NewsOrbit
ట్రెండింగ్

ఆడవారి పేర్లతో నేమ్ ప్లేట్లు

నేమ్ ప్లేట్ ఉంది అంటే అక్కడ మగవారి పేరు ఉంటుందని అనుకోవటం మాములే. అయితే ఇక్కడ మాత్రం నేమ్ ప్లేట్లు ఆడవారి పేర్లతో ఉంటాయి. ఆర్తి నివాస్, సిమ్రాన్ నివాస్.. ఇలాంటి పేర్లు కనిపిస్తాయి. అరే ఆడవారిని చులకనగా చూడటమే కాదు.. గౌరవించటం కూడా తెలుసు. అది ఎక్కడో కాదండి.. మన దేశంలోనే. ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్వాల్ జిల్లాలోని మథాన గ్రామంలో ఇంటి నేమ్ ప్లేట్ల మీద ఆడవారి పేర్లు మాత్రమే కనిపిస్తాయి.

ఆడపిల్లలకు సమాజంలో గౌరవం దక్కేలా చూడాలనే ఉద్దేశంతో కూతుర్ల పేరుతో ఇళ్లను గుర్తించటం అనే కార్యక్రమాన్ని ‘బేటీ బచావో బేటీ పడవో’ పథకం కింద  శ్రీకారం చుట్టారు జిల్లా అధికారులు. ఆడపిల్లలకు హక్కులు, ఆస్తిలో వాటా గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఇటీవల మొదలుపెట్టారు.

కొండ ప్రాంతంలోని ఈ జిల్లాలోని గ్రామాల ప్రజలు గత కొన్నేళ్ల నుంచి దిగువ ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. స్త్రీ, పురుష నిష్పత్తి 1000 మంది మగవారికి 1103 మహిళలు ఉన్నారు. కానీ పిల్లల లింగ నిష్పత్తి రాష్టంలో సగటు 963 ఉంటే ఈ జిల్లాలో 904 మాత్రమే. ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలనే ఆలోచనతో, గ్రామస్థులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

కొరియర్ వాళ్లు ‘మా ఇంటి తలుపు తట్టి ఆర్తి జీ ఇల్లేనా? ఇంట్లో ఉన్నారా?’ అని అడిగితే ఎంతో గర్వంగా ఉంటుందని పీజీ చేస్తున్న ఆర్తి(21) తెలిపారు. ‘ఈ చిన్న ప్లేట్ నా ఆత్మ విశ్వసాన్ని పెంచిందని.. ఇప్పుడు మా అమ్మానాన్న నన్ను పై చదువులు చదివిస్తారని ఆశిస్తున్న’ అని ఏడవ తరగతి చదువుతున్న సిమ్రాన్ అంటుంది.

‘ఈ కార్యక్రమంపై ప్రజలు బాగా స్పందిస్తున్నారని.. ఇదే విధానాన్ని మిగతా జిల్లాల్లో కూడా మొదలు పెడతామ’ని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. ఇలా తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అప్పుడే మహిళా సాధికారత దిశగా అడుగులు పడతాయి.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N