విజయవాడలో టీడీపీ నిరసనలు

విజయవాడ, జనవరి5:  విజయవాడలో దర్నాచౌక్ వద్ద టీడీపీ నేతలు నిరసన కర్యక్రమాన్ని చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఎంపీల సస్పెండ్ చేయడాన్నీ, కాకినాడలో చంద్రబాబును అడ్డుకోవడాన్ని నిరశిస్తూ  టీడీపీ శ్రేణులు దర్నా నిర్వహించారు.

కేశినేని నాని మాట్లాడుతూ బిజెపి నేతలు  పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యన్ని మట్టిలో కలిపేశారని విమర్శించారు. సుమిత్ర మహాజన్ బిజెపికి స్వికర్‌గా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. 2019లో బిజెపికి ఓటమి తప్పదని కేశినేని జ్యోస్యం చేప్పారు.