NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆరోగ్య మంత్రి ఇలాకాలో తలతిక్కల వైద్యం – వింతల్లో అవినీతి తంతు

 

 

మూర్ఛ వస్తే ఆర్థో ఫిజీషియన్… కడుపునొప్పి అంటే చెవికి సంబందించిన సర్జన్.. వికారం అంటే సైలెన్… కళ్ళు తిరుగుతున్నాయి అంటే అక్కడే కూర్చుబెట్టడం తప్పితే…. ఏలూరు వింత వ్యాధి గ్రాస్తులకు అందుతున్న వైద్యం సున్నా… వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆళ్ల నాని రోజు వెళ్లి రోగులను పరామర్శించడం, ఎంత మంది కొత్త రోగులు, డిశ్చార్జ్ ఎందరు? అని తెలుసుకుని రావడం మినహా ఎలాంటి వైద్యం అందుతుంది?? వాళ్లకు ఇంటర్నెల్ గా ఇతర సమస్యలు వస్తున్నాయా అని పూర్తిగా పరిశీలన చేసేందుకు అవసరం అయిన వైద్యులు లేరు. కాస్త బాగుంటే ఏలూరు హాస్పిటల్ లో కాస్త సీరియస్ అయితే వెంటనే విజయవాడ తీసుకుపోండి అంటూ పంపేస్తున్నారు…

ఇదేం తీరు మంత్రి గారు??

వైద్యం అంటే వేళాకోళం కాదు. కానీ ఏలూరు బాధితులకు అందుతున్న వైద్యం వేళాకోళం గానే కనిపిస్తుంది. అందులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో అత్యవసర సమయంలో అందుతున్న వైద్యం విచిత్రంగా ఉంది.
** మూర్ఛ అనేది నాడి, మెదడు సంబంధ విషయం. దీనికి కచ్చితంగా న్యూరో ఫిజీషియాన్ ఉండాలి. పరిశీలించాలి. ఏలూరు హాస్పిటల్ లో ఆ పోస్ట్ కొన్ని సంవత్సరాలనుండి ఖాళీగా ఉంది. డాక్టర్ కుమార్ రాజా గతంలో చీఫ్ ఫిజిషియాన్ గా ఉండేవారు. ఆయన తర్వాత మళ్ళీ ఈ పోస్ట్ భర్తీ జరగలేదు. న్యూరో సంబంధించిన సమస్యలు సైతం సాధారణ వైద్యులు, న్యూరోకి సంబంధం లేని వైద్యులు చేస్తున్నారు.
** ఏలూరు వింత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి వస్తున్న బాధితులకు ఎక్కువగా చికిత్స చేస్తూ ఉన్నది కాంపౌండర్లు తోటిలే. వస్తున్న వారికి వెంటనే సెలైన్ పెట్టడం వార్డుకు తీసుకెళ్ళి పోవడం జరుగుతుంది. ఎక్కువమంది ఆసుపత్రికి వచ్చే సమయానికి నార్మల్ అయిపోతున్నారు. దీంతో వెంటనే కాంపౌండర్ కలగజేసుకుని ఇంజక్షన్ సెలైన్ పెట్టి తోసేయ్ అన్నట్టు చేస్తున్నారు తప్పితే వచ్చిన రోగి సమస్యను పూర్తిగా పరిశీలించడం లేనేలేదు.
** వచ్చిన రోగి ఏదైనా అపస్మారక స్థితిలో ఉంటే వైద్యులు వచ్చి నాడి పట్టుకుని చికిత్స చేయాల్సింది పోయి వెంటనే విజయవాడ తీసుకు వెళ్ళిపోమని ఉచిత సలహా ఇస్తున్నారు.
** బాధితులు పెరుగుతున్న సాధారణ వైద్యులు ఉన్నారే తప్ప స్పెషలిస్ట్ వైద్యులను ప్రభుత్వం రప్పించే ప్రయత్నం చేయలేదు. వచ్చిన డబ్ల్యూహెచ్వో ప్రతినిధులు ఇతర శాఖల నుంచి పరిశీలనకు వచ్చిన వారు కనిపిస్తున్నారు తప్పితే వైద్యం అందించేందుకు ప్రత్యేకమైన వైద్యులు లేరు.
** ఈ కీలక సమయంలో ఇతర ప్రాంతాల నుంచి స్పెషలిస్ట్ వైద్యులు ప్రకటించాల్సి ఉంది పోయి ఉన్నవారినే సెలవులు ఇచ్చి పంపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. న్యూరో సంబంధించిన సమస్యలను ఎముకుల వైద్యుడు ముక్కు చెవి గొంతు వైద్యులు చూస్తున్నారు.

