NewsOrbit
న్యూస్

రక్షాబంధన్ రోజు అమోఘమైన తీర్పు ! అదేమిటంటే?

కోర్టులిచ్చే కొన్ని తీర్పులు సంచలనం అవుతాయి. మరి కొన్ని సమాజానికి మార్గదర్శకమవుతాయి.ఇండోర్ కోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఇటు సంచలనం రేపింది.అటు సమాజాన్ని ఆకట్టుకుంది.

rakshabandhan day amazing verdict whatst that
rakshabandhan day amazing verdict whatst that

వివరాల్లోకి వెళితే ఒక వివాహితను వేధించాడన్న కేసులో అరెస్టయిన ఒక వ్యక్తిని అదే మహిళ చేతితో రక్షాబంధన్ రోజు రాఖీ కట్టించుకుని ఆమెకు కానుకగా పదకొండు వేల రూపాయలు ఇవ్వాలని ఇండోర్ కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది.ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో జరిగి౦ది..ఉజ్జయిని నగరానికి చెందిన విక్రమ్ బాగ్రి 30 ఏళ్ల వివాహిత ఇంట్లోకి ప్రవేశించి వేధించాడని పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు నిందితుడైన విక్రమ్ బాగ్రిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంలో బాగ్రికి రూ.50వేల వ్యక్తిగత పూచికత్తుపై ఇండోర్ కోర్టు వేలు మంజూరు చేసింది.ఇదేమి వార్త కాదు. కోర్టుల్లో రొటీనుగా జరిగేదే.అయితే ఇక్కడ బెయిలు మంజూరు చేయడానికి న్యాయమూర్తి పెట్టిన ఒక షరతే ప్రధాన వార్తగా రూపుదిద్దుకుంది.

న్యాయమూర్తి  జస్టిస్ రోహిత్ ఆర్య నిందితునికి షరతులతో కూడిన బెయిలు ఇస్తూ రక్షాబంధన్ సందర్భంగా సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 3వతేదీన 11 గంటలకు నిందితుడు తన భార్యతో కలిసి బాధిత వివాహిత ఇంటికి స్వీటు బాక్సుతో వెళ్లి, ఆమెతో రాఖీ కట్టించుకొని భవిష్యత్తులో ఆమెకు రక్షణగా ఉంటానని వాగ్ధానం చేసి, రూ.11వేలు ఇవ్వాలని జడ్జి ఆదేశించారు.

బాధితురాలి కుమారుడికి రూ.5వేలతో బట్టలు, స్వీట్లు కొని ఇచ్చి, బాధిత వివాహిత ఆశీర్వాదం పొందాలని నిందితుడు బాగ్రిని జడ్జి ఆదేశించారు. నిందితుల్లో పరివర్తన తేవడానికి జైలుశిక్షలే అక్కర్లేదు!వారిలో కూడా మార్పు తెచ్చే ఇలాంటి చర్యలు తీసుకున్నా సమాజం బాగుపడుతుందనడంలో సందేహం లేదు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju