NewsOrbit
Featured సినిమా

ఒక్కడిగా వచ్చి ‘మెగా’ సామ్రాజ్యాన్నే సృష్టించిన.. ‘చిరంజీవి’

chiranjeevi family record never ever in india

చిరంజీవి.. ఈ పేరు వింటే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి.. కుటుంబ ప్రేక్షకులకు కాసేపు రిలాక్స్ అవొచ్చనే ఫీలింగ్ వస్తుంది. తెరపై ఆయన చేసిన డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్.. ఆయనకు కీర్తి కిరీటాలయ్యాయి. తెలుగు తెరపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించి ‘మెగాస్టార్’గా.. నెంబర్ వన్ హీరోగా దశాబ్దాలుగా రాణిస్తున్నారు. 1978లో కేవలం చిరంజీవిగా తొలి సినిమా చేస్తే 1988కి ‘మెగాస్టార్’గా తెలుగు తెరను ఏలే స్థాయికి చేరుకున్నారు. ఓ పని మీద ఇష్టంతో, కష్టపడి పనిచేస్తే ఫలితాలు ఎలా సాధించొచ్చు అనేదానికి చిరంజీవే ఉదాహరణ.

chiranjeevi family record never ever in india
chiranjeevi family record never ever in india

వరుసగా ఆరేళ్లు.. ఆరు ఇండస్ట్రీ హిట్లు..

1987లో ‘పసివాడి ప్రాణం’, 1988 ‘యముడికి మొగుడు’, 1989 ‘అత్తకుయముడు అమ్మాయికి మొగుడు’, 1990 ‘జగదేకవీరుడ అతిలోక సుందరి’, 1991 ‘గ్యాంగ్ లీడర్’, 1992 ‘ఘరానామొగుడు’.. ఇలా వరుసగా ఆరేళ్లు.. ఆరు వరుస ఇండస్ట్రీ హిట్లు ఇచ్చి తెలుగు తెరపై ఓ చరిత్రనే లిఖించారు. ఎందరో ఔత్సాహికులకు ఆయన సినిమాలు డిక్షనరీలుగా నిలిచాయి. మాస్ యాక్టింగ్ కు చిరంజీవి తప్పితే మరో ఉదాహరణ లేదు. డ్యాన్సులకు ఆయన తీసుకొచ్చిన అందం దేశంలో మరో హీరో ఇప్పటివరకూ తీసుకురాలేదు. ఫైట్స్ లో ఒరిజినాలిటీతో తెలుగు తెరపై హీరో అర్ధాన్నే మార్చుశారు. ఇటివల హీరో సత్యదేవ్ చెప్పినట్టు.. ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా’ అని రాష్ట్రంలోని సాధారణ ప్రజానీకం నోటి మాటగా మారిపోయారు.

సేవా భావం.. తనతోపాటు అభిమానులను కూడా..

అభిమానులంటే ధియేటర్ల వద్ద కటౌట్లు కట్టి తెర మీద పూలు జల్లడమే కాదు.. ప్రజలకు, సమాజానికి ఉపయోగపడాలి.. అంటూ వారిని సామాజిక స్పృహ వైపు నడిపించారు. ఆయన పిలుపు మేరకు రక్తదానం చేశారు. సమాజ సేవ చేశారు. ఇటివల కరోనా సంక్షోభంలో సినీ కార్మికులకు ఆదుకునేందుకు ‘సీసీసీ’ ఏర్పాటు చేసి ఇండస్ట్రీనే కదిలించారు. ట్రెండ్ కు తగ్గట్టు అప్డేట్ అయ్యి సోషల్ మీడియాలో కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాజానికి ఉపయోగపడే సందేశాలు ఇస్తున్నారు. కుటుంబంతో సరదాగా గడపాలంటూ తల్లికి దోశెలు వేస్తూ, భార్యకు వంటలో సాయం చేస్తూ, మనవరాళ్లతో ఆడుకుంటూ.. . సినిమాలు లేని ఈ సమయంలో తన మార్క్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నారు.

మెగా సామ్రాజ్యం.. ఎనిమిది మంది హీరోలు

తన మార్గంలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్, సాయిధరమ్ లను హీరోలను చేస్తే వారు ఏకంగా సూపర్ స్టార్లు, స్టార్లు, సక్సెస్ ఫుల్ హీరోలు అయిపోయారు. దేశంలో మరే కుటుంబంలో కూడా ఇంతమంది హీరోలు లేరు. పైగా.. అందరూ యాక్టివ్ హీరోలే కావడం మరో విశేషం. బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీలో యాక్టర్లు ఉంటే చిరంజీవి కుటుంబంలో హీరోలు ఉన్నారు. ఏకంగా తెలుగు సినిమాపై ‘మెగా ఫ్యామిలీ’ అనే ఓ సామ్రాజ్యాన్నే సృష్టించారు. దేశంలో మరెవరూ సాధించలేని అద్భుతమైన ఘనత ఇది. చిరంజీవి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి.. ప్రేక్షకుల్ని అలరించాలి. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు.

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu