NewsOrbit
రివ్యూలు సినిమా

అఖిల్ ని కాపాడింది కానీ…

కెరీర్ స్టార్టింగ్ లోనే భారీ ఫ్లాప్స్ ఫేస్ చేసి మార్కెట్ పరిధిని తగ్గించుకున్న అక్కినేని అఖిల్, ఈసారైనా హిట్ అందుకోవాలని చేసిన సినిమా ‘మిస్టర్ మజ్ను’. తొలిప్రేమ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన మిస్టర్ మజ్ను రిపబ్లిక్ డే కనుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ మూడో సినిమాతో అయినా అఖిల్ హిట్ అందుకున్నాడేమో చూద్దాం.

 

కథ‌ :
మిస్టర్ మజ్ను సినిమాలో అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆవేశపరిచే అంశాలు, ప్రయోగం అనిపించే కథా కథనాలు లాంటి ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఈ సినిమా ఒక సింపుల్ లవ్ స్టోరీ. లండన్ లో ప్లేబాయ్ గా తిరిగే విక్రమ్ కృష్ణ(అక్కినేని అఖిల్)కి, నిఖిత(నిధి అగర్వాల్)కి మధ్య ఏం జరిగింది అనేదే ఈ మిస్టర్ మజ్ను కథ. ప్లే బాయ్ అయినా కూడా విక్కీ లో మంచి వ్యక్తిత్వం చూసిన నిక్కీ, అతన్ని సిన్సియర్ గా లవ్ చేస్తుంది. ఇది అర్ధం కానీ విక్కీ, నిక్కీ ప్రేమని ఒప్పుకోకుండా ఆమెని దూరం చేసుకుంటాడు. తీరా నిక్కీ దూరమయ్యే సమయానికి, తను కూడా నిఖితాని ప్రేమిస్తున్నాననే విషయం గుర్తించిన విక్కీ దూరమైన ప్రేమ కోసం ఏం చేశాడు..? తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు? అన్నదే మిగతా కథ.

న‌టీన‌టులు :
కెరీర్ లో మొదటి హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్, అక్కినేని ఫ్యామిలీ ట్రేడ్ మార్క్ అయిన మంచి రొమాంటిక్ ప్రేమకథ దొరకడంతో విక్కీ పాత్రలో ఆకట్టుకున్నాడు. ప్లేబాయ్‌ పాత్రలో పర్ఫెక్ట్‌గా సెట్ అయిన అఖిల్ స్క్రీన్ పై చాలా ఎనేర్జిటిక్ గా కనిపించాడు. మొదటి సినిమాతోనే ఫైట్స్, డాన్స్ చేయగలనని ప్రూవ్ చేసుకున్న అఖిల్, మిస్టర్ మజ్ను సినిమాతో తనలో మంచి నటుడున్నాడని అందరికీ తెలియజేశాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపించినా ఓవరాల్ గా చాలా డెవలప్ అయ్యాడు. ఇక తన డెబ్యూ మూవీ సవ్యసాచితో ఫ్లాప్ అందుకున్న నిధి అగర్వాల్, నిఖిత పాత్రలో ఒదిగిపోయింది. గ్లామర్ గా కనిపిస్తూనే యాక్టింగ్ కి స్కోప్ ఉన్న ప్రతి సీన్ లో నటించి మెప్పించింది. మిగిలిన పాత్రల్లో కనిపించిన వారిలో సితార, పవిత్ర లోకేష్, నాగబాబు, జయప్రకాష్, రావూ రమేష్‌ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకోగా సుబ్బారాజు, ప్రియదర్శి, హైపర్‌ ఆది కామెడీ సో సోగానే ఉంది.

విశ్లేష‌ణ‌ :
తొలిప్రేమ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి, మిస్టర్ మజ్ను సినిమాతో ఈతరం ప్రేమకథాని ఎంచుకున్నాడు. కథలో కొత్తదనం లోపం స్పష్టంగా కనిపిస్తుంది, ప్రతి సీన్ ఎక్కడో చూసినట్లు అనిపిస్తూనే ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌, కామెడీ పైన పెట్టిన శ్రద్ధ కథాకథనాల్లో పెట్టి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్ అయితే సాగదీసినట్లు అనిపిస్తుంది. నిజమైన ప్రేమ అంటేనే అర్ధం చేసుకోలేని హీరో చేంజ్ అయ్యే జర్నీ కానీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు కానీ కన్వీన్సింగ్ గా అనిపించవు. డైరెక్టర్ గా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిన వెంకీ అట్లూరి, రైటర్ గా మెప్పించాడు. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ హార్ట్ టచింగ్ గా అనిపిస్తాయి. సినిమా ఫారిన్ లో తెరకెక్కించడం వలన తెరపై చాల రిచ్ నెస్ కనిపిస్తుంది. గత కొంత కాలంగా మంచి మ్యూజిక్ ఇస్తున్న తమన్‌ మరోసారి మెప్పించాడు. ముఖ్యంగా అతనిచ్చిన బీజీఎమ్, సీన్స్ ని మరోస్థాయికి తీసుకెళ్లింది. ఎడిటింగ్‌, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలి అంటే మిస్టర్ మజ్ను సినిమా అఖిల్ ని ఫ్లాప్స్ నుంచి అయితే తప్పించింది కానీ ప్రేక్షకులని మెప్పించడంలో మాత్రం కొంచెం వీక్ అయ్యింది.

ప్లస్‌ పాయింట్స్‌ :
లీడ్ పెయిర్ యాక్టింగ్
సినిమాటోగ్రఫి
మ్యూజిక్

మైనస్‌ పాయింట్స్‌ :
రొటీన్‌ స్టోరి
సెకండ్‌ హాఫ్
వీక్ రైటింగ్

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Leave a Comment