NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

సీఎం జగన్ X జస్టిస్ రమణ పోరులో బీజేపీ మౌనం..! వెనుక భయానక వ్యూహం.! (పార్ట్ – 2 )

Justice NV Ramana: in Confusion about his First Case?

సుప్రీమ్ కోర్టు సీజే కుర్చీ చుట్టూ బీజేపీ పన్నిన వ్యూహాలు చెప్పుకున్నాం..! ఇప్పుడు ఆ కుర్చీతో ప్రయోజనాలు, బీజేపీ గేమ్ కి కారణాలు ఓ సారి చెప్పుకోవాల్సి ఉంది. జస్టిస్ రమణని తప్పిస్తే బీజేపీకి ప్రత్యక్షంగా/ పరోక్షంగా కలిగే ప్రయోజనాలు ఏమిటి..? అనేది చూద్దాం..!!

మరీ ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే..? ఈ విషయంలో బీజేపీ ఏ మాత్రం స్పందించలేదు. ఎక్కడా.., ఎవరూ నోరు మెదపలేదు. సోము వీర్రాజు అంటే కరోనా కారణంగా విశ్రాంతిలో ఉన్నారు అనుకుందాం.., కానీ ప్రతీ వ్యవహారంపై స్పందించే జీవీఎల్ ఏమైనట్టు..? సునీల్ దేవధర్ ఏమైనట్టు..? రామ్ మాధవ్ ఏమైనట్టు..?? ఏపీలో ఏ విషయాన్ని అయినా స్పందించే ఈ నేతలు ఏ ఒక్కరూ మాట్లాడలేదు, అసలు ఏమి జరగనట్టు ఉంటున్నారు అంటేనే ఇది వారి పార్టీ పాత్ర అర్ధం చేసుకోవచ్చు..!

బీజేపీకి కొన్ని లక్ష్యాలున్నాయి. ఆ లక్ష్యాలు నెరవేర్చే లక్షణాలున్నాయి. దేశంలో స్వతంత్రంగా ఎదగడం. రాష్ట్రాలన్నిటినీ కాషాయమయం చేసెయ్యడం. బీజేపీ లక్ష్యాలు.., వీటిని సాధించడానికి వ్యవస్థలపై పెత్తనం సాధించడం వారి లక్షణం..!! ఒకవేళ బీజేపీకి గాలి వీయక అక్కడక్కడా.., స్థానాలు తగ్గినా గవర్నర్, కోర్టులు చేతిలో ఉంటే బీజేపీ చక్రం తిరిగినట్టే..! రాష్ట్ర స్థాయిలో అంశం నలిగి, నలిగి సుప్రీమ్ కి చేరుతుంది. అక్కడ అనుకూలురు ఉంటే పని సులువవుతుంది కదా..!?

read also>>సీఎం జగన్ X జస్టిస్ రమణ పోరులో బీజేపీ మౌనం..! తెర వెనుక భయానక వ్యూహం.! పార్ట్ 1

బీజేపీకి ముఖ్యంగా ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు అడ్డుగా ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహంతో బీజేపీ రాజకీయాలు నడుపుతుంది. ఈ క్రమంలోనే ఏపీలో పూర్తిగా గెలవకపోయినా.., కనీసం బీజేపీ ఉనికి ఉండాలన్నా ఇక్కడ రాజకీయంగా పాతుకుపోయిన “కమ్మ” సామాజికవర్గం అడ్డు ఉంటుంది. అందుకే ఈ అవరోధాన్ని అధిగమించే క్రమంలో వెంకయ్య నాయుడుని ఉన్నత హోదా పేరిట యాక్టీవ్ పాలిటిక్స్ కి దూరం చేశారు. అదే సామజిక వర్గానికి చెందిన జస్టిస్ రమణ చంద్రబాబుకి సన్నిహితుడు. అంటే రమణ సీజేగా ఉంటె ఏపీ అనే కాకుండా ఇతర కొన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీకి కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.

modi to decide whether jagan or babu
modi to decide whether jagan or babu

కొన్ని రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..!!

ఉదాహరణకు చూసుకుంటే..! బీజేపీకి కంట్లో నలుసుగా ఉన్న మమతా బెనర్జీపై శారదా చిట్స్ కుంభకోణం, రోజ్ వాలీ చిట్స్ కుంభకోణం ఉన్నాయి. ఈ రెండిటి విలువ సుమారుగా రూ. 30 వేల కోట్లు ఉంటుంది. వీటిలో ఆమెను ఇరికించే అవకాశం బీజేపీకి ఉంది. కానీ.., ఈ కేసుల నుండి ఆమెకు క్లీన్ చీట్ ఇప్పిస్తానంటూ 2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారనే ప్రచారం ఉంది.
* తమిళనాడు పరంగా హిందీ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి.. వాళ్ళు జాతీయ పార్టీలను అసలు పట్టించుకోరు. అందుకే అక్కడ బీజేపీ చేతిలో ఒక పార్టీ ఉండాలి. అన్నా డీఎంకేని నమ్మే పరిస్థితి లేదు. డీఎంకే కి బీజేపీ గాలం ఏనాడో వేసింది. ఎన్డీయే వన్ ఉన్నప్పుడు కరుణానిధి బీజేపీ పెద్దల్ని కలిసిన తర్వాత కనిమొళి, రాజాలపై టూజీ స్పెక్ట్రమ్ కేసు పోయింది. అందుకే భావి అవసరాల దృష్ట్యా డీఎంకే ఎన్డీఏ 3 కి మద్దతు ఇవ్వడానికి వెనకడుగు వేయదు.

బీజేపీకి జగనే ఎందుకు..?

జస్టిస్ ఎన్వీ రమణను అడ్డుకోవాలంటే సీఎం జగన్ మాత్రమే బీజేపీకి పావు. కీలక ఆయుధం. రమణ సొంత రాష్ట్రంలో జరిగిన లావాదేవీలు బయట పెడితే అతన్ని సీజే కాకుండా ఆపేయొచ్చు. ఇదే సమయంలో జగన్ కి కూడా చంద్రబాబు.. ఇతనికి సన్నిహితుడిగా ఉన్న రమణ శత్రువుగా మారారు. సో.. జస్టిస్ రమణ ఆ స్థానానికి వెళ్లకుండా ఉండడంలో బీజేపీకి బహుళ ప్రయోజనాలు ఉంటే.. జగన్ ప్రభుత్వానికి కి కొంత మేరకు ప్రయోజనాలు అందనున్నాయి. వ్యతికరేక తీర్పులు ఆగే అవకాశం ఉంది. అంచేత బీజేపీ ఆడిస్తుంది. జగన్ ఆడుతున్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అంటే 2014 ముందు పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. నాడు కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలు చరిత్రలో నిలిస్తే.. ఇప్పుడు వ్యవస్థల మేనేజ్మెంట్ తో అవేమి బయటకు రావడం లేదు. అందుకే దేశంలో “నరేంద్రామితీయం” అంటే ప్రస్తుతానికి (జనం నిద్ర వీడే వరకు) సాటిలేని జంట..!!

read also>>సీఎం జగన్ X జస్టిస్ రమణ పోరులో బీజేపీ మౌనం..! తెర వెనుక భయానక వ్యూహం.! పార్ట్ 1

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju