NewsOrbit
న్యూస్

మరో ఐదు రోజులే మిగిలింది

అమరావతి: ఓటర్ల జాబితాలో పేరుందో లేదో అందరూ ఒకసారి చూసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రజలకు సూచించారు. ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఐదు రోజుల సమయమే ఉందని ద్వివేది తెలిపారు. ఓటు లేని ప్రతి ఒక్కరూ ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.  ఎన్నికల షెడ్యూలు విడుదలైనందున ఓటరు జాబితాలో పేర్లు చేర్చేందుకే అవకాశం ఉంటుందని, తొలగింపు కుదరదని ద్వివేది స్పష్టం చేశారు. ఫారం-7 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ద్వివేది ఆదేశించారు.

ఫారం-7  దరఖాస్తులను స్వీకరించటం నిలిపివేయడంతో అధికారులు, ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఫారం-7 తెచ్చిన తంటాలు అన్నీ ఇన్ని కావు. ఫారం-7 పెట్టిన చిచ్చుతో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి పార్టీల మధ్య నేటికీ మాటల యుద్ధం కొనసాగుతున్నది.

అధికార టిడిపి సైబ‌ర్ క్రైంకు పాల్పడిందనీ, త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న వారి ఓట్ల‌ను తొలిగిస్తూ అనుకూలంగా ఓట్ల‌ను చేర్చుతుంద‌ని వైసిపి ఆరోపిస్తున్నది. టిడిపి అక్ర‌మాల‌ను అడ్డుకోవ‌టానికి తామే ఫారం -7 ద్వారా డూప్లికేట్ ఓట‌ర్ల వివ‌రాల‌ను ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్లామ‌ని జ‌గ‌న్ అన్నారు. ఫారం-7 దరఖాస్తు ఇచ్చినంత మాత్రాన ఓట్లను తొలగించరనీ, ఎన్నికల సంఘం పరిశీలించి న్యాయం చేస్తుందనీ ఆయన అంటున్నారు.

ఓటు లేకపోతే ఫారం-6 దరఖాస్తును మీ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి ఇచ్చి ఓటును నమోదు చేయించుకోవచ్చు. 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అన్నీ వివరాలు పొందవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 11 ఎన్నికలు జరగనున్నాయి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Leave a Comment