NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Local Body Elections : ఎస్ఈసీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన ఆ పార్టీలు

Local Body Elections : రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల సహకారంపై చర్చించేందుకు ఎస్ఈసీ నీలం సాహ్ని సమావేశం ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం ఎన్నికల సంఘ కార్యాలయంలో సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ బహిష్కరించాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత అఖిలపక్ష సమావేశం ఎందుకని ఈ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ కు వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో నిన్ననే ఎన్నికల నిర్వహణపై నోటిఫికేషన్ విడుదల చేసి నేడు అఖిలపక్ష సమావేశం అంటూ ఎస్ఈసీ.. పార్టీలను ఆహ్వానించడంతో  ఈ పార్టీలు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.

local body elections sec meeting
local body elections sec meeting

ఇప్పటికే జనసేన ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల ప్రక్రియను మొదటి నుండి ప్రారంభించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉన్నది. ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏడాది క్రితం నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తి అయ్యాయి. దీంతో నేరుగా ఈ నెల 8వ తేదీ పోలింగ్, 10 వ తేదీ లెక్కింపునకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అవసరం అయితే 9వ తేదీ రీపోలింగ్ నిర్వహించనున్నారు. కాగా ఎస్ఈసీ ఏర్పాటు చేసిన సమావేశానికి వైసీపీ తరపున లేళ్ల అప్పిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి మస్తాన్ వలీ, సీపీఎం నుండి వైవి రావు, టీఆర్ఎస్ ఆదినారాయణ హజరైయ్యారు.

మరో పక్క ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలా, లేక బహిష్కరించాలా అన్న విషయంపై టీడీపీ సమాలోచనలు చేస్తున్నది. నేడు చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న పొలిట్ బ్యూరో సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తుండగా ఎస్ఈసీ పాత నోటిఫికేషన్ అధారంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడంపై ఆయా పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Related posts

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?