ప్రతిరోజూ పండగే, వెంకీ మామా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని మంచి జోరుమీద ఉంది రాశీఖన్నా. ఈ రెండు సినిమాలు టాలీవుడ్ లో రాశీ కీ మంచి పేరు తీసుకు వచ్చాయి. అయితే తెలుగులో ఇంకా ఏ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికి ఒక సినిమా కి మాత్రం గీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆ సినిమా కి సంబంధించిన ప్రకటన అధికారకంగా త్వరలో రానున్నట్టు సమాచారం. ఇక కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్ళి చేసుకొని హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో మెగాస్టార్ చిరజీవి నటిస్తున్న ఆచార్య షూటింగ్ లో జాయిన్ కాబోతోంది.
కాగా తాజా సమాచారం ప్రకారం ఒక సినిమాలో కాజల్ అగర్వాల్, రాశి ఖన్నా కలిసి నటించబోతున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ఇలయదళపతి విజయ్ – మురుగదాస్ ల కాంబినేషన్ లో ఒక సినిమా మొదలబోతోంది. ఆ సినిమానే గతంలో వచ్చి సూపర్ హిట్ అయిన తుపాకి సీక్వెల్ ‘తుపాకి 2’. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రాశీ ఖన్నా ని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలోనే రానుందని తెలుస్తోంది.
ఇప్పటికే విజయ్ – కాజల్ ల కాంబినేషన్ ‘మెర్సల్, జిల్లా’ సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీటవుతుండటంతో బాగానే అంచనాలు మొదలయ్యాయి అంటున్నారు. ఇక కాజల్ ప్రస్తుతం బాలీవుడ్ లో ‘ముంబై సాగా, బహుభాషా పాన్ ఇండియన్ చిత్రం ఇండియన్ 2’ సినిమాలలో నటిస్తోంది. ఇక ఒకే సినిమాలో కాజల్, రాశీఖన్నా నటిస్తుండటం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి రాశీఖన్నా కోలీవుడ్ లో సెటిలైనట్టే అంటున్నారు.