ఆరో వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియలో కుమార్ సాయి హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎలిమినేషన్ లో కుమార్ స్థాయి కంటే తక్కువ ఓట్లు మోనాల్ కి వచ్చినట్లు…ఆమెను కాకుండా కుమార్ సాయిని ఇంటికి కావాలని షో నిర్వాహకులు పంపినట్లు నెటిజన్లు బయట తెగ డిస్కషన్ లు చేసుకుంటున్నారు. తమ టీఆర్పీ రేటింగులు కోసం ఆడియన్స్ ఓట్లను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
ఇంకోపక్క ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుడు అఖిల్ వ్యవహరించిన తీరుపై సెటైర్లు వేస్తున్నారు. పూర్తి విషయంలోకి వెళ్తే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ తో అఖిల్ మాట్లాడే విధానాన్ని ఖండిస్తున్నారు. ఏదైనా వెళ్ళిపోతున్న కంటెస్టెంట్ మాట్లాడాల్సిన సమయంలో హౌస్ లో మాదిరిగా రివర్స్ కౌంటర్ ఇవ్వకూడదు. ఇంగిత జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా అలా చేయరు.
అవేమీ పట్టించుకోకుండా అతను చెప్పింది కరెక్టా? రాంగో? ప్రేక్షకులు చూసుకుంటారని వదిలేయకుండా నేను సేవ్ అయిపోయాను నువ్వు ఎలిమినేట్ అయిపోయావు అని పొగరెక్కిన డైలాగులు వేయటంతో అఖిల్ పై బయట జనాలు సెటైర్లు వేస్తున్నారు. ఆడియన్స్ పరంగా ఎలిమినేషన్ జరిగి ఉంటే అసలైన వ్యక్తి బయటకు వచ్చే వాళ్ళు, అప్పుడు నువ్వు ఆ కంటెస్టెంట్ తో పాటు బయటకు వచ్చే పరిస్థితి ఎదురయ్యేది అంటూ మోనాల్ నీ ఉద్దేశించి ఇండైరెక్ట్ గా అఖిల్ పై జనాలు సెటైర్లు వేస్తున్నారు.