NewsOrbit
బిగ్ స్టోరీ సినిమా

ధియేటర్లను ‘కిల్’ కాదు.. పిడికిలి బిగించి కాపాడేది ఎప్పుడు?

tollywood biggies to unite to control theatres system

తెలుగు రాష్ట్రాల్లోని ధియేటర్ల వ్యవస్థ, పరిస్థితులపై వెలుగులోకి వచ్చిన అంశం ధియేటర్ల ‘కిల్’ అంశం. ప్రస్తుతం తెలుగు సినిమా వెలుగుతోంది. తెలుగు సినిమాలు దాదాపు పాన్ ఇండియా కథలతో తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్ తర్వాత మేమే అని కాస్త కాలర్ ఎగరేసిన కోలివుడ్ ను మాట్లాడకుండా చేస్తోంది టాలీవుడ్. దశాబ్దాలుగా దేశంలో ఏడాదికి ఎక్కువ సినిమాలు నిర్మించేది తెలుగు సినీ పరిశ్రమే అయినా ఉమ్మడిగా ఉండి ఉనికిని చాటుకోలేకపోయింది టాలీవుడ్. ఇప్పుడు తెలుగు సినిమా మాట్లాడుతోంది. భారతీయ చిత్ర పరిశ్రమ అంతా.. తెలుగు నుంచి ఏస్థాయి సినిమా వస్తుందో అని ఎదురుచూసేంతగా ఎదిగింది. ఇదంతా పైకి కనిపించేదేనా..? మేడి పండు చందమేనా..? లోలోపల అంతర్గతం వేరేనా..? అంటే పరిస్థితులు అవుననే సమాధానాలు కల్పిస్తున్నాయి. రీసెంట్ గా టాలీవుడ్ లో చెలరేగిన ఓ అంశం ఇందుకు ఊతమిస్తోంది. అదే.. ‘కిల్ రాజు’.

tollywood biggies to unite to control theatres system
tollywood biggies to unite to control theatres system

ఓపక్క ఓటీటీ గాలి దేశంలో విపరీతంగా వీస్తోంది. ప్రేక్షకులు సెల్ ఫోన్లో కూడా కొత్త సినిమాల నుంచి వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు చూసేస్తున్నారు. మరి ఈ సమయంలో ధియేటర్ల పరిస్థితేంటి.. ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచన అందరిలో ఉండాలి. కానీ.. అలా జరగడం లేదని ఇటివలి సంక్రాంతికి తేలి పోయింది. ధియేటర్ల సమస్యపై కొన్నేళ్లుగా ఎవరైనా ప్రస్తావించేది.. ‘ఆ నలుగురి’ గురించే. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లనును శాసిస్తోంది, ధియేటర్లను గుప్పిట్లో పెట్టుకుంది ఈ ‘నలుగురే’ అని తెర పైకి వస్తుంది. కానీ.. ఆ వెంటనే చల్లారి పోతుంది. కానీ.. ఈసారి గట్టిగా పేలింది. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఈ అంశాన్ని ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి లోలోపల జరుగుతుందేంటో బయటపెట్టాడు. ఆయన ‘దిల్ రాజు కాదు కిల్ రాజు’ అంటూ సంచలనం రేపాడు. కారణం.. తెలంగాణ రీజియన్ లో రవితేజ ‘క్రాక్’ సినిమాను శ్రీను తీసుకున్నాడు. ధియేటర్లు ఇవ్వాల్సింది దిల్ రాజు. కానీ.. సూపర్ కలెక్షన్లతో మంచి ధియేటర్లలో నడుస్తున్న ‘క్రాక్’ ను పక్కన పెట్టేసి తాను కొనుక్కున్న సినిమాలను వాటిలో ప్రదర్శించడమే శ్రీను కోపానికి కారణం.

గతంలో సినిమా వస్తే పండగ. కానీ.. ప్రస్తుతం పండగ సమాయాల్లో సినిమా రావాలి. రోజులు పోయి కలెక్షన్లే ప్రామాణికమైన ప్రస్తుత పరిస్థితుల్లో పండగ సమాయాల్లో సినమా వస్తే రెవెన్యూ గట్టిగా ఉంటుంది. ధియేటర్లలో సినిమా చూసే వారు తగ్గిపోతున్న ఈ సమయంలో పండగ సమయాల్లో మాత్రం జనాలు వస్తారు. ఇందులో ముఖ్యమైంది సంక్రాంతి, వేసవి, దసరా.. ముఖ్యమైనవి. ఈ సీజన్లలో సినిమాలు విడుదలకు భారీ పోటీ ఉంటుంది. కానీ.. ప్రతి ఏటా సంక్రాంతికి తమిళ సినిమాలు రావడం మొదలెట్టాయి. ఈ ఏడాది విజయ్ నటించిన మాస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు సమస్యంతా ఈ సినిమా చుట్టూనే తిరిగింది. హిట్ టాక్ వచ్చిన ‘క్రాక్’ ను తీసేసి మాస్టర్ సినిమా వేయడం.. అది కూడా దిల్ రాజు చేయడం శ్రీనును ఇబ్బంది పెట్టింది. మంచి ధియేటర్లలో ఫ్లాప్ సినిమా వేసి బలవంతంగా కలెక్షన్లు రాబట్టే ప్రయత్నంలో ఇదో భాగం అయింది. దీంతో హిట్టైన తెలుగు సినిమాను అంతగా బాలేని ధియేటర్లలో వేస్తే ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో ధియేటర్లు వ్యక్తుల చేతుల్లో ఉండి మంచి సినిమాకు రెవెన్యూ తెచ్చిపెట్టకపోవడం ఏంటో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. గతంలో పండగకు తమిళ రాకూడదని చెప్పిన దిల్ రాజే ఇప్పుడు మాస్టర్ సినిమాను నడిపించడం తగని పని అని అందరూ అంటున్నారు.

టాలీవుడ్ బిగ్గీస్ అల్లు అరవింద్, సురేశ్ బాబు, సునీల్, సుధాకర్ రెడ్డి, దిల్ రాజు.. ఇప్పుడీ అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇకపై సినిమాలకు ధియేటర్ల సమస్య రాకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. కానీ.. మళ్లీ మామూలే అవుతుందని అనేవారు లేకపోలేదు. ధియేటర్లు ఉండి రెవెన్యూ లేక నడపలేని వారు.. ఇలా పెద్దవాళ్ల చేతుల్లో ధియేటర్లు పెట్టి రెంట్ల మీద ధియేటర్లు నడుపుతున్నారు. ఇది ఒకరకంగా ధియేటర్ల మనుగడకు మంచిదే అయినా.. వ్యక్తుల చేతుల్లో మోనోపలి మాత్రం మంచిది కాదు. ఇలా అయితే.. కొత్తగా సినిమాల్లోకి వచ్చే వరంగల్ శ్రీను వంటి వారికి అన్యాయం జరగడమే కాదు.. పరిశ్రమలో ఏకచత్రాధిపత్యం రాజ్యమేలి ప్రేక్షకులకు మంచి సినిమా కూడా దరి చేరకపోవచ్చు. మనసులో ఎన్నున్నా.. తెలుగు సినిమా వెలగాలంటే మాత్రం పరిశ్రమ ధియేటర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N