NewsOrbit
Right Side Videos

పాపను కాపాడిన పోలీసు సమయస్ఫూర్తి!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

పన్నెండు రోజుల పాప సీసాలోంచి పాలు తాగుతుండగా గొంతుకు అడ్డం పడ్డాయి. ఊపిరి కష్టమైపోయింది. తల్లి పాపను తీసుకుని ఆసుపత్రికి వెళుతోంది. ఎమర్జన్సీ కదా, కారు వేగంగా నడుపుతోంది. పరిమితికి మించిన వేగంతో కారు నడుపుతున్నందుకు ఓ పోలీసు అధికారి ఆ కారును ఆపాడు. పాపకు ఏమయిందోనని ఆందోళనగా ఉంది కదూ?

పాపకు ఏం కాలేదు. నిజానికి పోలీసు అధికారి కారును ఆపినందువల్లనే ఆ పాప ప్రాణాలు నిలిచాయామో! అమెరికా, దక్షిణ కరోలీనాలో ఈ సంఘటన జరిగింది. బర్కిలీ కౌంటీ డిప్యూటీ డబ్ల్యు కింబ్రో వేగంగా వెళుతున్న కారు ఆపగానే అందులో ఉన్న పాప తల్లి విషయం వివరించింది. కింబ్రో పాపను చేతుల్లోకి తీసుకున్నాడు. వెంటనే ఏదో ఒకటి చేయకపోతే కష్టం అన్న విషయం అతనికి అర్ధం అయింది.

వెంటనే ఆతను పాపకు ప్రాధమిక చికిత్స మొదలుపెట్టాడు. పాప గుండెలపై మసాజ్ చేస్తూ, గాలి లోపలకు వెళ్లేందుకు పాప నోట్లో వేలు పెట్టి ఆడిస్తూ ఎమర్జెన్సీ వైద్య సహాయం వచ్చేంతవరకూ పాప ప్రాణాలు పోకుండా కాపాడాడు. కింబ్రో చేసిన పని వీడియోను బర్కిలీ కౌంటీ షరీఫ్ కార్యాలయం ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. దీనికి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది.

Video Courtesy: Inside Edition

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment