NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Vizag Steel Plant : మాటల్లేవ్ !మాట్లాడుకోడాల్లేవ్! స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో కేంద్రం అడుగు ముందుకే !

Vizag Steel Plant : జగన్ చేతిలో ఆయుధాలున్నాయ్..! బీజేపీని ఎదిరించగలరా..!?

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా,  ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నా..కేంద్రం దూకుడుగా ముందుకు వెళుతోంది. ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసినా…  బీజేపీ నేరుగా వెళ్లి వినతి పత్రాలు ఇచ్చినా.. ప్రతిపక్షాలు లేఖలు రాసినా.. ఎంపీలు, కేంద్ర మంత్రులు కలిసినప్పటికీ కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడంలేదు.

Center steps forward in case of vizag steel plant privatization!
Center steps forward in case of vizag steel plant privatization!

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు, ప్రైవేట్ బిడ్  దాఖలు చేసేందుకు కావలసిన టెక్నికల్ వివరాలతో పాటు.. ప్లాంట్‌కు సంబంధించిన వివరాలు, లాభనష్టాలు మొత్తం సమాచారాన్ని పంపించాల్సిందిగా  కేంద్ర ప్రభుత్వం తాజాగా మెయిల్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారమిచ్చింది.ఈ పరిణామాన్ని పరిశీలిస్తే విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ముందుకే వెళుతుందని స్పష్టమైన సంకేతం వస్తోంది

Vizag Steel Plant : జగన్ కేబినెట్ నిర్ణయం పై సిపిఎం అనుమానం!

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వద్దు ప్రత్యామ్నాయాలు చూడాలన్న జగన్ క్యాబినెట్ కాబినెట్ నిర్ణయంపై అనుమానాలున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు  బీవీ రాఘవులు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రైవటీకరణకు ప్రత్యామ్నాయం అంటే ఏమిటి?… భూములు అమ్ముతారా?… జాయింట్ వెంచర్ లా చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయనికి అర్ధం చెప్పాలని డిమాండ్ చేశారు. భూములు అమ్మాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. భూములు అమ్మకుండా వాటి విలువ ఆధారంగా నిధులు తెచ్చుకోవచ్చని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి ఉపసంహరణ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రత్యామ్నాయం పేరుతో దొడ్డిదారిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమానికి మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

ఇంటింటికి రేషన్ ఓ పద్మవ్యూహం!

నగర పాలక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయని..నగర పాలక సంస్థల్లో ప్రమాదకర సంస్కరణలు రాబోతున్నాయని తెలిపారు. నీటి మీటర్లు, ఆస్తి విలువ ఆధారిత పన్ను విధింపు, డ్రైనేజ్ పన్ను అమలు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు ఈ సంస్కరణలను వ్యతిరేకిస్తే, వైసీపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో అమలు చేయాలని చూస్తుందని బీవీ రాఘవులు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న ఈ సంస్కరణలను వ్యతిరేకించాలని..దీని వలన నగర ప్రజలపై పన్నుల రూపంలో పెను భారాలు పడతాయని అన్నారు. విద్యుత్ సవరణ 2020 చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం ఇక్కడ అమలు చేయాలని చూస్తుందని ఆగ్రహించారు. కేంద్రమే వెనక్కి తగ్గితే రాష్ట్రంలో మాత్రం ఆ చట్టాన్ని ఈస్ట్ అమలు చేయాలని చూస్తున్నారన్నారు. ఇంటింటికి రేషన్ అనేది భారతంలో పద్మవ్యూహం లాంటిదన్నారు. ప్రజలు పద్మవ్యూహంలోకి వెళ్లి రాలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. రేషన్‌కు వాలంటీర్, డిప, డోర్ డెలివరీ అంటూ మూడు కౌంటర్లు ఉన్నాయని… ప్రజలకు ఎటు వెళ్ళాలో అర్ధం కావడం లేదని అన్నారు. దీని వలన ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలని బీవీ రాఘవులు హితవుపలికారు.

 

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N