NewsOrbit
హెల్త్

మీ పిల్లలని ఇలా పెంచుతున్నారా ? ఒక్కసారి చెక్ చేసుకోండీ !

మీ పిల్లలని ఇలా పెంచుతున్నారా ? ఒక్కసారి చెక్ చేసుకోండీ !

మొక్కైవంగనిది మానై వంగుతుందా అందుకే చిన్నానాటి నుంచే క్రమశిక్షణగా పెంచాలంటారు కొందరు. ఈ విషయంలో ఓ పురాణ శ్లోకం చెప్పుకోవాలి. ఇది పిల్లలను ఎలా పెంచాలో అద్భుతంగా చెప్పేసింది. ఆ శ్లోకంఏమిటో తెలుసుకుందాం.

రాజవత్‌ పంచవర్షాణి | దశ వర్షాణి దాసవత్‌ |
ప్రాప్తే తు షోడశే వర్షే.. | పుత్రం  మిత్రవదాచరేత్‌ ||
మీ పిల్లలని ఇలా పెంచుతున్నారా ? ఒక్కసారి చెక్ చేసుకోండీ !
‘రాజవత్‌ పంచవర్షాణి’ అంటే పిల్లల్ని అయిదేళ్లవరకు రాజ మర్యాదలతో పెంచాలి.అంటే వారికీ స్నానం చేయించడం గోరుముద్దలు తినిపించడం ,ఆటలు ఆడించడం, జోల పాడి  నిద్ర పుచ్చడం, వారిని కంటికి రెప్పలాగా కాపాడడం, వంటి సమస్త సేవలు వారికీ చేయవలిసిందే.  దశ వర్షాణి దాసవత్‌ | అంటే పదేళ్లు వచ్చే వరకు దాసులుగా పెంచాలి. వారికీ పనులు చెప్పడం ,పనులు నేర్పడం ,ఇంటి  పనుల్లో బయట  పనులు  వారికీ  తగ్గట్టుగా  వారికి పనులు అప్పచెప్పాలి. పనుల్లో వారి  సహాయం పొందాలి . చిన్నవాళ్లు  వాళ్ళకి ఏమి వస్తుంది అని అనుకోకండి ,ఆ వయ్యస్సులో పిల్లలు చాల బాగా నేర్చుకుంటారు . జీవితం లో అది ఒక ముఖ్యమైన దశ అని గుర్తు పెట్టుకోండి .

పదహారేళ్ల నుంచి మిత్రులుగా చూడాలి, అంటే వారి వయ్యస్సులో మిమ్మల్ని ఉంచి చుడండి ఆ వయ్యస్సులో వాళ్ళ ఆలోచనలు , స్నేహాలు వారి శరీర మార్పులు అన్ని వారికీ  కొత్తగానే  ఉంటాయి . ఆ వయ్యస్సులో వారిని మిత్రులుగా చూస్తేనే వారు ప్రతి విషయం మీతో పంచుకుంటారు.  మీ సలహాలు సూచనలు పాటిస్తారు . చెడు మార్గంలో పడకుండా కాపాడుకోవడానికి ఇది ఒక మంచి మార్గము అని  చెప్పాలి . ఇలాకాకుండా  వారు తెలిసి తెలియక చేసే తప్పులను అస్తమాను ఎత్తిచూపుతూ తిట్టడం ,కొట్టడం నలుగురిలో బయట పెట్టడం వంటివి చేయడం వలన మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది . కాబట్టి వారితో స్నేహం చేయమని  ఈ శ్లోకం అర్థం. ఈ శ్లోకంలో పుత్రం అంటూ చెప్పినా.. ఇది పుత్రుడు, పుత్రికలు ఇద్దరికీ వర్తిస్తుంది. ఈ కాలంలో పుత్రికలు, పుత్రులు అంటూ తేడా ఏముంది ఈ రోజుల్లో ఆడపిల్లలు,మగపిల్లలు ఇద్దరుకూడా ఇంటిపని బయట పని నేర్చుకోవడం ఎంతో అవసరం.లేదు ఆడపని మగ పని అని విడదీస్తే మాత్రం మీ పిల్లలకు తిప్పలు తప్పవు అని గమనించాలి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri