NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఒక్కసారి భూగోళం జాతకం చూడండి .. ఎందుకిలా జరుగుతోందో తెలుస్తుంది !

ఇప్పుడు కరోనా మహమ్మారి బారిన పడి భూమికి దుస్థితి ఎందుకు వచ్చింది అని ఏడుస్తున్నారు కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఉపద్రవం వచ్చి భూమిపై ఉన్న డైనోసార్లు అన్ని అంతమైపోతేనే మనం ఇప్పుడు ఇలా బ్రతుకుతున్నాం. అవి కనుక ఉండి ఉంటే అసలు మానవుడి ఉనికే భూమిపై ఉండేది కాదు. సరే అదంటే ఉపద్రవం…. కానీ దీనంతటికీ కారణం మనిషి స్వయంకృతాపరాధమే అని వాదించవచ్చు కానీ నిజానికి ఇలాంటి ఉపద్రవాలను శాసిస్తాయి అని చెప్పబడే గ్రహాల స్థితిగతులు కూడా మనిషి చేసే పనులని ప్రభావితం చేస్తాయి కదా. ఇక ఇలాంటి కష్టకాలంలో.. సంవత్సరం గ్రహాల కదలికలు ఎలా ఉన్నాయో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

Define and Explain Revolution in Astronomy

మనల్ని శాసించే గ్రహాలనే మనం శాసించగలమా?

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని అందరికి తెలిసిందే. అయితే భూమి గుండ్రంగా ఉన్నందున సూర్యుడి చుట్టూ ప్రదక్షణాఅలు చేస్తూ ఉంటుంది అన్నందుకే ఖగోళ శాస్త్రవేత్తలను నడివీధిలో ఉరితీసిన జాతి మనది. బల్లపరుపుగా ఉన్న భూమి చుట్టూ సూర్యుడే భయపడి తిరుగుతున్నాడు అన్నది శతాబ్దాల పాటు నమ్మిన సమాజాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం బాగా నాగరికత సాధించి, నిజాలు తెలుసుకొని ఏకంగా గ్రహాలపై స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు మరియు వాటి సంపదను దోచుకునేందుకు బయలుదేరుతున్నాం. కానీ మన అదృష్టం కొద్దీ గ్రహాలు ఇంకా వాటి కక్ష తప్పలేదు. ఎప్పటి నుండో వాటి స్థిర కక్స్యల్లోనే అవి అనాదిగా తిరుగుతున్నాయి. లేకపోతే పాటికి ఒకదానితో ఒకటి ఢీకొని మన దుంప తెంచేవి. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్లే శూన్యంలో కూడా ఏదో ఒక శక్తి ఉండాలి. ఇక గ్రహాల కదలికలను బట్టి మనిషి జాతకం మారుతుందని ఎప్పటినుండో పౌరోహితులు నొక్కి వక్కాణిస్తున్నారు. దాని నుండి పుట్టుకొచ్చినవే నక్షత్రాలు, గోత్రాలు, జాతకాలు అన్నీనూ. మరి మనపై ఎంతో ప్రభావం చూపే గ్రహాలను మన అంతరిక్షనౌకలు వేసుకొని వెళ్లి ప్రభావితం చేయడమే ఇలాంటి పరిణామాలకు దారి తీసింది అని కొందరి వాదన.

