NewsOrbit
సినిమా

టాలీవుడ్ వనంలో కృష్ణవంశీ ‘గులాబి’కి 25 ఏళ్లు

krishna vamsi gulabi completes 25 years

సినీ పరిశ్రమలో నిలబడాలంటే తమదైన ముద్ర వేయాల్సిందే. నటీనటులైనా, టెక్నీషియన్లు అయినా, నిర్మాత అయినా ఇది తప్పదు. మరే రంగంలోనూ చూపనంత క్రియేటివిటీని సినిమాల్లో చూపించాల్సి ఉంటుంది. సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది సినిమా. ముఖ్యంగా దర్శకుడి క్రియేటివిటీ ఇందుకు దోహదపడుతుంది. దర్శకుడి ఆలోచనలే సినిమా ద్వారా కోట్లాదిమందిని ఆకర్షిస్తాయి. అందుకే దర్శకుడిలో క్రియేటివిటీ ముఖ్యం. తెలుగులో అటువంటి దర్శకుల్లో మొదటివరుసలో నిలిచే దర్శకుడు ‘కృష్ణవంశీ’. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా వచ్చినా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. దర్శకుడిగా ఆయన కెరీర్ నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి.

krishna vamsi gulabi completes 25 years
krishna vamsi gulabi completes 25 years

కృష్ణవంశీ తొలి సినిమా ‘గులాబి’ 1995లో విడుదలైంది. అనగనగా ఒకరోజు సినిమా సగం తీసినా అనివార్య కారణాల వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. శిష్యుడి టాలెంట్ గుర్తించిన వర్మ ఆ సినిమాను, ‘గులాబి’ని కృష్ణవంశీ చేతిలో పెట్టారు. కృష్ణవంశీలోని తపన, ఆలోచనలకు నిదర్శనంగా గులాబి ఉంటుంది. యూత్ ని టార్గెట్ చేసి తీసిన ‘గులాబి’ విజయవంతం అయింది. స్నేహితుల సరదాలు, ప్రేమ, యాక్షన్.. అన్నీ ఒక సినిమాలో చూపించి ఆకట్టుకున్నారు. ‘మేఘాలలో తేలిపొమ్మన్నది’ పాట చిత్రీకరణ అప్పట్లో ఓ సెన్సేషన్. ‘ఈవేళలో నీవు..’ పాటను చూసి ప్రేమికులు ఊహల్లో తేలిపోయేలా చేశారు. ఇక కాలేజీ, ఫ్యామిలీ సందడి సరేసరి. దీంతో భవిష్యత్తులో తన అవసరం టాలీవుడ్ కి ఎంత అవసరమో నిరూపించారు.

దర్శకుడిగా అందరూ భయపడే ద్వితీయ విఘ్నాన్ని కృష్ణవంశీ ఘనంగా దాటారు. ఆ సినిమానే ‘నిన్నే పెళ్లాడతా’. సినిమాలోని ఫ్యామిలీ, లవ్ సెంటిమెంట్ కృష్ణవంశీ పేరు మోగేలా చేసింది. ‘సిందూరం’ మంచి సినిమాగా నిలిచింది. అంతఃపురం కృష్ణవంశీకి జాతీయస్థాయిలో పేరు తీసుకొచ్చింది. ఖడ్గం సినిమాతో సంచలనం సృష్టించారు. ‘మురారి’, ‘చందమామ’ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ను పర్ఫెక్ట్ గా చూపించారు. చిన్న సినిమాగా తీసిన డేంజర్ తో యాక్షన్ తెరకెక్కించారు. ఇలా తన 25 ఏళ్ల ప్రయాణంలో తీసినవి తక్కువ సినిమాలే అయినా ఇది ‘కృష్ణవంశీ’ సినిమా అనే బ్రాండ్ ను సంపాదించుకోవడం విశేషం. ‘కృష్ణవంశీతో ఒక్క సినిమా అయినా చేయాలి..’ అని నటీనటులు అనుకునే స్థాయికి చేరుకున్నారంటే అతిశయోక్తి కాదు.

Related posts

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri