ఈ ఆధునిక కాలములో సాంకేతిక పరిజ్ఞానం మరింత ఆధునీకతను సంతరించుకుంటున్న తరుణం లో ఫీచర్ ఫోన్ల స్థానాన్ని స్మార్ట్ఫోన్లుచేరుకున్నాయి . ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లు కేవలం కమ్యూనికేషన్ అవసరాలనే కాకుండా విద్య, వ్యాపార ఇతర వినోదాత్మక వనరులను అరచేతిలోపెడుతున్నాయి.ఎలాంటి అంశం అయినా క్షణాలలోతెలుసుకునే లాగా చేస్తున్నాయి .ఇవి అందుబాటులోకి వచ్చాక శృంగార పరమైన సందేశాలు ,ఫోటోలు,వీడియోస్ పంచుకుంటూ మాట్లాడడం కూడా ఎక్కువయింది అని అంటున్నారు నిపుణులు.
చాటింగ్ లో శృంగారపరమయిన కబుర్లు మాట్లాడుకోవడన్నే సెక్స్టింగ్ అంటారు. ఇది ఇఫ్పుడు వయస్సుతో సంబంధం లేకుండా జరుగుతుంది . మొబైల్ లో శృంగార కబుర్లతో చాటింగ్ చేయడంపై చేసిన అధ్యయనం లో బయట పడ్డ విషయాల గురించి సైన్స్ జర్నల్ ప్లస్ వన్ లో ప్రచురితమైనది.
కొంత మంది ఈ సెక్స్ టింగ్ కు బానిస గా మారిపోతున్నారు. అయితే ఈ సెక్స్టింగ్లో మహిళలే చాలా ముందంజలో ఉన్నారని తేలింది.సెక్స్టింగ్ అంటే మొబైల్ ద్వారా శృంగార సందేశాలు, ఫోటోలు, వీడియోలు పంపడం.
ఈ మధ్య జరిగిన సర్వే ప్రకారం, మన దేశంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున సెక్స్టింగ్లో పాల్గొంటున్నారు అని తేలింది. మొత్తం 1,30,885 మంది మహిళలను 191 దేశాల నుండి ఎంపిక చేసి సర్వే జరిపారు. ఇందులో భారతీయ మహిళలు 23,093 మంది ఉన్నారు.62% మంది మహిళలు శృంగారం చేస్తున్నవారు ఉన్నారని ఆ సర్వేలో తేలింది. లింగ సమానత్వం ఉన్న దేశాలలో కన్నా లింగ అసమానత ఉన్న దేశాలలో మహిళల సెక్స్ టింగ్ రేటు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది అని పరిశోధకులు తెలిపారు.లింగ అసమానత ఎక్కువగా ఉన్న దేశాల్లో, మహిళలు తమ లైంగిక కోరికలను ఏవిధం గా తెలియజేయాలో అర్ధం కాక ఈ సెక్స్ టింగ్ ని ఎక్కువగా చేస్తున్నారని తేలింది. మహిళల లో 19 శాతం డేటింగ్ యాప్స్ ఉపయోగించి, తమ బాయ్ ఫ్రెండ్స్ ను వెతుక్కుంటున్నారనితెలిసింది.