NewsOrbit
Featured సినిమా

ఒక్కడిగా వచ్చి ‘మెగా’ సామ్రాజ్యాన్నే సృష్టించిన.. ‘చిరంజీవి’

chiranjeevi family record never ever in india

చిరంజీవి.. ఈ పేరు వింటే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి.. కుటుంబ ప్రేక్షకులకు కాసేపు రిలాక్స్ అవొచ్చనే ఫీలింగ్ వస్తుంది. తెరపై ఆయన చేసిన డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్.. ఆయనకు కీర్తి కిరీటాలయ్యాయి. తెలుగు తెరపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించి ‘మెగాస్టార్’గా.. నెంబర్ వన్ హీరోగా దశాబ్దాలుగా రాణిస్తున్నారు. 1978లో కేవలం చిరంజీవిగా తొలి సినిమా చేస్తే 1988కి ‘మెగాస్టార్’గా తెలుగు తెరను ఏలే స్థాయికి చేరుకున్నారు. ఓ పని మీద ఇష్టంతో, కష్టపడి పనిచేస్తే ఫలితాలు ఎలా సాధించొచ్చు అనేదానికి చిరంజీవే ఉదాహరణ.

chiranjeevi family record never ever in india
chiranjeevi family record never ever in india

వరుసగా ఆరేళ్లు.. ఆరు ఇండస్ట్రీ హిట్లు..

1987లో ‘పసివాడి ప్రాణం’, 1988 ‘యముడికి మొగుడు’, 1989 ‘అత్తకుయముడు అమ్మాయికి మొగుడు’, 1990 ‘జగదేకవీరుడ అతిలోక సుందరి’, 1991 ‘గ్యాంగ్ లీడర్’, 1992 ‘ఘరానామొగుడు’.. ఇలా వరుసగా ఆరేళ్లు.. ఆరు వరుస ఇండస్ట్రీ హిట్లు ఇచ్చి తెలుగు తెరపై ఓ చరిత్రనే లిఖించారు. ఎందరో ఔత్సాహికులకు ఆయన సినిమాలు డిక్షనరీలుగా నిలిచాయి. మాస్ యాక్టింగ్ కు చిరంజీవి తప్పితే మరో ఉదాహరణ లేదు. డ్యాన్సులకు ఆయన తీసుకొచ్చిన అందం దేశంలో మరో హీరో ఇప్పటివరకూ తీసుకురాలేదు. ఫైట్స్ లో ఒరిజినాలిటీతో తెలుగు తెరపై హీరో అర్ధాన్నే మార్చుశారు. ఇటివల హీరో సత్యదేవ్ చెప్పినట్టు.. ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా’ అని రాష్ట్రంలోని సాధారణ ప్రజానీకం నోటి మాటగా మారిపోయారు.

సేవా భావం.. తనతోపాటు అభిమానులను కూడా..

అభిమానులంటే ధియేటర్ల వద్ద కటౌట్లు కట్టి తెర మీద పూలు జల్లడమే కాదు.. ప్రజలకు, సమాజానికి ఉపయోగపడాలి.. అంటూ వారిని సామాజిక స్పృహ వైపు నడిపించారు. ఆయన పిలుపు మేరకు రక్తదానం చేశారు. సమాజ సేవ చేశారు. ఇటివల కరోనా సంక్షోభంలో సినీ కార్మికులకు ఆదుకునేందుకు ‘సీసీసీ’ ఏర్పాటు చేసి ఇండస్ట్రీనే కదిలించారు. ట్రెండ్ కు తగ్గట్టు అప్డేట్ అయ్యి సోషల్ మీడియాలో కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాజానికి ఉపయోగపడే సందేశాలు ఇస్తున్నారు. కుటుంబంతో సరదాగా గడపాలంటూ తల్లికి దోశెలు వేస్తూ, భార్యకు వంటలో సాయం చేస్తూ, మనవరాళ్లతో ఆడుకుంటూ.. . సినిమాలు లేని ఈ సమయంలో తన మార్క్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నారు.

మెగా సామ్రాజ్యం.. ఎనిమిది మంది హీరోలు

తన మార్గంలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్, సాయిధరమ్ లను హీరోలను చేస్తే వారు ఏకంగా సూపర్ స్టార్లు, స్టార్లు, సక్సెస్ ఫుల్ హీరోలు అయిపోయారు. దేశంలో మరే కుటుంబంలో కూడా ఇంతమంది హీరోలు లేరు. పైగా.. అందరూ యాక్టివ్ హీరోలే కావడం మరో విశేషం. బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీలో యాక్టర్లు ఉంటే చిరంజీవి కుటుంబంలో హీరోలు ఉన్నారు. ఏకంగా తెలుగు సినిమాపై ‘మెగా ఫ్యామిలీ’ అనే ఓ సామ్రాజ్యాన్నే సృష్టించారు. దేశంలో మరెవరూ సాధించలేని అద్భుతమైన ఘనత ఇది. చిరంజీవి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి.. ప్రేక్షకుల్ని అలరించాలి. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు.

Related posts

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N