NewsOrbit
న్యూస్

జీవిత ఖైదు మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..! అదేమిటంటే..?

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళా ఖైదీల పట్ల ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. సహజంగా మహిళలు నేరాలకు దూరంగా ఉంటారు. పరిస్థితుల ప్రభావంతోనో, క్షణికావేశంలోనో అనుకోకుండా జరిగే సంఘటనలు వారిని నేరస్తులను చేస్తుంటాయి.  ఆ నేరానికి వారు సంవత్సరాల తరబడి జైలు శిక్షను అనుభవిస్తుంటారు. మహిళలు జైలుకు వెళ్లడం వల్ల వారి పిల్లల అలనా పాలనా చూసే వారు లేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. ఈ పరిస్థితులను గమనించిన జగన్ సర్కార్.. మహిళా జీవిత ఖైదీల పట్ల మానవతా దృక్పదంతో ఆలోచన చేసి వారిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నది.

రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం మీడియాకు మహిళా ఖైదీల విడుదలకు సంబందించి  వివరాలు వెల్లడించారు. అయిదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి సత్ర్పవర్తన కల్గిన మహిళా ఖైదీలను విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో 147 మంది మహిళలు జీవిత ఖైదు అనుభవిస్తున్నారనీ, వీరిలో 55 మందిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. రాజమండ్రి  సెంట్రల్ జైలు నుండి 21 మంది, కడప సెంట్రల్ జైలు నుండి 27మంది, నెల్లూరు జైలు సెంట్రల్ జైలు నుండి అయిదుగురు మహిళా ఖైదీలు విడుదల అవుతున్నారని మంత్రి చెప్పారు.

మరో పక్క మహిళ ఖైదీలలో సత్ర్పవర్తన కల్గించేందుకు జైళ్లలో  సంస్కరణలు తీసువచ్చామని చెప్పారు. అందులో భాగంగా మహిళా ఖైదీలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, సారీ పెయింటింగ్, బేకరీ లాంటి వాటిల్లో శిక్షణలు ఇస్తున్నట్లు మంత్రి సుచరిత తెలిపారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju