NewsOrbit
న్యూస్

రుణ చెల్లింపుదారులకు తాత్కాలిక ఊరట.. మారటోరియంపై విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా..

దేశంలోని రుణ చెల్లింపుదారులకు తాత్కాలికంగా ఊరట లభించింది. నిరర్థక ఆస్తుల ప్రకటనతోపాటు మారటోరియంపై కొనసాగుతున్న విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. మారటోరియం సమయంలో వాయిదా తీసుకున్న ఈఎంఐలకు గాను అయ్యే వడ్డీ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని బ్యాంకులు, ఆర్‌బీఐ గతంలో రుణ గ్రహీతలకు చెప్పిన విషయం విదితమే. అయితే దీనిపై సుప్రీంలో పలువురు పిటిషన్‌ వేశారు. ఈ క్రమంలో పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు తాము చెప్పే వరకు ఆ విషయంపై నిర్ణయం తీసుకోకూడదని సెప్టెంబ‌ర్ 3న ఆదేశాలు జారీ చేసింది. తరువాత ఇప్పుడు ఆ నిర్ణయాన్ని సెప్టెంబర్‌ 28వ తేదీ వరకు వాయిదా వేసింది.

supreme court of india extended relief on moratorium

మారటోరియం సమయంలో వాయిదా తీసుకున్న ఈఎంఐలకు వడ్డీ చెల్లించాల్సిందేనని కేంద్రం, ఆర్‌బీఐ, బ్యాంకుల తరఫున లాయర్లు సుప్రీంలో వాదించారు. అయితే కరోనా లాక్‌డౌన్‌ వల్ల రుణ గ్రహీతలు ఈఎంఐలను చెల్లించేందుకే ఇబ్బందులు పడ్డారని, అందువల్ల వారు భారీగా పెరిగే వడ్డీని ఎలా చెల్లిస్తారని వారి తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు జరిపారు. అయితే ఆ వడ్డీని మాఫీ చేయడం నిబంధనలకు విరుద్ధమని, అలాగే రుణాలను మారటోరియం సమయంలోనూ చెల్లించిన ఇతరులకు దీని వల్ల అన్యాయం జరుగుతుందని మరోవైపు బ్యాంకుల తరఫు లాయర్లు సుప్రీం కోర్టులో చెప్పారు. అయితే అన్నిపక్షాల వాదనలను విన్న జస్టిస్‌లు అశోక్‌ భూషణ్‌, ఆర్‌ సుభాష్‌ రెడ్డి, ఎంఆర్‌ షాల ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.

అలాగే ఈ నెల 28వ తేదీ వరకు డిఫాల్టర్ల ఖాతాలను ఎన్‌పీఏ (నిరర్థక ఆస్తులు)లుగా ప్రకటించవద్దని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇక అదే తేదీన.. ఈఎంఐ వాయిదా తీసుకున్న కాలానికి వడ్డీ చెల్లించే విషయమై కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని తెలిసింది. అలాగే కరోనా నేపథ్యంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలకు లోనవుతున్న వారికి మరో రెండేళ్ల పాటు రుణాల పునర్‌ వ్యవస్థీకరణ కింద మారటోరియం సదుపాయాన్ని కల్పించే విషయమై కూడా కోర్టు అదే రోజు తీర్పు ఇస్తుందని తెలుస్తోంది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N