NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

“ఏపీలో సర్జికల్ స్ట్రైక్స్”..! ముహూర్తం ఖరారు- ఇక బీజేపీ ఆట మొదలు..!!

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల సందడి ముగిసింది. బీజేపీ వ్యూహం ఫలించింది. తెలంగాణాలో కాషాయానికి ఊపొచ్చింది..! అక్కడితో ఆగిపోతే ఎలా..? రానున్న రెండేళ్లలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణతో పాటూ ఏపీలో కూడా తిష్ట వేయాలనేది ఆ పార్టీ ప్లాన్..! ఓట్లు, సీట్లు లేకుండా ఎలా తిష్ట వేస్తారబ్బా..? అనే అందేహాలు మనకు వస్తాయి.., కానీ అది బీజేపీ. అక్కడున్నది అమిత్ షా, మోడీల బుర్ర. రాజకీయ వ్యహావరాల్లో ఆ బుర్రలో గుజ్జు గట్టిగా.., ఘాటుగా.., చురుకుగా పని చేస్తుంది. అందుకే ఏపీలో తిష్టకి ఆల్రెడీ ఒక ప్లాన్ సిద్ధం చేసారు. అందుకు తిరుపతి ఉప ఎన్నిక ద్వారానే అమల్లోకి తెస్తున్నారు.

జీవీఎల్ “సర్జికల్ స్ట్రైక్స్” మాటల అంతరార్ధం..!?

సర్జికల్ స్ట్రైక్స్ ని రాజకీయాల్లోకి తెచ్చి, దాన్ని చర్చనీయాంశంగా అమలు చేయడం బీజేపీకే సాధ్యమయింది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అక్కడ బండి సంజయ్ ఆ మాటని వాడితే.. ఇక్కడ తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వాడారు. ఈరోజు ప్రెస్ మీట్ లో “ఏపీలో పోలీస్ స్టేషన్ లో సెమి క్రిస్మస్ వేడుకలు జారడగం ఏమిటి..? ఎప్పుడైనా దసరా వేడుకలు జరగడం చుసామా..? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో.., ఏపీలో సర్జికల్ స్ట్రైక్స్ జరగాలి. ” అన్నారు. దీని అంతరార్ధమే “తిరుపతి ఉప ఎన్నికలో హిందూ సెంటిమెంట్”. అంటే తిరుపతి ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ వాడనున్న ప్రధాన అస్త్రం హిందునే. వారికి బాగా అలవాటైన మత రాజకీయాన్ని నెమ్మదిగా విస్తరించనున్నారు. అందుకే అక్కడ జనసేన కొంచెం జవసత్వాలు ఉన్నప్పటికీ… పవన్ ని చులకన చేసేసి.. బీజేపీ అభ్యర్థినే రంగంలోకి దించడానికి నిర్ణయం తీసుకున్నారు. “నువ్వు జస్ట్ చూస్తూ ఉండు. జరగబోయేది మేము నడిపిస్తాం” అన్నట్టు పవన్ చేతిలో ఒక “పొలిటికల్ పాలపీక” పెట్టారు..!

bjp should step back in tirupathi by election
bjp should step back in tirupathi by election

ఓట్లు లేవు, సీట్లు లేవు..! కానీ..!!

బీజేపీకి ఏపీలో ఓట్లు లేవు. సీట్లు లేవు. అసలు ఓటర్లకు చూస్తేనే వెగటు పుడుతుంది. ఆ పార్టీకి సొంతంగా పోటీ చేస్తే ఒక్కచోట కూడా డిపాజిట్లు రావు. అటువంటి పార్టీ గెలవడం ఏంటి..? ఎలా సాధ్యం..? అనేదే ప్రతి రాజకీయ అభిమాని అనుమానాలు. దాన్ని బీజేపీనే చూపిస్తుంది. జీరో నుండి పదికి, వందకు, వేయికి ఎదగడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. తిరుపతిలో ఆ పార్టీ గెలవకపోయినా పర్వాలేదు. కానీ వైసిపికి గట్టి పోటీ ఇస్తే చాలు. టీడీపీని వెనక్కు నెట్టేసి రెండో స్థానంలో నిలబడితే చాలు. ఆ పార్టీ లక్ష్యం నెరవేరినట్టే. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి వచ్చే ఓట్లు అనుసరించి.. ఏపీలో బీజేపీ తదుపరి రాజకీయ అడుగులు.. సీఎం జగన్ కి వారు ఇచ్చే ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటాయనేది మాత్రం కచ్చితం..!!

 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju