NewsOrbit
న్యూస్

అబ్బా! అలా జరిగితే ఎలా ? అని వైసీపీ అంతర్మధనం!!

విజయవాడలోని కనకదుర్గ ఫైఓవర్ విషయంలో బిజెపి టిడిపి కలిసి వైసీపీకి షాక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఫ్లైఓవర్ను వైసిపి ప్రభుత్వం తాను పూర్తిచేసినట్టు చెప్పుకుని క్రెడిట్ కొట్టేయాలని చేస్తుండగా ఇందుకు టిడిపి కౌంటర్ అటాక్ ఇచ్చింది.

Kanaka Durga flyover status || Vijayawada - YouTube

ఈ విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా టిడిపికి మద్దతు ప్రకటించడంతో వైసిపి పని కుడితిలో పడ్డ ఎలుకలాగా మారింది .నిజానికి ఇది విజయవాడ ప్రజల డ్రీమ్ ప్రాజెక్ట్.2011 లోనే టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ ఫైఓవర్ కోసం పోరాటం మొదలుపెట్టింది.ప్రస్తుత టీడీపీ శాసనమండలి సభ్యుడు బుద్దా వెంకన్న ఆ ఫైఓవర్ కోసం అప్పట్లో ఆమరణ నిరాహర దీక్ష కూడా చేశారు.ఈ విషయమై జరిగిన ధర్నాల్లో చంద్రబాబునాయుడు సైతం పాల్గొన్నారు.

2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత, విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత తీసుకుని, చంద్రబాబు సహకారంతో, కేంద్రంతో సమన్వయం చేసుకుని ప్రాజెక్ట్ మొదలు పెట్టేలా చేసారు.అయితే వివిధ కారణాలతో ప్రాజెక్ట్ నిర్మాణం లేట్ అవుతూ వచ్చింది. డిజైన్లలో మార్పులు, రాజకీయంగా టిడిపితో వైరం రావటంతో నిధులు ఇవ్వకపోవటం, ఇలా వివిధ కారణాలతో లేట్ అయ్యింది. 2019 జూన్ నాటికి 85 శాతం పనులు పుర్తయయ్యి. మరో రెండు మూడు నెలల్లో ప్రాజెక్ట్ అయిపోయేది.

అయితే ప్రభుత్వం మారటంతో ప్రాజెక్ట్ పూర్తి మరింత లేట్ అయ్యింది. ఎట్టకేలకు జగన్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో పనులు ముగిసి ఫ్లై ఓవర్ లోడ్ టెస్టింగ్ కూడా అయిపోయింది. నిజానికి ఈ ఫ్లైఓవర్ విషయంలో ఎనభై ఐదు శాతం పనులు చేసింది టిడిపి ప్రభుత్వం అయితే కేవలం పదిహేను శాతం మాత్రమే జగన్ సర్కారు చేసింది.మొత్తం మీద ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ను సెప్టెంబర్ 4న ప్రారంభం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో, ఈ ఫ్లై ఓవర్ మొత్తం తమ వల్లే అయ్యింది అంటూ, వైసీపీ క్రెడిట్ కొట్టేయటం ప్రారంభించింది.

ఈ విషయాన్ని గమనించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని చాలా తెలివిగా వ్యవహరించారు.సైలెంటుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి, ఫ్లై ఓవర్ పూర్తికి సహకరించినందుకు అభినందించారు. అంతే కాదు, ఫ్లై ఓవర్ ఓపెనింగ్ కు రావాల్సిందిగా గడ్కరీని ఆహ్వానించారు. కేశినేని నాని పట్టుబట్టటంతో గడ్కరీ కూడా ఒప్పుకున్నారు. వీలు ఉంటే తానే స్వయంగా విజయవాడ వస్తానని, లేకపోతే ఆన్లైన్ లో ప్రారంభం చేస్తానని చెప్పారు.

దీంతో వైసిపి గొంతులో వెలక్కాయపడింది .గడ్కరీ పాల్గొంటే, గతంలో ఈ ప్రాజెక్ట్ కోసం భుసేకరణ చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని, స్థానిక ఎంపీ కేశినేని నాని కృషిని, బుద్దా వెంకన్న ఉద్యమాన్ని, కేంద్ర సహకారాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ లో వైసీపీ పాత్ర పరిమితం అని ప్రజలకు తెలిసిపోయే ప్రమాదముందని వైసిపి ఆందోళన చెందుతోంది .

Related posts

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju