సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో ఎప్పుడూ అగ్ర హీరోల వరుసలో ముందు వరుసలో ఉంటాడు. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తన సినిమాల్లో సామాజిక దృక్పధాన్ని చూపే మహేష్ బాబు ఈనెల 9వ తేదీన తన 45వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.
అయితే ఈ సందర్భంగా కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకున్న బాబు తన పుట్టినరోజు నాడు తన ఫ్యాన్స్ తనకు తోడుగా ఉండడం అదృష్టం అని చెప్పారు. ఇదే క్రమమ్లో అభిమానులకు లేఖ రాస్తూ ఆ సమయంలో మనం అందరం చేస్తున్న యుద్ధంలో సురక్షితంగా ఉండటం అనేది చాలా ముఖ్యం అని తన పుట్టిన రోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండే క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.
అలాగే తన పుట్టిన రోజును ఒక ప్రత్యేకమైన రోజు గుర్తు ఉండాలని తన ఫ్యాన్స్ చేసిన పనులకు తనకు చాలా సంతోషంగా ఉంటుందని బాబు చెప్పడం గమనార్హం. అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో పుట్టిన రోజున రచ్చ లేపేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో బాబు నుండి ఇటువంటి విన్నపం రావడం…. వారికి దానిని ఫాలో కావడం నిజంగా చాలా కష్టమైన పనే.