దారుణం హాస్పిటల్

ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి పేరుకి తప్ప ఎక్కడ కనిపించే సౌకర్యాలు అత్యంత దారుణం. 500 లో సుమారు 150 వరకు పాడైపోయాయి. ఆస్పత్రి వైద్యులందరికీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కేవలం ఉదయం ఒక రెండు సాయంత్రం వీలైతే వస్తారు లేకపోతే లేదు.. అన్నట్లుగా ఇన్ పేషెంట్ కి వైద్య సేవలు అందుతున్నాయి. మధ్యలో ఏ అత్యవసరమైన వెంటనే నర్సులే బంధువులకు చెప్పి విజయవాడ తీసుకెళ్ళమని ఉచిత సలహాలు ఇస్తారు. అంతే తప్ప ఆ సమయానికి మళ్లీ వైద్యుడు రావడం కానీ చికిత్స చేయడం కానీ అసలు ఉండదు.
** వార్డుల్లో ఉన్నవారు ఒక సమస్యకు ఆసుపత్రిలో జాయిన్ అయితే దానికి సంబంధించిన వైద్యులే వారికి చికిత్స అందించడం కనిపించదు. ఉన్న స్పెషలిస్ట్ వైద్యుల్లో వారే వచ్చి రోగిని చూసి వారికి సంబంధం లేకపోయినా సబ్జెక్టు అయినా డిలీట్ చేసి మందులు రాసేయడం ఇక్కడ జరుగుతున్న అద్భుతమైన చికిత్స.
** ఇక ఇక్కడ వార్డ్ బాయిలు, అటెండర్లు, తోటి లు, నర్సుల దే రాజ్యం. వారు ఎంత చెప్తే అంత చేయాల్సిందే. ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకమైన ధరలు అమలు అవుతున్నాయి. కట్టుకడితే 50.. స్ట్రెక్చర్ తెస్తే 100.. వార్డ్ కు తీసుకెళ్తే 200… ఇంజక్షన్ చేస్తే 300.. కాన్పు కి 1000 అంటూ ప్రత్యేక ధరను పెట్టి బహిరంగంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవేవీ మంత్రిగారికి తెలియక కాదు…. మంత్రి వెనుకున్న అనుచరగణ మే… వారి వెనుకున్న కింది స్థాయి కార్యకర్తల కనుసన్నల్లోనే ఈ అవినీతి తతంగమంతా నడుస్తూ ఉంటుంది.

పరామర్శ సరిపోతుందా

ఏలూరు ఎంత వ్యాధి సోకిన దగ్గర నుంచి వందలాది బాధితులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రోజువారి పరామర్శిస్తున్నారు. అయితే ఇక్కడ తో బాధ్యత అయిపోయింది అనుకోవడం తప్పు. ఇతర ప్రాంతాల నుంచి స్పెషలిస్ట్ వైద్యులను చెప్పించడం నాని విఫలమయ్యారు. కేవలం ఇది చిన్న రోగమే అన్న ధోరణి కనిపిస్తోంది. ప్రాణాలు తీసే అంత పెద్దది కాకపోవడంతో మంత్రి దీనిని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. రోజువచ్చి ఆస్పత్రిలో రోగులను పరామర్శించి వెళ్తున్నారు తప్పితే ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏమిటి? రోగులకు అందుతున్న వైద్యసేవలు ఏమిటి? వ్యాధికి తగిన కారణాలు ఏమిటి? అని పట్టించుకొని దాన్ని పరిష్కరించే దారులు మంత్రి వెదకడం లేదు.
** మరోపక్క విపక్షాలు దీనిని ఓ ప్రధాన అంశంగా తీసుకోవడంలో విఫలం అయ్యాయి. జనసేన పార్టీ తరఫున వచ్చిన వైద్యుల బృందం ఈ సమస్యను గుర్తించింది. రోగులకు న్యూరో సమస్యలు వస్తే సాధారణ వైద్యం చేస్తున్నారని వారు గుర్తించారు. అయితే దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో సమస్యను ప్రభుత్వం దృష్టికి వరకు తీసుకెళ్లడంలో మాత్రం జనసేన పార్టీ విఫలమైంది. కేవలం దాన్ని చిన్న సమస్యగానే వారు పరిగణలోకి తీసుకొని నివేదించారు తప్పితే పోరాటం మొదలుపెట్టలేదు. ఈ కీలక సమయంలో ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వైద్యులు సమస్య మౌలికసదుపాయాల సమస్యలపై పోరాడుతూ ఆసుపత్రిలో కొన్ని వసతులు అయినా సమకూరే అవకాశం ఉంది.

Related posts

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju