NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ కోసమే ముద్రగడ అస్త్రసన్యాసం ? షాకింగ్ ప్రూఫ్ చెప్పే చేదునిజం ! 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కాపుల రిజర్వేషన్ ఉద్యమానికి ముద్రగడ పద్మనాభం నాయకత్వం వహించారు. చంద్రబాబు 2014 ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇదే టైంలో చంద్రబాబు కి పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలపడంతో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ లో ఖచ్చితంగా కాపులను చేరుస్తారు అని ఆ వర్గం భావించింది. అనుకున్నట్టుగానే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ కాపుల రిజర్వేషన్ అంశం విషయంలో సరైన రీతిలో చంద్రబాబు పట్టించుకోకపోవడంతో కాపుల తరుపున ఉద్యమానికి దిగారు ముద్రగడ పద్మనాభం.

 

Mudragada Padmanabham writes to Jagan Mohan Reddy over Sand rowకాకినాడ దగ్గర తుని ప్రాంతం వద్ద భారీ ఎత్తున ముద్రగడ పద్మనాభం చంద్రబాబు ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి నాంది పలికారు. ఇదే సమయములో వేదిక వద్ద అటువైపుగా వెళ్తున్న తుని ట్రైన్ ని ఉద్యమకారులు తగల పెట్టడం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఇదంతా జగన్ పని అని ముద్రగడ పద్మనాభం వెనుక జగన్ ఉన్నారని రాయలసీమ వ్యక్తుల చేత ట్రైన్ ని తగల బెట్టించ్చారని ఆ ఘటనపై చంద్రబాబు సర్కార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అదేరీతిలో ముద్రగడ పద్మనాభం ని జగన్ మనిషి అని తీవ్ర స్థాయిలో ప్రచారం చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైయస్ జగన్ ఇటీవల “వైయస్సార్ కాపు కార్పొరేషన్” పేరిట కాపులకు కొన్ని మేలు లు చేయడం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో కాపు రిజర్వేషన్ అంశం మళ్లీ తెరపైకి రావడంతో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావటం స్టార్ట్ అయ్యాయి.

 

అంతేకాకుండా కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం పై కూడా సోషల్ మీడియాలో విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. అప్పట్లో తెలుగుదేశం టైం లో నీ వెనకాల జగన్ ఉండే ఆడించాడు కదా!, ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నాడు రిజర్వేషన్ నువ్వే తీసుకురా అంటూ ప్రశ్నించడం జరిగింది. ఇటువంటి పరిస్థితి నెలకొన్న పరిణామంలో కాపు రిజర్వేషన్ అంశం లో తనపై వస్తున్న విమర్శలు విషయంలో వస్తున్న దూషణలకు మనస్తాపానికి చెంది కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ్డ బహిరంగ ప్రకటన చేశారు. అంతేకాకుండా కాపు రిజర్వేషన్ అంశం అనేది కేంద్ర పరిధిలో అన్నట్టుగా ముద్రగడ్డ ఇటీవల వ్యవహరించడంతో ఈ తరహా ప్రవర్తనతలో ముద్రగడ… జగన్ మనిషి అని, ఆయన కోసమే ముద్రగడ అస్త్రసన్యాసం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju