NewsOrbit
న్యూస్ హెల్త్

ప్రతి ఇంటిలో ఉండవలిసిన మెడికల్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోండి!!

ప్రతి ఇంటిలో ఉండవలిసిన మెడికల్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోండి!!

మనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. అలాగని ప్రతీ సమస్యకు ఆస్పత్రికి వెళ్లడం కూడా మంచిది కాదు. అందుకే ఇంట్లో కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటే ఇంటిల్లి పాది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతగానో ఉపయోగపడ్తాయి. మరి మనం ఎలాంటి మెడికల్ గ్యాడ్జెట్స్ ఇంట్లోఉంచుకోవాలో తెలుసుకుందాం.

ప్రతి ఇంటిలో ఉండవలిసిన మెడికల్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోండి!!

కరోనా వైరస్ సంక్షోభంతో ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి? ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అసలే ఇప్పుడు కరోనా వైరస్ కాలంకావడం వలన జ్వరం తీవ్రత ఎంతఉందొ తెలుసుకోవడానికి థర్మామీటర్ బాగా సహాయపడుతుంది. శరీరం వేడిగా అనిపించినప్పుడు,టెంపరేచర్ చెక్ చేసుకుంటే మంచిది. ఆన్‌లైన్‌లో కానీ ఆఫ్‌లైన్‌లో డిజిటల్ థర్మామీటర్లు కొనుక్కోవచ్చు.  వాటి  ధర ఇంచుమించు రూ.100 నుంచి రూ.300 వరకు ఉంటుంది. కాంటాక్ట్‌లెస్ థర్మామీటర్ అయితే రూ.2,000 నుంచి రూ.5,000 మధ్య లభిస్తుంది.

మీరు బరువు పెరుగుతున్నారా? తగ్గుతున్నారా? ఒక్కో సారి హఠాత్తుగా బరువు పెరిగినట్టో,తగ్గినట్టో అనిపిస్తుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఇలా జరగొచ్చు. అందుకే తరచూ బరువు చూసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా  వ్యాయామం చేస్తున్నట్టైతే అప్పుడప్పుడూ బరువు చూసుకుంటూ ఉంటే తేడా తెలుస్తుంటుంది. అందుకే ఇంట్లో వెయింగ్ మెషీన్ ఉంచుకోవడం మంచిది.ఇది  రూ.500 నుంచి రూ.5,000  వరకు ధర ఉంటుంది.

ఈ రోజుల్లో అందరికి షుగరు  మామూలైపోయింది. అందుకే బ్లడ్ షుగర్ చెక్ చేయడానికి గ్లూకోమీటర్ ఉండటం ఎంతయినా అవసరం. తినడానికి ముందు తిన్న తర్వాత కూడా  బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీని ధర రూ.500 నుంచి రూ.2,000 మధ్య ఉంటుంది.

కోవిడ్ 19 కారణంగా పల్స్ ఆక్సిమీటర్లకు డిమాండ్ బాగా పెరిగింది.పల్స్ రేట్ చెక్ చేయడానికి పల్స్ ఆక్సిమీటర్ కావాల్సిఉంటుంది. పల్స్ ఆక్సిమీటర్ రేటు  రూ.2,000 నుంచి రూ.5,000 మధ్య ఉంటుంది.
ఇంట్లో పిల్లలు ఉన్నా, ఆస్తమా పేషెంట్లు ఉన్నా, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల తో బాధపడుతున్నవారు ఉన్నా కూడా నెబ్యులైజర్ ఉండటం అనేది చాల అవసరం. ఇది ఇంటిలో ఉండడం వలన ప్రతీ సారి క్లినిక్‌కు వెళ్లాల్సిన అసరంఉండదు.

నెబ్యులైజర్ వెల  రూ.1,500 నుంచి రూ.3,000 మధ్య ఉంటుంది. హైపర్ టెన్షన్ లాంటి సమస్యలతో ఇంట్లో ఎవరైనా ఉంటే బ్లడ్ ప్రెషర్ మానిటర్ తప్పకుండా ఉండాలి. చెక్ చేసుకొని నోట్ చేసుకుని ఫ్యామిలీ డాక్టర్‌కు తెలియచేయవచ్చు. అప్పుడే సరైన మెడిసిన్ వాడే అవకాశం ఉంటుంది. దీని ధర రూ.500 నుంచి రూ.3,000 మధ్య లభిస్తాయి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju