NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Peddireddy : జగన్ అతి పెద్ద టార్గెట్..!! మంత్రి పెద్దిరెడ్డి నెరవేర్చగలరా..!?

Peddireddy X Chandrababu: CBN Target on Punganur But...?

YS Jagan పెట్టుకున్న అతి పెద్ద టార్గెట్ ని మంత్రి పెద్దిరెడ్డి Peddireddy  రామచంద్రారెడ్డి నెరవేర్చగలరా? ఇప్పుడిదే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ టార్గెట్ Chandrababu naidu సొంత నియోజకవర్గమైన ‘కుప్పం’. ఇక్కడ చంద్రబాబు నాయుడిపై పై చేయి సాధించాలనేది జగన్ టార్గెట్. 2024 ఎన్నికల్లో Kuppam లో చంద్రబాబు నాయుడిని ఓడించి తీరుతానని గతంలోనే శపథం చేశారు మంత్రి Peddireddy Ramachandra Reddy. అందుకనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారు కూడా. అవకాశం దొరికినప్పుడు కాదు.. నెలకోసారి ఖచ్చితంగా కుప్పంలో పర్యటించేలా Peddireddy ప్లాన్ కూడా చేసుకున్నారు. ఆమేరకు పర్యటిస్తున్నారు కూడా. అయితే.. అధినాయకత్వం ఆదేశాలను పెద్దిరెడ్డి పాటిస్తున్నంతగా లోకల్ క్యాడర్ అందుకు సహకరించడం లేదన్నది కుప్పంలో జరుగుతున్న వాస్తవం.

big target to peddireddy ramachandra reddy in kuppam
big target to peddireddy ramachandra reddy in kuppam

చంద్రబాబుకే ఝలక్..! Peddireddy

కుప్పం.. చంద్రబాబు నాయుడుకు కోట. దశాబ్దాలుగా ఆయన అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తున్నారు. అడపాదడపా ఆయన కుప్పంలో పర్యటించడమే కానీ.. ఎన్నికలప్పుడు అక్కడికి ప్రచారానికి కూడా వెళ్లరు. అలా.. చంద్రబాబుకు బలంగా ఉన్న ఆ కుప్పం కోటకు 2019 ఎన్నికల్లో బీటలు వారాయి. కౌంటింగ్ లో మొదటి మూడు రౌండ్లు చంద్రబాబుకు చెమటలు పట్టించాయి. మొత్తంగా నాలుగో రౌండ్ నుంచి పుంజుకుని మొత్తంగా 33వేలకు పైగా మెజారటీతో గట్టెక్కారు. ఈ విజయం పెద్దదే అయినా.. ప్రతిసారి 80వేల పైచిలుకు ఓట్ల తేడాతో నెగ్గే చంద్రబాబుకు ఈ సంఖ్య స్వల్ప మెజారిటీతో గట్టెక్కడం వంటిది. ఆస్థాయిలో చంద్రబాబును ఢీ కొట్టిన వైసీపీ ఇప్పుడదే వేగం, వ్యూహంతో బీటలు వారిన చంద్రబాబు కోటను ఏకంగా బద్దలుకొట్టాలని చూస్తోంది. చంద్రబాబుకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత జిల్లా చిత్తూరు. గత ఐదేళ్లలో జిల్లాలో వైసీపీ ప్రాబల్యాన్ని కాపాడింది, నిలబెట్టింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే. ఇప్పుడు ఆయనే చంద్రబాబును కుప్పంలో ఓడించాలని కంకణం కట్టుకున్నారు.

Peddireddy పెద్దిరెడ్డి ముందు వర్గపోరు..

ఎంతో పకడ్బందీగా వెళ్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థాని నాయకుల వర్గపోరు ఇబ్బందిగా మారుతోంది. నియోజకవర్గ ఇంచార్జిగా భరత్, కుప్పం మున్సిపాలిటీ బాధ్యతలు డాక్టర్ సుధీర్ చూస్తున్నారు. మంత్రి అండదండలతో మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవాలని సుధీర్ చూస్తున్నారు. అయితే.. స్థానికంగా వైసీపీకి బలమైన నాయకులైన సెంధిల్, మురుగన్ వర్గాలతోనే అసలైన సమస్య వారికి ఎదురవుతోంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో వీరిద్దరూ కలిసి పనిచేస్తేనే వైసీపీ బలంగా పని చేస్తుంది. ఇప్పుడు వీరిద్దరి మధ్య నడుస్తున్న వర్గపోరే ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతోంది. రీసెంట్ గా పెద్దిరెడ్డి కుప్పం పర్యటనలో వీరిద్దరి విబేధాలు బహిర్గతమయ్యాయి రెస్కో ఛైర్మన్ అయిన సెంథిల్ బస్టాండ్ ప్రాంతంలో బహిరంగసభ ఏర్పాట్లు చేసారు. పెద్దిరెడ్డికి సెంథిల్ కుప్పంలో ప్రధాన అనుచరుడు కాబట్టి మంత్రి హాజరయ్యారు. వన్నెకుల క్షత్రియ వర్గానికి చెందిన మురుగేష్ ఇదే సమయంలో మార్కెట్ యార్డులో సభ ఏర్పాట్లు చేసుకునిన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అక్కడికి కూడా వెళ్లారు. కుప్పంలో వన్నెకుల క్షత్రియులు ఎక్కువ. వారినీ కాదనలేక సభకు హాజరయ్యారు. ఇలా రెండు వర్గాలు మధ్య పోరు పెద్దిరెడ్డికి పెద్ద తలనొప్పిగా మారాయి.

జగన్ పంతం కుప్పంలో నెగ్గాలంటే..

రాజకీయ ఆలోచనలు నెరపడంలో పెద్దిరెడ్డిది కూడా అందె వేసిన చేయిగానే చెప్పాలి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జిల్లాలో కొందరు టీడీపీకి వలస వెళ్లిపోయారు. పెద్దిరెడ్డి టీడీపీ ఒత్తిళ్లకు లొంగలేదనేది ఓ వార్త. వైఎస్ కుటుంబ అభిమాని అయిన పెద్దిరెడ్డి జగన్ వెంటే ఉంటూ పార్టీని కాపాడారు. 2019లో వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చేలా చేశారు. దీంతో నియోజకవర్గంలో అత్యధిక పంచాయతీలు గెలిపించే బాధ్యత కూడా ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ఆయనకు అప్పగించారు. అధిష్టానం అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అంగ బలం, అర్ధ బలం ఎక్కువగా ఉన్న పెద్దిరెడ్డికి స్థానిక గ్రూపు రాజకీయాలు కలవరం పుట్టిస్తున్నాయి. ఏఒక్క వర్గానికీ తక్కువ చేయకుండా ప్రాధాన్యం ఇవ్వాలి. వీరిద్దరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చి వైసీపీ విజయం కోసం పని చేసేలా చూడాలి. కుప్పంపై ఇప్పటినుంచే పైచేయి సాధించాలనే సీఎం జగన్ ఆదేశాలను పెద్దిరెడ్డి సమర్ధవంతంగా పోషించాలి. ఇప్పటి విజయమే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో ఓడించడం సాధ్యమవుతుందనే విషయం పెద్దిరెడ్డికి కూడా తెలుసు. మరి ఆయన ఎటువంటి వ్యూహాలతో వెళ్తారో.. సెంధిల్, మురుగేశ్ మధ్య సఖ్యత ఎలా కుదురుస్తారో చూడాల్సి ఉంది.

 

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?