వాలి..

Varalakshmi Vratam Pooja Vidhanam
Varalakshmi Vratam Pooja Vidhanam

వరలక్ష్మి వ్రత కథ :

ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకలమునిగణ సంసేవితుడైయున్న ఆ సమయంబున పార్వతీ దేవి వినయంబుగా ప్రాణేశ్వరా..!! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగి యుండుటకు ఆచరించదగిన వ్రతమేదైనా ఉంటే తెలుపమని కోరెను.. అంతట పరమేశ్వరుడు దేవి..! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును..!! దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయాలి.. అది విని ఆమె స్వామి వ్రతం ఎలా ఆచరించవలెనో చెప్పమని అడిగెను.. ఆ వ్రతాన్ని ఇంతకుముందు ఎవరూ ఆచరించి తరించినవారు తెలుపమని అర్ధించెను.. అంతటా పరమేశ్వరుడు దేవి ఆ వ్రత కథను చెప్పెదను వినుము అని శివుడు కథ చెప్పను..

పూర్వం మగధ రాజ్యమున కుండిన నగరమను ఒక పురము గలదు అది బహుసుందరమయిన పట్టణము అందు చారుమతి యను ఒక సాధ్వి ఉంది ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో చారుమతి సద్గుణములకు నేను నీకు కావలియు వరములనొసగు తలంపు నాకు కలిగెను కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద నని చెప్పి మాయమయ్యను ఆమె మేల్కొని తన స్వప్న వృత్తాంతము తన భర్తకు అతను మిక్కిలి సంతోషించి ఆమెను ఆ వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను ఆస్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అంత లో శ్రావణ మాసం రానే వచ్చింది అంతట చారుమతి వారందరితో కలిసి ఇ నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి ఒక చోట ఆవు పేడతో అలికి బియ్యముతో మండపం ఏర్పాటు చేసి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి సాయంత్రమైనంత నధిక భక్తితో

లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం.!
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం.!
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః బ్రహ్మేంద్ర గంగాధరాం.!
త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియం..!!

అని స్తుతించి తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి కట్టుకొని యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు కిందికి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కానీ భక్తి తప్పక వారు రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను. మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి యిండ్లు సకల సంపత్సమ్తృధ్ధము లయ్యేను. పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి. నాటి నుంచి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేస్తున్నారు. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారు చేయవచ్చ. ఈ వ్రతమును ఆచరించడం వలన వరలక్ష్మి ప్రసాదము కలిగి సకల కార్యములు విజయము చేకూరును.. వరలక్ష్మి దేవి ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మీ కోర్కెలను ఖచ్చితంగా తీరుస్తుంది.. అమ్మవారిని భక్తితో పూజిస్తే తప్పకుండా కరుణిస్తుంది..


Share

Related posts

మండలికి ‘మర్రి’ ఎంపిక..? రద్దు లేనట్టేనా..?

somaraju sharma

మరికొన్ని రాష్ట్రాలులో పొడిగించనున్న లాక్‌డౌన్

Siva Prasad

Ys Jagan: ఏపీలో కరోనా విషయంలో ఊరట కలిగించే వార్తే ఇది..!!

sekhar