NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

భాగ్యలక్ష్మి ఆలయంలో బీజెపి నేతల మొక్కులు..నేతల ప్రమాణం..

 

ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజెపీ అనూహ్య ఫలితాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో విజయం సాధించిన కార్పోరేటర్‌లు, వారి కుటుంబ సభ్యులతో చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి మొక్కుబడులు తీర్చుకున్నారు.

బీజెపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, కార్పోరేటర్‌లతో కలిసి బండి సంజయ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంలో కార్పోరేటర్‌లతో బండి ప్రమాణం చేయించారు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామనీ, బీజెపీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తామనీ కార్పోరేటర్‌లు అమ్మవారి సమక్షంలో  ప్రమాణం చేశారు. పెద్ద సంఖ్యలో కార్పోరేటర్‌లు, వారి కుటుంబ సభ్యులు మొక్కులు తీర్చుకోవడానికి రావడంతో ఆలయం బీజెపీ నేతలతో కిటకిటలాడింది. వందలాది మంది బీజెపీ నేతలు ఆలయం వద్దకు ఆలయం వద్దకు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం అమ్మవారి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటామని గతంలోనే బండి సంజయ్ చెప్పిన విషయం తెలిసిందే.

కాగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ నగరానికి రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన నగరంలోనే ఉండనున్నారు. పార్టీ బలోపేతంపై నాయకులతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. మరో పక్క బీజెపీలోకి వలసలు ఊపందుకున్నాయి. కంటోన్మెంట్ మాజీ చైర్మన్ జంపన ప్రతాప్ పాటు టీడీపీ కంటోన్మెంట్ ఇన్ చార్జి ముప్పిడి మధుకర్ నేడు బీజెపీ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయంలో నేటి మధ్యాహ్నం 12 గంటలకు బండి సంజయ్ సమక్షంలో వారు బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారని సమచారం. అదే విధంగా కంటోన్మెంట్, మలక్‌పేట నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నేతలు కూడా బీజెపీలో చేరనున్నారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju