NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

జనసేన ఏడేళ్లలో సాధించింది ఇదేనా..!? పవన్ కి పరాభవం..!

బయటకు వస్తే జేజేలు. నోరు తెరిస్తే అరుపులు. సినిమాటిక్ డైలాగులు. తల నిమరడాలు. జుట్టు పైకెత్తడాలు. మెడలో ఎర్రని తువాలు ఇసరడాలు.. ఇటేమో కుర్రాళ్ళ కేరింతలు. ఈలలు, గోలలు..!! అబ్బో జనసేనాని గురించి ఇవన్నీ ఎంత చెప్పినా తక్కువే..! కానీ ఏం ఉపయోగం…!? అసెంబ్లీలో తనకు ఒక కుర్చీ లేదు. రెండు చోట్ల పోటీ చేసినా గెలుపు లేదు. పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మాట వినడం లేదు. పార్టీకి ఒక నిర్మాణం లేదు. విధివిధానం లేదు. సుదూర సిద్ధాంతం లేదు. నిలకడైన మాట లేదు. నిఖార్సైన రాజకీయ స్నేహం లేదు. జనసేన గురించి.., పవన్ గురించి చెప్పుకోవాలంటే ఇవన్నీ తక్కువే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే.. అసలు హైదరాబాద్ లో బీజేపీతో జనసేన పొత్తు ఉన్నట్టా..? లేనట్టా..? పొత్తు ఉండీ పవన్ ని పక్కన పెట్టినట్టా..? పొత్తు లేకుండా కేవలం పోటీ నుండి విరమింపచేసినట్టా..? హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన – బీజేపీ మధ్య ఈ చీకటి మాటలు, కోతలు ఎందుకు..!? చీకటి స్నేహాలు ఎందుకు..!? చివరికి పవన్ కి పరాభవానికి కదా..!?

Janasena BJP

2014 లో ఎంత ప్రాధాన్యత..? ఇప్పుడో..!?

అది 2014 లో ఎన్నికల ప్రచార సభలు. టీడీపీ – బీజేపీ – జనసేన పొత్తులో ఉన్నాయి. దిట్టమైన స్నేహంలో ఉన్నాయి. మోడీ- చంద్రబాబు- పవన్ మధ్య కౌగలింతలు ఉన్నాయి. అందుకే ఈ ముగ్గురూ ఒకేరోజు మూడు (తిరుపతి, భీమవరం, విశాఖ) ఎన్నికల ప్రచార సభలు కూడా చుట్టేసిన రోజులున్నాయి. నాటి ప్రతి సభలోనూ పవన్ కి మంచి ప్రాధాన్యత దక్కింది. మోడీ కూడా పవన్ ని ఆప్యాయంగా దగ్గరకు పిలిచి మరీ మాట్లాడమనేవారు. అలా అలా 2017 వరకు పవన్ – బీజేపీ స్నేహం బాగానే ఉంది. కానీ ఈ నిలకడలేమికి ఎందుకో ఎర్ర పార్టీల వైపు మనసు మళ్లింది. ఆ దెబ్బతో 2017 నుండి 2019 వరకు వామపక్షాలతో పవన్ కలిసి నడిచారు. స్వతహాగా పవన్ మాటలు కూడా కమ్యూనిజం కొట్టుమిట్టాడడంతో ఈజీగానే కలిసిపోయారు. ఎన్నికల్లో ఈ కలయిక బాంబు తుస్సుమనడంతో మళ్ళీ పవన్ పాత స్నేహం వైపు వెళ్లారు. ఎన్నికల తర్వాత బీజేపీ పిలిచిందో.. పవనే వెళ్లారో.. మళ్ళీ స్నేహం పూసింది.

అమిత్ షా రోడ్ షోలో పవన్ ఎక్కడ..!?

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ – జనసేన మధ్య గ్రేట్ నాటకం మాత్రం కనిపిస్తుంది. పొత్తుపై పదే పదే మాట మారుస్తూ చివరికి పొత్తు ఉన్నట్టే కానీ.. పొత్తులో భాగంగా బీజేపీకి 150 , జనసేన కి 0 స్థానాలు అన్నట్టుగా.. రెండు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. గ్రేటర్ లో బీజేపీ విజయం కోసం కృషి చేస్తామని, సహకరిస్తామని పవన్ ప్రకటించారు. మరి బీజేపీ పవన్ ని పక్కన పెట్టినట్టే కనిపిస్తుంది. ప్రచారానికి వాడుకోలేదు. పిలవలేదు. కనీసం ఎన్నికల సభలు నిర్వహించలేదు. కనీసం ఈరోజు జరిగిన అమిత్ షా రోడ్డు షోకి కూడా పిలవలేదు. పవన్ వెళ్ళలేదు. అసలు గ్రేటర్ లో బీజేపీ పూర్తిగా పవన్ ని, జనసేనాని తీసిపడేసింది. దానికి అనేక కారణాలున్నాయి..!
* గ్రేటర్ లో పవన్ సామాజికవర్గ ఓట్లు సుమారుగా 9 లక్షలు ఉంటాయి. పవన్ అభిమానులు కూడా లక్షల్లోనే ఉన్నారు. కనీసం 20 డివిజన్లలో పవన్ ప్రభావం ఉంటుంది..! కానీ ఇవి బీజేపీ వద్దు అనుకుంది.. దానికి కారణం పవన్ ప్రచారంతో వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ అని బీజేపీ గ్రహించింది.


* పవన్ 2014 నుండి రాజకీయం చేస్తున్నది ఏపీలోనే. చీటికీ మాటికీ ఇక్కడే జగన్ ని విమర్శిస్తూ.. బీజేపీని పొగుడుతూ రాజకీయం చేస్తున్నారు. తెలంగాణాలో అభిమానులున్నప్పుడూ.., హైదరాబాద్ లో రాజకీయం ఆసక్తిగా ఉన్నప్పుడు పవన్ కొంచెమైనా అక్కడ దృష్టి పెట్టాల్సింది. కానీ అదేం చేయలేదు. అంటే ఒకరకంగా పవన్ పూర్తిగా ఏపీకే పరిమితమయ్యారు.
* 2018 లో ఏం జరిగింది..? తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు విపరీతంగా ప్రచారం చేసారు. కాంగ్రెస్, టీడీపీ కూటమి కోసం కాళ్లకు బలపం కట్టుకుని తిరిగారు. కానీ టీఆరెస్ ఒక్క మాటతో తిప్పికొట్టింది. ఆంధ్రా వాళ్ళు, ఆంధ్ర పార్టీలు మళ్ళీ వస్తున్నాయని టీఆరెస్ తిప్పికొట్టింది. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ లేచింది. సో.. ఇప్పుడు మళ్ళీ పవన్ ప్రచారం చేస్తే హైదరాబాద్ లో తెలంగాణ సెంటిమెంట్ నిద్ర లేస్తే ఎక్కువ నష్టం వస్తుందని.., బీజేపీ భావిస్తుంది. మొత్తానికి బీజేపీ ఆలోచన ఎలా ఉన్నా..? పవన్ కి మాత్రం ఇది ఘోర అవమానమే. బీజేపీతో పొత్తు ఉంటూ.. ఆ పార్టీ కీలక నేత వస్తే కనీసం ప్రచారానికి పిలవకపోవడం అవమానమే కదా..!?

 

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?