NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

దూసుకెళ్లిన ‘వందే భారత్’!

 

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి15: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. పుల్వామా టెరరిస్టు దాడిని దృష్టిలో ఉంచుకుని పెద్దగా హడావుడి లేకుండా  దేశ రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని ఈ రైలుకు పచ్చ జెండా ఊపారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్, రైల్వే బోర్డు సభ్యులు కూడా ఈ రైలు మొదటి ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారు.

వందే భారత్ రైలు గురించి 8 ముఖ్యమైన పాయింట్లు:

  1. వందే భారత్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగం వరకూ వెళ్లగలదు.
  2. ఈ రైలు ఢిల్లీ – వారణాసి మధ్య ప్రయాణిస్తుంది. మధ్యలో కాన్పూర్‌లో, అలహాబాద్‌లో 40 నిముషాల చొప్పున ఆగుతుంది. ఆ సమయంతో కలిపే గమ్యస్థానాన్ని 9 గంటల 45 నిముషాల వ్యవధిలో అధిగమిస్తుంది.
  3. రైలు సీటింగ్ సామర్ధ్యం 1,128 సీట్లు. మొత్తం 16 ఎసి బోగీలలో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలు.
  4. ఈ రైలు టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఛైర్‌కార్ టికెట్ ధర 1,760 రూపాయలు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర 3,310 రూపాయలు.
  5. అన్ని బోగీలకూ ఆటోమాటిక్ తలుపులు బిగించారు. బోగీలలో జిపిఎస్‌ ద్వారా పని చేసే ఆడియో – విజువల్ వ్యవస్థ ఉంటుంది. ఇది ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంది. వినోదం కోసం బోగీలలో హాట్‌స్పాట్ వైపై సౌకర్యం కూడా కల్పించారు.
  6. ఇంతకు ముందు దీనిని ట్రెయిన్ 18 అన్నారు. ఇప్పుడు దీని పేరు వందే భారత్‌గా మార్చారు.
  7. రైలులో పాంట్రీ సదుపాయం ఉంది. ప్రయాణీకులకు వేడివేడి కాఫీ, టీ, భోజనం, చల్లటి పానీయాలూ దొరుకుతాయి.
  8. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలను చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారుచేశారు.

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Leave a Comment