ఇంతకీ మన శని మామ సంగతి ఏంటి

ఒరేయ్ నాకు శని పట్టింది రా…!” నాకు శనిగ్రహం దాపురించింది అన్న మాటలను మనం ఎన్నోసార్లు ఎన్నో చోట్ల వినివుంటాం. ఇంతకీ కరోనా సంక్షోభ సమయంలో శని ఎక్కడ ఉన్నాడు? సమయంలో నిజానికి శని రుజుమార్గం లో నడవడం లేదట.. గురుడు కూడా సరిగా నడవడం లేదట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే శని సరిగ్గా నడిస్తేనే కదా జనాలకి కష్టాలు వస్తాయి…. అదే దారి తప్పి నడక మరచి తన ఇళ్ళు మరచిపోతే మనల్ని ఇంకేమీ బాధ పెట్టగలడు..? మన బతుకులు పాటికే బాగుపడిపోవాలి కదా అని అనుకుంటారు చాలా మంది. ఇలాంటి మాటలకు చాలా మంది ఇప్పటికే హర్ట్ అయిపోయారు. వారి వాదన ప్రకారం శని ప్రభావం మాములుగా ఉంటేనే మన సీను సితార్ అయిపోతుంది.. ఇక అదే శని అడ్డదిడ్డంగా నడిస్తే ఎంత విధ్వంసం జరుగుతుంది మరియు ఎలాంటి పరిణామాలకు కారణం అవుతాడు అన్న అర్థంలో శని దశను అన్వయించుకోవాలి అని క్లాస్ పీకారు. అయితే ఈసారి మన శని మామ మన మీద గట్టిగానే పగపట్టాడు అని అంతా అనుకుంటున్న సమయంలో సంవత్సరం సెప్టెంబర్ 29 నాటి శని వంకరటింకర రివర్స్ గేర్ సెట్ అవుతుంది. అంటే అప్పటికి కరోనా ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా ఉండొచ్చు అని అంతా ఆశతో ఎదురు చూస్తున్నారు.

పాజిటివ్ నెగిటివ్ అయింది నెగిటివ్ పాజిటివ్ అయింది

మానవలోకానికి ఊతపదం ఆల్వేస్ బి పాజిటివ్. అలాంటి పాజిటివ్ ఇప్పుడు నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు అన్ని గ్రహాల్లో బజ్ వర్డ్ బి నెగిటివ్. కరోనా బారినపడకుండా పరీక్షలు లేకుండానే పిల్లలు పాస్ చేసి విపరీతమైన నెగటివిటిని ప్రేమిస్తున్నాం. ఎవరైనా కరోనా పరీక్షకు వెళ్తే నెగిటివ్ రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. పాజిటివ్ అన్న పదం వింటేనే ఏదో పాము కాటేసిన ఉలిక్కిపడుతున్నారు. కళ్ళల్లో వత్తులు వేసుకుని మరి నెగటివ్ కోసం నిరీక్షిస్తున్నారు. హ్యాపీ నెగిటివ్ టైం అని ఇతరుల అభినందించాల్సిన రోజులు వచ్చేశాయి. ఇదంతా కూడా గ్రహచారం చలవే అని అంటున్నారు. అసలు మనకి గ్రహచారం అనే పదమే ఒక నెగిటివ్ సౌండింగ్ అయిపోయింది. గ్రహం అంటే పట్టి ఉంచేది కాదు పట్టుకునేది అని అర్థం. చరం అంటే కదలిక. సో, గ్రహచారం అంటే చాలా స్పష్టంగా గ్రహాల కదలికల అని అర్థం కాని మనకు మాత్రం ఇన్ని రోజులు గ్రహచారం అంటే నెగిటివ్ మీనింగ్ స్థిరపడింది. నా గ్రహచరం ఇలా ఏడ్చింది అని అంటే ఎవరైనా అతని రోజులు నెగటివ్ గానే మనం అర్థం చేసుకున్నాం కాబట్టి మనమే పాజిటివ్ ను నెగటివ్ గా ఇన్ని రోజులు అనుకుంటూ దశకు చేరుకుని ఏది పాజిటివ్ఏది నెగటివ్ అన్నది తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం.

ఏది కరెక్ట్ అంటే…

గ్రహచారం గ్రహాల కదలిక, ఎనర్జీ, పాజిటివ్, నెగిటివ్ అనే వాటిని నమ్మేవారు నమ్ముతారు. నమ్మనివారు విధంగా మన పనులు ఉంటాయో అవే మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయి అని భావిస్తారు. అందులోనూ తప్పులేదు. ఎవరి నమ్మకం వారిది. కానీ దేన్నీ నమ్మకుండా ఎటువంటి నమ్మకం లేకుండా మనిషి అయితే తన జీవితాన్ని ముందుకు సాగించలేడు. కాబట్టి ఎవరి నమ్మకం వల్లనైనా తప్పు జరిగింది లేదు తక్కువ జరిగేది లేదు. కానీ పరిస్థితికు అనుగుణంగా మన చర్యలను కొనసాగిస్తూ వర్తమానాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగడం మంచిది కదా...

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!