NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

చంద్రబాబూ- కులమూ.! “కమ్మ”దనం ఎక్కడ చెడింది.? (ఎక్సక్లూసివ్ స్టోరీ)

తెలుగునాట కుల రాజకీయాలు కొత్తేమి కాదు. నాలుగు దశాబ్దాలు కిందటే ఆరంభమైన కులతత్వ రాజకీయాలు.., ఇప్పుడు పీక్స్ లో ఉన్నాయి…! కుల మీడియాలు మాత్రమే కొత్త అని కొందరికి అనిపించినా.., ఇవి కూడా పాతవే…! ఇక సూటిగా విషయానికి వచ్చేస్తే… రాష్ట్రంలో కీలక సామాజికవర్గంగా ఉన్న “కమ్మ” కులానికి ఎన్టీఆర్ రాజకీయ సారధిగా మారారు. తర్వాత ఆ బాధ్యత చంద్రబాబు భుజాన వేసుకున్నారు. ఇప్పుడు తలెత్తుతున్న అనుమానం ఏమిటంటే కులం చంద్రబాబుకి ప్లస్ అయిందా ..? కులానికి చంద్రబాబు ప్లస్ అయ్యారా అనేది..? ఆ కులానికి తర్వాత నాయకుడు ఎవరు అనేది..??

బాబుకి ఎప్పుడు..? ఎక్కడ..? ఎలా అంటే…!

ఎన్టీఆర్ అంటే నిస్సందేహంగా కమ్మ సామాజికవర్గానికి బలమే. ప్లస్సే. సినీ, రాజకీయంలో ఆయన రాణించి ఆ కులానికి బ్రాండ్ తీసుకువచ్చారు. అందుకే కమ్మ ఎన్టీఆర్కి అండగా నిలబడింది, ఎన్టీఆర్ కూడా వారికి అండగా నిలబడ్డారు. మొత్తానికి ఎన్టీఆర్ అనే వ్యక్తి, వ్యవస్థ కలిసి ఆ సామాజికవర్గానికి ప్లస్సయ్యారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే…!!

 


* 1996 లో పగ్గాలు తీసుకున్నప్పుడు బాబుకి అండగా కులం మొత్తం నిల్చుంది. ఇక మనం ముందు చెప్పుకున్న కుల మీడియా కూడా అప్పుడే మొదలయింది. బాబుకి అండగా నిలబడింది. అంటే మొదట్లో బాబుకి కులం అండగా ఉంది, ప్లస్సయింది. ఇంకొంచెం వివరంగా చెప్పుకోవాలి అంటే… నాటికి ఎన్టీఆర్ అంటే ఒక వ్యవస్థ.., ఒక శక్తి… చంద్రబాబు అంటే ఒక వ్యక్తి, ఒక నాయకుడు మాత్రమే… కానీ బాబుకి పగ్గాలు రావడంలో ఒక పెద్ద శక్తి, వర్గం సహకరించింది. అదే సామాజికవర్గం. నిస్సందేహంగా చంద్రబాబు నాడు పగ్గాలు తీసుకోవడంలో… పీఠం ఎక్కడంలో సామాజికవర్గం కీలకంగా పని చేసింది.

కులమూ… కోటరీ… బాబు చేసింది ఇదీ…!!

ఇక చంద్రబాబు పాలనలో అంటే 1996 నుండి 2004 మధ్య… 2014 నుండి 2019 మధ్య కమ్మ సామజిక వర్గానికి చంద్రబాబు ఏమి చేశారు అంటే…! చాలానే చేశారు. కానీ తనకు అనుకూలంగా, తనకు దగ్గరగా.., తన కోటరీలో వారిని “కమ్మ”గా చూసుకున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్.., భాస్కర నాయుడు, దేవినేని కుటుంబం., పరిటాల కుటుంబం.., హవా కొంత మేరకు నడిచింది. కులం మొత్తం వేరు, చంద్రబాబు కోటరీ కులం వేరు అన్నట్టుగా ఉండేది. సింపుల్ గా చెప్పుకోవాలి అంటే కులం మొత్తం బాబుకి అండగా నిలబడితే.., బాబు మాత్రం కోటరీకి అండగా ఉన్నారు. అంటే బాబు అధికారంతో సంపాదించుకున్నది కొందరు మాత్రమే.
* 2014 – 19 మధ్య కూడా ఇదే తరహాలో కోటరీ హవా కొనసాగింది. భూముల్లోనూ.., కాంట్రాక్టుల్లోనూ, టెండర్లలోనూ వాళ్లదే హవా నడిచింది. మొత్తానికి రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుపై కుల ప్రభావం బాగా పడింది. ఉపయోగపడింది.

లోకేష్ పరిస్థితి ఏమిటి…!

సరే ఎన్టీఆర్ కమ్మకి బ్రాండ్.., చంద్రబాబు కులానికి ఒక స్థాయి నాయకుడు..! మరి తర్వాత ఎవరు..? కమ్మ సామాజికవర్గ రాజకీయ బరువుని మోసేది ఎవరు..? వారి రాజకీయ దాహం తీర్చేది ఎవరు..? బాబుకి ఇప్పుడు 72 ఏళ్ళు. పస పోయింది, పలుకుబడి తగ్గింది. చతురత, చాణక్యత అనుకునే లక్షణాలు మసకబారాయి. అందుకే ఇప్పుడు ఆ కుల సామాజికవర్గానికి ఒక నాయకుడు కావాలి.

చంద్రబాబు తప్పుకుని ఈ బాధ్యతని లోకేష్ కి అప్పగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాబుపైనే పూర్తిగా నమ్మకంగా లేని ఆ సామజిక వర్గ నేతలు ఇప్పుడు లోకేష్ అంటే పూర్తిగా భయపడుతున్నారట. లోకేష్ నాయకత్వాన్ని ఏ మాత్రం అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. లోకేష్ ని సాధారణ వర్గాలు, ప్రత్యర్ధులు కూడా కనీసం గౌరవించడం లేదు, అసలు నాయకుడిగానే చూడడం లేదు. ఈ తరుణంలో సామజిక వర్గ రాజకీయ నాయకుడిగా ఎలా అంగీకరిస్తాం అంటూ కొందరు నాయకులూ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకున్నారట. అందులో భాగంగా రాష్ట్ర బీజేపీ వారికి కనిపిస్తుంది.
(ఇక బీజేపీలో చేరి ఈ సామజిక వర్గం ఏం చేస్తుంది…? వారి ప్రణాళిక ఏమిటి..? బీజేపీ లో ఉన్న పవన్, కాపు వర్గంతో కలిసి పనిచేస్తుందా..? అనేది తర్వాత కథనంలో రేపు చూద్దాం..!)

 

Related posts

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?